Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

18న ఆటో, క్యాబ్‌ డ్రైవర్ల సమ్మె

న్యూదిల్లీ: తాజాగా సీఎన్‌జీ ధర రూ.2.50 పెరగడంలో ఆటో, ట్యాక్సీ, క్యాబ్‌ డ్రైవర్ల అసోసియేషన్‌ సమ్మె చేస్తామంటూ అధికారులను హెచ్చరించింది. ఈనెల 18 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించింది. తక్షణమే సీఎన్‌జీపై సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. ఈనెల 11న దిల్లీలోని సెక్రటేరియేట్‌ దగ్గర వందలాది సంఖ్యలో ఆటో, ట్యాక్సీ, క్యాబ్‌ డ్రైవర్లు నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నిరసన దిల్లీ ఆటో రిక్షా సంఫ్‌ు తరపున చేపట్టారు. దిల్లీ ఆటో రిక్షాసంఫ్‌ు ప్రధాన కార్యదర్శి రాజేంద్ర సోని మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాలపైనే తమ పోరాటమని, ఏప్రిల్‌ 18 నుంచి సమ్మె చేయనున్నట్టు ప్రకటించారు. ఉన్నపళంగా ధరలు పెరిగిన కారణంగా తమపై ఎలాంటి ప్రభావం చూపిందో మాట్లాడుతూ ‘సీఎన్‌జీ ధరలు పెరగడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మేం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసేదేమంటే… తక్షణమే కేజీ సీఎన్‌జీ గ్యాస్‌పై రూ.35 సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. గడచిన ఏడేళ్లుగా దిల్లీ ప్రభుత్వం ఆటో రిక్షా అసోసియేషన్‌ సభ్యులను ఒక్కసారి కూడా సమావేశానికి పిలవలేదని ఆయన వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img