Friday, April 26, 2024
Friday, April 26, 2024

షావోమి ఇండియాకు ఈడీ షాక్‌

రూ.5551 కోట్లు జప్తు
న్యూదిల్లీ: చైనాకు చెందిన దిగ్గజ మొబైల్‌ ఉత్పత్తుల సంస్థ షావోమీకి భారత్‌లో గట్టి షాక్‌ తగిలింది. విదేశీ మారక చట్టం (ఫెమా) నిబంధనల ఉల్లంఘనల కింద షావోమీ టెక్నాలజీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన బ్యాంకు ఖాతాల్లోని రూ.5551.27కోట్ల డిపాజిట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు జప్తు చేసినట్టు ఈడీ శనివారం వెల్లడిరచింది. చైనాకు చెందిన షావోమి గ్రూప్‌ అనుబంధ సంస్థ అయిన షావోమి ఇండియా భారత్‌లో 2014 నుంచి కార్యకలాపాలు సాగిస్తోంది. ఆ తదుపరి సంవత్సరం నుంచే ఈ కంపెనీ ఇతర దేశాలకు అక్రమంగా నిధులను తరలిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ‘‘ఈ కంపెనీ గత కొన్నేళ్లుగా రూ.5551.27కోట్ల సమానమైన విదేశీ నిధులను మూడు దేశాల్లో పనిచేస్తున్న మూడు సంస్థలకు అక్రమంగా పంపించింది. షావోమి గ్రూప్‌తో పాటు అమెరికాలో ఉన్న మరో రెండు సంస్థలకు ఈ నిధులు చేరాయి. మాతృ సంస్థ ఆదేశాలతోనే రాయల్టీల రూపంలో ఈ భారీ మొత్తాన్ని బదిలీ చేసింది. సదరు సంస్థల నుంచి ఎలాంటి సేవలను పొందకుండానే ఈ నగదును పంపించింది. ఇది ఫెమా చట్ట నిబంధనలకు విరుద్ధం. అంతేగాక, బ్యాంకులను తప్పుదోవ పట్టించి ఈ నిధులను విదేశాలకు చేరవేసింది’’ అని ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కేసు విచారణలో భాగంగానే షావోమి ఇండియా గ్గోలబ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మను కుమార్‌ జైన్‌కు ఈడీ ఇటీవల ప్రశ్నించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img