Friday, April 26, 2024
Friday, April 26, 2024

ప్ర‌మాదంలో మా ప్ర‌జాసామ్యం అమెరికా యూర‌ప్ లు జోక్యం చేసుకోవాల‌న్న రాహుల్

లండన్‌ పర్యటనలో ఉన్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు. తన వారం రోజు ల యూకే పర్యటనను ముగించడానికి ముందు తన విమర్శలకు పదునుపెంచారు. మంగళవారం సాయ ంత్రం లండన్‌లోని చాథంహౌస్‌ థింక్‌ ట్యాంక్‌లో జరిగిన సంభాషణ సెషన్‌లో రాహుల్‌ ప్రసంగించా రు. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందన్న ఆయన, ఈ విషయంలో అమెరికా, యూరప్‌ జోక్యం చేసుకోవాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. మా దేశం నుంచి వ్యాపారం, వాణిజ్యం ద్వారా డబ్బు సంపాదిస్తున్న ఈదేశాలు, ప్రజాస్వామ్య పునరుద్ధర ణను పట్టించుకోవడం లేదు. ఇందుకోసం చేయాల్సి నంత చేయడం లేదు. ప్రజాస్వామ్య పరిరక్షకులుగా చెప్పుకుంటున్న యూరప్‌, అమెరికా దేశాలు, భారత్‌లో అణచివేతకు గురవుతున్న ప్రజా స్వామ్యం గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు కూడా ఈ అంశంపై గొంతెత్తాలని సూచించారు. మాతృదేశంలో ప్రజాస్వామ్య పరి రక్షణ అన్నది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీ యుడి విధి. ప్రపంచంలో ఎక్కడున్నా సరే.. మాతృ దేశ ప్రాథమిక విలువలు, మనం ఎంతగానో ప్రేమించే ప్రజాస్వా మ్యం పరిరక్షణకు గొంతెత్తాలి అని రాహుల్‌ సూచిం చారు. భారత ప్రజాస్వామ్యానికి చేయాల్సిన మరమ్మ త్తు పనులను చేపట్టేందుకు ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img