Friday, April 26, 2024
Friday, April 26, 2024

లఖింపూర్‌ మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు

చత్తీస్‌గఢ్‌, పంజాబ్‌ ప్రభుత్వాల ప్రకటన
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరిలో జరిగిన హింసలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతులు, జర్నలిస్టు కుటుంబాలకు రూ.50లక్షలు చొప్పున నష్టపరిహారం ఇస్తామని చత్తీస్‌గఢ్‌, పంజాబ్‌ రాష్ట్రాల ప్రభుత్వాలు బుధవారం ప్రకటించాయి. ఈ రెండు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ పార్టీ నేత రాహుల్‌గాంధీతో కలిసి లక్నోకు చేరుకొన్నారు. అక్కడ నుంచి లఖింపూర్‌ఖేరికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. అక్కడ విలేకరులతో మాట్లాడిన పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ.. లఖింపూర్‌ హింసాకాండ 1919 నాటి జలియన్‌వాలాబాగ్‌ మారణహోమాన్ని గుర్తుచేసిందని అన్నారు. యూపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని విమర్శించారు. చనిపోయిన నలుగురు రైతులతో పాటు జర్నలిస్టు కుటుంబానికి రూ.50లక్షలు చొప్పున తమ ప్రభుత్వం ఇవ్వనున్నట్లు చన్నీ తెలిపారు. చత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ బాఘెల్‌ కూడా చన్నీతో ఏకీభవించారు. తమ తరపున మరో రూ.50లక్షలను ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img