Friday, April 26, 2024
Friday, April 26, 2024

బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కు సీబీఐ సమన్లు

ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ లో తేజస్వికి సమన్లు
ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ లో బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ అగ్ర నేత తేజస్వి యాదవ్ కు సీబీఐ సమన్లు జారీ చేసింది. తన తల్లిదండ్రులైన బీహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలు ప్రసాద్ యాదవ్, రబ్రీదేవిలను విచారించిన సీబీఐ అధికారులు… రోజుల వ్యవధిలోనే తేజస్వికి సమన్లను పంపడం గమనార్హం. ఈ కేసులో లాలు కుమార్తెలు మిసా భారతి, హేమలు కూడా ఉన్నారు. తేజస్వికి సీబీఐ సమన్లు ఇవ్వడం ఇది రెండోసారి. ఫిబ్రవరి 4న ఆయనకు తొలిసారి సమన్లు జారీ చేశారు.2022 మే నెలలో సీబీఐ వీరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వ్యవసాయ భూములు ఇచ్చి 12 మంది రైల్వే శాఖలో ఉద్యోగాలను పొందినట్టు సీబీఐ పేర్కొంది. 2004 నుంచి 2009 మధ్యలో లాలు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఈ స్కామ్ జరిగిందని సీబీఐ ఆరోపిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img