Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సామాజిక న్యాయపోరాటానికి ఎదురుదెబ్బ.. : సీఎం స్టాలిన్‌

సుప్రీంకోర్టు తీర్పు దురదృష్టకరమని తమిళనాడు అని సీఎం స్టాలిన్‌ అన్నారు. ఇది శతాబ్దాలుగా సాగుతున్న సామాజిక న్యాయం పోరాటానికి ఎదురుదెబ్బ తగిలిందని అభిప్రాయం పడ్డారు. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనకబడిన వారికి (ఈడబ్ల్యూఎస్‌) రిజర్వేషన్‌ కల్పించడాన్ని సుప్రీంకోర్టు సమర్ధించింది. ఈ నిర్ణయాన్ని బీజేపీ, కాంగ్రెస్‌ తోపాటు ఇతర పార్టీలు స్వాగతించాయి. కానీ తమిళనాడు స్టాలిన్‌ ప్రభుత్వం దానిని తీవ్రంగా వ్యతిరేకించింది. చట్టాన్ని రద్దు చేసేంత వరకు తన పోరాటం కోనసాగుతుందని తెలిపింది. సుప్రీం కోర్టు నిర్ణయంపై రివ్యూ పిటిషన్‌ వేయనున్నట్లు డీఎంకే ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు సీఎం స్టాలిన్‌ తన లాయర్ల అభిప్రాయాన్ని తీసుకుంటున్నారట. ఈడబ్ల్యూఎస్‌ కోటాను తమిళనాడు స్టాలిన్‌ ప్రభుత్వం మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. ఈ రిజర్వేషన్ల కింద రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో కేంద్ర నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ అంశంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లలో డీఎంకే ప్రభుత్వం ఒకటి. ఈ అంశంపై సుప్రీం కోర్టు నిర్ణయం తర్వాత..డిఎంకె నాయకుడు టి.తిరేమావలన్‌ మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు నిర్ణయంపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసే అంశాన్ని పార్టీ పరిశీలిస్తోందని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img