Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

నాలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన

వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం మరికొద్ది గంటల్లో వాయుగుండంగా మారే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గడ్‌లకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను ఆనుకుని ఉన్న ఈ తీవ్ర అల్పపీడనం మరింత బలపడి, మరికొద్ది గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. రతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణశాఖాధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో సముద్రం అలజడిగా మారుతుందని, నాలుగురోజుల వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. ఉత్తరాంధ్ర, యానాంలో ఎల్లో బులెటిన్‌ హెచ్చరికను జారీ చేశారు. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో సోమ, మంగళవారాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారిణి నాగరత్న తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో కొద్ది గంటల్లోనే కుంభవృష్టి వర్షాలు కురుస్తాయని, వర్షాలు కురిసే సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వాతావరణశాఖ అధికారులు ఆరెంజ్‌ అలర్ట్‌ను ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img