Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

2030నాటికి వస్త్రాల ఎగుమతుల లక్ష్యం 100 బిలియన్‌ డాలర్లు

న్యూదిల్లీ: దేశంలో 2030 నాటికి వస్త్రాల ఎగుమతుల లక్ష్యం 100 బిలియన్‌ డాలర్లుగా పెట్టుకున్నట్టు కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. ఈ రంగంలో ఆరోగ్యకరమైన అభివృద్ధి కనబడుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ రంగానికి యూఏఈ, ఆస్ట్రేలియాల్లో సున్నా శాతం ఎక్సైజ్‌ డ్యూటీ కారణంగా ఎగుమతులు మరింత ఊపందుకున్నాయని గోయల్‌ వివరించారు. రెండు దేశాలతో భారత్‌కు సత్సంబంధాలు ఉన్నాయని ఆయన తెలిపారు. యూరోపియన్‌ యూనియన్‌, కెనడా, యూకే, గల్ఫ్‌ కార్పొరేషన్‌ కౌన్సిల్‌ మార్కెట్‌లలో భారత్‌ కూడా సున్నా శాతం ఎక్సైజ్‌ డ్యూటీకి ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు. గత ఆర్థిక సంవంత్సరం వస్త్రాల ఎగుమతులు 43 బిలియన్‌ డాలర్లు కాగా, అంతకుముందు సంవత్సరం 33 బిలియన్‌ డాలర్లు జరిగిందని వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img