Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

24 వరకు చండీగఢ్‌ వర్సిటీ బంద్‌…

హాస్టల్‌ వార్డెన్‌ సస్పెండ్‌..
పంజాబ్‌లోని చండీగఢ్‌ యూనివర్సిటీలో గర్ల్స్‌ హాస్టల్‌ వార్డెన్‌ రజ్విందర్‌ కౌర్‌ను సస్పెండ్‌ చేశారు. విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తించిన ఘటనలో కౌర్‌ను సస్పెండ్‌ చేశారు. గర్ల్స్‌ హాస్టల్‌కు చెందిన కొందరి అమ్మాయిల ప్రైవేటు వీడియోలు లీకైన కేసులో అధికారులు చర్యలు తీసుకున్నారు. వర్సిటీని శనివారం వరకు మూసి వేస్తున్నట్లు అధికారులు చెప్పారు. దీంతో ఇవాళ తమ పిల్లల్ని తీసుకువెళ్లేందుకు విద్యార్థినుల పేరెంట్స్‌ వర్సిటీకి వచ్చారు. ఓ అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌కు అభ్యంతరకరమైన కొన్ని వీడియోలను షేర్‌ చేసింది. ఆ వీడియోలను అతను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. దీంతో వర్సిటీ గర్ల్స్‌ హాస్టల్‌లో ఆందోళన చెలరేగింది. వీడియోలను రిలీజ్‌ చేసిన అమ్మాయిని అరెస్టు చేస్తున్న సమయంలో పోలీసుల్ని హాస్టల్‌ వార్డెన్‌ అడ్డుకున్నట్లు తెలిసింది. నిరసన చేసిన విద్యార్థినిలను కూడా ఆమె తిట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం నాలుగు వీడియోలను ఓ అమ్మాయి తన స్నేహితుడికి పంపించింది. వర్సిటీ వద్ద ఎటువంటి సూసైడ్‌ ప్రయత్నం జరగలేదని పోలీసు ఆఫీసర్‌ నవ్రీత్‌ సింగ్‌ విర్క్‌ తెలిపారు.
క్యాంపస్‌లో విద్యార్థులు శనివారం రాత్రి పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. స్నానం చేస్తుండగా వీడియోలు తీసి, వాటిని హిమాచల్‌ప్రదేశ్‌లో ఉండే తన స్నేహితుడికి ఓ అమ్మాయి పంపినట్టు ఆరోపణలు వెల్ల్లువెత్తాయి. వీటిని ఆ అమ్మాయి స్నేహితుడు సోషల్‌మీడియాలో అప్‌లోడ్‌ చేసినట్టు సమాచారం. అయితే, సదరు విద్యార్థిని తన సొంత వీడియోనే షేర్‌ చేసిందని పోలీసులు వెల్లడిరచారు. ప్రస్తుతానికి ఐపీసీ సెక్షన్‌ 354 సీ (వోయూరిజం), ఐటీ చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, విద్యార్థినిని, సిమ్లాలో ఉంటున్న ఆమె స్నేహితుడిని అరెస్టు చేశామన్నారు.ఇప్పటి వరకు ఈ కేసులో ముగ్గుర్ని అరెస్టు చేశారు. ఘటనపై పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. పంజాబ్‌ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ మనీషా గులాటీ ఘటన వివరాలను విద్యార్థినులను అడిగి తెలుసుకొన్నారు. వీడియోలను ఎవరెవరికి షేర్‌ చేశారు, ఎక్కడెక్కడ అప్‌లోడ్‌ చేశారన్న కోణంలో ఫోరెన్సిక్‌ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img