Thursday, August 11, 2022
Thursday, August 11, 2022

‘777 చార్లీ’ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్న సీఎం

777 చార్లీ సినిమా చూసి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కన్నీళ్లు పెట్టుకున్నారు. పెంపుడు కుక్కతో ఓ వ్యక్తికి ఉన్న అనుబంధాన్ని ఈ సినిమాలో చాలా గొప్పగా చూపించారని సీఎం ప్రశంసించారు.ముఖ్యమంత్రి బొమ్మై ఈ సినిమా చూసి అంత భావోద్వేగానికి గురికావడానికి ఓ కారణం ఉంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు బొమ్మైకి చనిపోయిన తన పెంపుడు కుక్క గుర్తుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారట. సినిమా చూస్తూ చాలా భావోద్వేగానికి గురయ్యారట. సినిమా హాలులోనే కన్నీళ్లు పెట్టుకున్నారట. ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img