Friday, April 26, 2024
Friday, April 26, 2024

వైద్య విద్య కోసం విదేశాలకెందుకు?

కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూదిల్లీ: విద్యార్థులపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. విదేశాల్లో ఎంబీబీఎస్‌ చేస్తున్న విద్యార్థులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా జోషి మాట్లాడుతూ.. విదేశాల్లో మెడిసిన్‌ విద్యను అభ్యసించిన 90 శాతం భారత విద్యార్థులు ఇండియాలో క్వాలిఫైయింగ్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోతున్నారని విమర్శించారు. ఉత్తీర్ణత సాధించలేనప్పుడు విదేశాల్లో చదవడం ఎందుకని ప్రశ్నించారు. విదేశాలకు వెళ్లే భారతీయుల్లో 60శాతం మంది చైనా, రష్యా, ఉక్రెయిన్‌లకు వెళ్తున్నారని తెలిపారు. వీరిలో ఎక్కువ శాతం మంది చైనాలో విద్యను అభ్యసించేందుకే మొగ్గు చూపుతున్నట్టు పేర్కొన్నారు. కాగా, విదేశాల్లో మెడిసిన్‌ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు స్వదేశంలో ప్రాక్టీస్‌ చేయాలంటే ఫారెన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్స్‌ పరీక్షలో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి. పరీక్షలు పాస్‌ అయితేనే వారికి భారత్‌లో ప్రాక్టీస్‌ చేసుకునేందుకు అనుమతి లభిస్తుంది. ఇదిలా ఉండగా మంత్రి వ్యాఖ్యలపై విద్యార్థులు, ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. దేశంలో మెడికల్‌ కాలేజీలు, సీట్లు తక్కువగా ఉన్నాయని ఆరోపించారు. నీట్‌లో తాము అర్హత సాధించినప్పటికీ సీట్ల సంఖ్య తక్కువగా ఉండటంతో తమకు నష్టం జరుగుతోందన్నారు. స్వదేశంలో ఎంబీబీఎస్‌ చదివిన డాక్డర్లు మాత్రం ఉండి ఉంటే దేశంలో డాక్టర్ల కొరత తీవ్రంగా ఉండేదన్నారు. మరోవైపు మంత్రి వ్యాఖ్యలపై పత్రిపక్ష నేతలు అభ్యంతరం తెలుపుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img