Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

నైరుతి రుతుపవనాల కబురు వచ్చేసింది!

భారత్ లో అత్యధిక వర్షపాతం కలిగించే నైరుతి రుతుపవనాల సమాచారం వచ్చేసింది. నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది కొంచెం ఆలస్యంగా రానున్నాయి. జూన్ 4వ తేదీన కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1 నాటికి దేశంలో ప్రవేశిస్తాయి. ఈసారి నాలుగు రోజులు ఆలస్యం కానుంది.ఇక, ఈ ఏడాది రుతుపవనాలు సాధారణ వర్షపాతాన్ని అందిస్తాయని ఐఎండీ తెలిపింది. భారత్ లోకి ప్రవేశించిన రుతుపవనాలు ఎంత త్వరగా మిగతా భాగాలకు వ్యాపిస్తాయన్న దానిపై ఆ ఏడాది వర్షపాతం ఆధారపడి ఉంటుంది. రుతుపవనాలు ఆలస్యంగా విస్తరిస్తే ఆ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని, రుతుపవనాలు త్వరగా విస్తరిస్తే సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని నిపుణులు చెబుతుంటారు. ఐఎండీ ఇటీవల వెలువరించిన అంచనాల నివేదికలో… భారత్ లో ఈ ఏడాది నైరుతి సీజన్ లో 96 శాతం వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. ఈ అంచనా 5 శాతం అటూ ఇటూగా ఉండొచ్చని వివరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img