Friday, April 26, 2024
Friday, April 26, 2024

పరంబీర్‌ సింగ్‌కు సుప్రీంకోర్టులో ఊరట


న్యూదిల్లీ: బలవంతపు వసూళ్ల కేసులో ముంబై మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడిరచింది. అదే సమయంలో కేసుల దర్యాప్తునకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది. బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పరంబీర్‌ సింగ్‌ కొన్ని నెలలుగా కన్పించకుండా పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన దేశం విడిచి పారిపోయారనే ఆరోపణలు వచ్చాయి. ఇదిలా ఉండగా.. తనపై నమోదైన కేసుల్లో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై గతవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. ముందు ఆయన ఎక్కడున్నారో చెప్పాలని పరంబీర్‌ న్యాయవాదిని ఆదేశించింది. ఆ తర్వాతే పిటిషన్‌పై విచారిస్తామని స్పష్టం చేసింది. అయితే పరంబీర్‌ ఎక్కడికీ పారిపోలేదని, భారత్‌లోనే ఉన్నారని ఆయన తరపు న్యాయవాది సోమవారం కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు.. పరంబీర్‌కు అరెస్టు నుంచి రక్షణ కల్పించింది. అయితే తప్పనిసరిగా దర్యాప్తునకు హాజరుకావాలని ఆదేశించింది. దీంతో పాటు ఆయన పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను డిసెంబరు 6వ తేదీకి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img