Friday, April 26, 2024
Friday, April 26, 2024

రైతు చట్టాలు భేష్‌ – అయినా చర్చకు సిద్ధమే : రాజ్‌నాథ్‌

పంచకుల : మోదీ సర్కారు తీసుకొచ్చిన మూడు వ్యవసాయాల చట్టాలను కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సమర్ధించుకున్నారు. ఈ చట్టంలో రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏదైనా క్లాజు (నిబంధన) ఉన్నట్లు భావిస్తే అన్నదాతలతో చర్చలకు తమ ప్రభుత్వం సిద్ధమేనని చెప్పుకొచ్చారు. చట్టాలను పూర్తిగా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉందని రాజ్‌నాథ్‌ నొక్కి చెప్పారు. ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయని, దీనిని రైతులు అర్థం చేసుకోవాలని సూచించారు. సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండు చేస్తూ గతేడాది నవంబరు నుంచి రైతులు దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న విషయం విదితమే. ప్రత్యేకించి పంజాబ్‌, హరి యాణా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ రైతులు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నారు. బడా కార్పొరేట్‌ శక్తులకు లబ్ధి చేకూర్చేందుకు కేంద్రం ఈ చట్టాలు తీసుకొచ్చిందని, వీటివల్ల మండీ, ఎంఎస్‌పీ సేకరణ వ్యవస్థలు పూర్తిగా కనుమరుగవుతాయని రైతు సంఘాలు ఆరోపిస్తు న్నాయి. ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన కింద గురువారం ఇక్కడ జరిగిన రాష్ట్రవ్యాప్త అన్న పూర్ణ కార్యక్రమంలో ఆన్‌లైన్‌ ద్వారా రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రసంగించారు. రైతు సంక్షేమం కోసం నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రాజ్‌నాథ్‌ కొని యాడారు. ‘మా ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చింది. ఈ చట్టాలను పూర్తిగా అవగా హన చేసుకోవాల్సిన అవసరం ఉంది. చట్టాలపై వ్యతిరేకత సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతు న్నాయి. ఈ విషయాన్ని రైతు సోదరులు అర్థం చేసు కోవాలని కోరుతున్నా’ అని కేంద్రమంత్రి అన్నారు. కనీస మద్దతు ధరపై గందరగోళం వ్యాప్తికి ప్రయత్ని స్తున్నారని ఎదురుదాడికి దిగారు. రైతులు వాస్తవాలు అర్థం చేసుకోవడం ప్రారంభమైందని, తమ లాభనష్టాలు అంచనా వేయడం ఆరంభమైందని రాజ్‌నాథ్‌ చెప్పారు. సాగు చట్టాల గురించి తాను పూర్తిగా అధ్యయనం చేశానని, మన రైతు సోదరు లకు నష్టం కలిగించే ఒక్క అంశం కూడా అందులో లేదని నమ్మబలికారు. ఏమైనా ఇబ్బంది ఉందని ఎవరైనా భావిస్తే దానిపై చర్చలకు తమ ప్రభుత్వం సుముఖంగా ఉందని చెప్పారు. రైతు సంక్షేమం కోసం మోదీ సర్కారు చేపట్టిన చర్యల జాబితాను మంత్రి ఏకరువు పెట్టారు. ఒకటిన్నర రెట్లు కనీస మద్దతు ధర పెంచిందని, సన్నకారు రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు కల్పిస్తున్నదని తెలిపారు. రూ.1.50 లక్షల కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. దేశ చరిత్రలో ఇంతటిసాయం ఎవరూ చేయలేదని చెప్పారు. రైతుల సాధికారత, పటిష్టత కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img