Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

13 ఏళ్ల నాటి కేసులో లాలూకు జరిమానా

పాట్నా: 13 ఏళ్ల నాటి కేసులో ఆర్జేడీ అధినేత, బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు కోర్టు జరిమానా విధించింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘించినందుకు గాను ఆయనకు రూ.6వేల జరిమానా విధిస్తున్నట్లు జార్ఖండ్‌లోని ప్రత్యేక కోర్టు బుధవారం ప్రకటించింది. 2009 నాటి ఈ కేసులో ఆయన ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు ముందు తాజాగా హాజరయ్యారు. ‘లాలూ ప్రసాద్‌ పిటిషన్‌ను విచారించిన అనంతరం ఆయనకు కోర్టు రూ.6వేల జరిమానా విదించింది. అంతే కాకుండా ఈ కేసు ఇంతటితో పరిష్కరించబడిరది. ఈ కేసు విషయంలో లాలూ మళ్లీ ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు’ అని లాలూ న్యాయవాది పేర్కొన్నారు. 2009లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో లాలూ హెలికాఫ్టర్‌ను ల్యాండిరగ్‌ కోసం ఏర్పాటు చేసిన ప్రదేశంలో కాకుండా పంటపొలాల్లో ల్యాండ్‌ చేయడంపై కేసు నమోదైంది. ఎన్నికల నియమావళికి ఇది విరుద్ధమని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img