Friday, April 26, 2024
Friday, April 26, 2024

పారాసిటమాల్‌ ట్యాబ్లెట్‌ ధర ఇకపై రూ. 2.76.. సవరించిన ఎన్‌పీపీఏ

మెడికల్‌ షాపుల్లో మందులను ఇష్టం వచ్చిన ధరలతో విక్రయించకుండా నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ (ఎన్‌పీపీఏ) చర్యలు చేపట్టింది. 128 రకాల ఔషధాల ధరలను సవరిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఎన్‌పీపీఏ తాజా ధరల సవరణ ప్రకారం.. ఇకపై సిట్రిజన్‌ ట్యాబ్లెట్‌ను రూ. 1.68, పారాసిటమాల్‌ను రూ. 2.76, ఇబుప్రొఫెన్‌ (400 ఎంజీ) రూ.1.07కు విక్రయించాల్సి ఉంటుంది. అలాగే, డయాబెటిస్‌ రోగులు ఉపయోగించే గ్లిమెపిరైడ్‌, వోగ్లిబొస్‌, మెట్‌ఫార్మిన్‌ ధరను రూ. 13.83గా నిర్ణయించింది. ఎన్‌పీపీఏ సవరించిన ధరల జాబితాలో యాంటీబయాటిక్‌ ఇంజెక్షన్లు అమోక్సిసిలిన్‌, క్లవ్లానిక్‌ యాసిడ్‌, ఆస్తమా రోగులు వేసుకునే సాల్బుటమాల్‌, కేన్సర్‌ ఔషధం ట్రస్టుజుమాబ్‌, బ్రెయిన్‌ ట్యూమర్‌ చికిత్సకు ఉపయోగించే టెమోజోలోమైడ్‌ వంటివి ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img