Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

పెరిగిన విద్యుత్‌ వినియోగం

ఏప్రిల్‌`నవంబరులో 11శాతంగా నమోదు

న్యూదిల్లీ: ఈ ఆర్థికసంవత్సరం ఏప్రిల్‌నవం బరులో విద్యుత్‌ లోటు 0.6శాతం మేర పెరుగగా విద్యుత్‌ డిమాండ్‌ ఏకంగా 11శాతం పెరిగింది. 2022 ఏప్రిల్‌ నవంబరులో విద్యుత్‌ లోటు 5,691 మిలియన్‌ యూనిట్లు (ఎంయూ)గా ఉంటే అంతకుముందు సంవత్సరం ఇదే సమయానికి అది 4,058 ఎంయూ లుగా ఉన్నదని ప్రభుత్వ డేటా తెలిపింది. సాంకేతిక కారణాలతోనే విద్యుత్‌ లోటు సంభవిస్తుందన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. భారత్‌ విద్యుత్‌ మిగులు దేశం కాగా కొన్నిసార్లు డిస్కమ్‌లు సక్రమంగా పనిచేయలేక పోతున్నాయని, ఇందుకోసం నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేసేందుకు నిధుల కొరతే కారణమని వారన్నారు. విద్యుత్‌ తయారీదారులు 10,12,249 ఎంయూలను ఏప్రిల్‌నవంబరులో సరఫరా చేయగా విద్యుత్‌ డిమాండు 10,17,940 ఎంయూలుగా ఉండటంతో 0.6శాతం లోటు నమోదైంది. అదే విధంగా 2021 ఏప్రిల్‌నవంబరులో 9,20,587 ఎంయూలకు డిమాండ్‌ ఉంటే సరఫరా అయినది 9,16,529 ఎంయూలు కావడంతో 0.4శాతం విద్యుత్‌ లోటు ఏర్పడిరది. 202021లో కోవిడ్‌ కారణంగా మందగించిన వాణిజ్యపారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకున్నాయనేందుకు విద్యుత్‌ డిమాండ్‌ పెరగడమే నిదర్శనమని నిపుణులు అన్నారు. 2002 ఏప్రిల్‌నవంబరులో విద్యుత్‌ వినియోగం 10శాతం పెరిగి 10,12,249 ఎంయూలకు చేరింది. అంతకుముందు ఏడాది 9,16,529 ఎంయూల విద్యుత్‌ వినియోగమైంది. రానున్న రోజుల్లో విద్యుత్‌ వినియోగండిమాండు రెండంకెల వృద్ధిని నమోదు చేస్తాయని నిపుణులు చెప్పారు. విద్యుత్‌ డిమాండు 2021 డిసెంబరు 183.24జీడబ్ల్యూ కాగా 2022 నవంబులో 187.38జీడబ్ల్యూ కాగా 2022 డిసెంబరులో 202 జీడబ్ల్యూకుపైగా విద్యుత్‌ రోజువారీ వినియోగమైనట్లు ప్రభుత్వ డేటా చెబుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img