Friday, April 26, 2024
Friday, April 26, 2024

బస్సుల కొనుగోలు వ్యవహారంపై సీబీఐ విచారణ షురూ..

ఢల్లీి ప్రభుత్వం బస్సుల కొనుగోలులో అవినీతికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గురువారం ఆదేశించింది. 1,000 లో-ఫ్లోర్‌ ఎయిర్‌ కండిషన్డ్‌ సీఎన్‌జీ బస్సులను కొనేందుకు నిధుల మంజూరుకు ఢల్లీి ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ ఈ ఏడాది జనవరిలో ఆమోదం తెలిపింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ నియమించిన కమిటీ ఈ వ్యవహారంపై సవివరమైన దర్యాప్తు జరిపించాలని సిఫారసు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నివేదికను పరిశీలించిన కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో విచారణను ప్రారంభించిన సీబీఐ బస్సుల కొనుగోలుకు సంబంధించిన విషయాలను ఆరాతీస్తున్నది. దిల్లీలో 1,000లో ఫ్లోర్‌ బస్సులను కొనుగోలు చేసేందుకు ఢల్లీిలోని అరవింద్‌ కేజ్రీవాల్‌ నాయకత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఏఏపీ) రెండు కంపెనీలతో ఒప్పందం చేసుకున్నది. ఈ బస్సుల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని బీజేపీ నాయకులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి ఫిర్యాదు చేశారు. సీబీఐ విచారణకు బీజేపీ నేతలు డిమాండు చేశారు. కాగా బస్సుల కొనుగోలు వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం వేధింపుల్లో భాగమేనని ఢల్లీి రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో ఆరోపించింది. అవినీతి జరిగినట్లు వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img