Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

ఓటు హక్కుకు దూరం

యూపీలోని వివాహితల ఆవేదన
జాబితాలో పేర్లులేని 70 లక్షల మంది

ఉత్తరప్రదేశ్‌లో మహిళల దుస్థితిని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అనేక రకాల దాష్టీకాలకు వారు బాధితులుగా ఉన్నారు. ప్రాథమిక హక్కులను కోల్పోతారు. వివాహిత మహిళలకు కనీసం ఓటు హక్కు లేకుండా పోతోంది. సుమారు 70 లక్షల మంది మహిళల పేర్లు ఓటర్ల జాబితాలో లేవంటే పరిస్థితి ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి మహిళలు తమ అత్తమామలు అనుమతించిన తర్వాతే ఓటరు గుర్తింపు కార్డులు పొందడం ఆనవాయితీ.
2011 జనగణన ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో 18ఏళ్లు పైబడిన మహిళలు 7.7 కోట్ల మంది ఉన్నారు. ఎన్నికల సంఘం(ఈసీఐ) గణాంకాల ప్రకారం ఏడు కోట్ల మంది మహిళా ఓటర్లు నమోదయ్యారు. అంటే 70 లక్షల మంది పేర్లు జాబితాలో లేవు. యూపీలోని ఒక్కో నియోజకవర్గం నుంచి సగటున 87,500 మంది మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోతున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో జాతీయ సగటుపరంగా పురుషులు, మహిళా ఓటర్లలో దాదాపు సమాన శాతం పోలింగ్‌ నమోదు కాగా.. యూపీ వంటి కొన్ని రాష్ట్రాలు వెనుకబడ్డాయి. యూపీలో ఓటర్ల సంఖ్య 2021లో 14.71 కోట్ల నుంచి 15.02 కోట్లకు పెరిగింది. ఇందులో ఏడు కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. నవంబర్‌ 1, 2021 నాటికి 1,000 మంది పురుష ఓటర్లకు 857 మంది మహిళలు ఉన్నారు కానీ డిసెంబర్‌ 5, 2021 నాటికి అది ఆ సంఖ్య 868కి చేరింది.
కాగా, ఓటు వేసేందుకు మెట్టింటివారు, అత్తింటివారు అనుమతి ఇవ్వడంలేదన్నది మహిళలు వాపోయారు. పెళ్లికి ముందు ఓటు వేస్తామంటే ఇప్పుడు కాడు పెళ్లి తర్వాత అనేవారు… పెళ్లి తర్వాత ఓటేస్తామంటే అత్తింటివారు పట్టించుకోరని పశ్చిమ యూపీకి చెందిన నిర్మల వాపోయారు. ఈ ఏడాది ఎలాగైన ఓటు వేయాలని సంకల్పించి, ఓటరు కార్డును పొందేందుకు శ్రమించానని, దానిని సాధించుకున్నానని ఆమె చెప్పారు. నిర్మల తరహా అనేక మంది వివాహితులు ఓటు హక్కుకు దూరమయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img