Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రాహుల్‌ జోడో యాత్ర ఆపడానికి కేంద్రం కుట్రలు

కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యదర్శి సోనియా శీనా
విశాలాంధ్ర` ఉరవకొండ : కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడోయాత్ర కు దేశవ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని దీనిని ఓర్వలేని కేంద్ర ప్రభుత్వం కరోనా సాకుతో యాత్రను ఆపడానికి కుట్రలు చేయడం శోచనీయమని అనంతపురం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యదర్శి సోనియా శీనా అన్నారు. శనివారం ఉరవకొండలో ఆ పార్టీ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాహుల్‌ యాత్ర వల్ల కేంద్రంలో బిజెపి ప్రభుత్వానికి పతనం ప్రారంభం అయిందని,బిజెపి పార్టీ అనుసరిస్తున్న విచ్ఛిన్నకర, విద్వేశపూరత అంశాలను రాహుల్‌ గాంధీ ప్రస్తావిస్తూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నాడని వీటిని బిజెపి ఏమాత్రం జీర్ణించుకోలేకపోతుందని విమర్శించారు. రాహుల్‌ యాత్ర ఢల్లీి,కాశ్మీర్లో కొనసాగితే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి గడ్డ పరిస్థితులు ఎదురవుతాయని తెలిసే ఎలాగైనా యాత్రను ఆపడానికి సాకులు వెతుకుతుందన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలలో రాహుల్‌ జూడో యాత్రకు విశేష స్పందన లభించిందన్నారు. జోడో యాత్రను ప్రచారం చేయకుండా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మీడియాను సైతం తమ గుప్పెట్లో పెట్టుకుందన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు అనేక బహిరంగ సభలు యాత్రలు ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తున్నారని కరోనా నిబంధనలు వారికి వర్తించవా అనే ప్రశ్నించారు, దేశంలో సెక్యులరిజం,రాజ్యాంగ విలువలు పతనమవుతున్నాయని దేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్‌ పార్టీని కోరుకుంటున్నారని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని వారు పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో డిసిసి సభ్యులు అబ్బాస్‌, కాంగ్రెస్‌ పార్టీ ఉరవకొండ మండల కన్వీనర్‌ ఓబులేసు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img