Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

స్పుత్నిక్‌ వాక్సిన్‌ ఉత్పత్తి షురూ


మొరేపెన్‌ ల్యాబ్స్‌.. టెస్ట్‌ బ్యాచ్‌ సిద్ధం
న్యూదిల్లీ : రష్యా స్పుత్నిక్‌ వి కొవిడ్‌`19 వాక్సిన్‌ తయారీ భారత్‌లో మొదలైంది. మొరేపెన్‌ ల్యాబరేటరీస్‌ తన హిమాచల్‌ ప్రదేశ్‌ యూనిట్‌లో ఈ కార్యానికి శ్రీకారం చుట్టినట్లు రష్యా ప్రత్యక్ష పెట్టుబడి నిధి (ఆర్‌డీఐఎఫ్‌), స్వదేశీయ ఔషధ సంస్థ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. క్వాలిటీ కంట్రోల్‌ కోసం వాక్సిన్‌ తొలి బ్యాచ్‌ను గమాలయా కేంద్రానికి పంపనున్నట్లు వెల్లడిరచింది. ఆర్‌డీఐఎల్‌, మొరేపెన్‌ లేబరేటరీస్‌ ఈ వాక్సిన్‌ తయారీ కోసం జూన్‌లో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని పరస్పరం పంచుకుంటోంది. ‘మహమ్మారి అంతం కాలేదు. అది కొత్త రూపాల్లో మరింత భయానకరంగా విజృంభిస్తూ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో స్పుత్నిక్‌ వి ఉత్పత్తి సామర్థ్యాలను ఆర్‌డీఐఎఫ్‌ పెంచుకుంటోంది’ అని ఆర్‌డీఐఎఫ్‌ సీఈవో కిరిల్‌ దిమిత్రీవ్‌ తెలిపారు. ఆర్‌డీఐఎఫ్‌ ఇప్పటికే గ్లాండ్‌ పార్మా, హెటరో బయో ఫార్మా, పనాకే బయోటెక్‌, స్టెలిస్‌ బయోఫార్మా, విర్చోబయోటెక్‌ వంటి భారతీయ కంపెనీలతో వాక్సిన్‌ కోసం ఒప్పందాలు చేసుకుంది. ఏడాదికి మొత్తం 850 మిలియన్‌ డోసుల ఉత్పత్తి జరిగేలా ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రకటన పేర్కొంది. ఆర్‌డీఐఎఫ్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని మొరేపెన్‌ ల్యాబరేటరీస్‌ చైర్మన్‌, ఎండీ శుశీల్‌ సూరి పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img