Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ నిర్వాకం..మూడు రోజులుగా లండన్‌ విమానాశ్రయంలో భారతీయుల పడిగాపులు


అమెరికాకు చెందిన ఎయిర్‌ లైన్స్‌ నిర్వాకం వల్ల దిల్లీ చేరుకోవాల్సిన 260 మంది ప్రయాణికులు ఆదివారం నుంచి లండన్‌ విమానాశ్రయంలోనే పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడిరది. న్యూయార్క్‌ నుంచి దిల్లీకి నాన్‌- స్టాప్‌ విమానంలో ప్రయాణానికి 15 గంటల సమయం పడుతుంది. అలాంటిది న్యూయార్క్‌ నుంచి బయలుదేరిన 260 మంది భారతీయులు మూడు రోజులైనా గమ్యానికి చేరుకోలేదు. మే 29 రాత్రి బయలుదేరి ఆ విమానం.. 30 తేది రాత్రికి చేరుకోవాల్సి ఉంది. కానీ, ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురికావడంతో మెడికల్‌ ఎమర్జెన్సీ కోసమని లండన్‌కు మళ్లించారు. అక్కడే మూడు రోజుల నుంచి వీళ్లంతా చిక్కుకుని ఉన్నారు.రెండు రోజులకు వీసాలు మంజూరు చేయించి అక్కడే హోటళ్లలో వసతి ఏర్పాటు చేశారు. కానీ, అక్కడి నుంచి వారిని దిల్లీకి విమానంలో పంపించాల్సి ఉండగా.. అమెరికన్‌ ఎయిర్‌ లైన్స్‌ ఇందులో విఫలమైంది. పౌర విమానయాన శాఖ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీసీఏ) తొలుత అమెరికన్‌ ఎయిర్‌ లైన్స్‌ విమానం ల్యాండిరగ్‌ కు అనుమతించలేదని ఓ ప్రయాణికుడు వెల్లడిరచాడు. దీంతో లండన్‌ లోనే ఉండిపోవాల్సి వచ్చిందని.. ఫలితంగా వృద్ధులు, గర్భిణులు అవస్థ పడుతున్నట్టు మీడియాకు తెలిపాడు. వాస్తవానికి బ్రిటన్‌ నుంచి భారత్‌కు విమాన సర్వీసులు నడిపేందుకు అమెరికన్‌ ఎయిర్‌ లైన్స్‌ కు అనుమతి లేదు. డీజీసీఏ ప్రత్యేక అనుమతి ఇస్తేనే అది సాధ్యపడుతుంది. లండన్‌లో నిలిచిపోయిన ప్రయాణికులను న్యూఢల్లీి తీసుకెళ్లేందుకు వీలుగా అనుమతి కోసం చూస్తున్నట్టు అమెరికన్‌ ఎయిర్‌ లైన్స్‌ ప్రకటన విడుదల చేసింది. నిజానికి మంగళవారం ఉదయం 7 గంటలకు తీసుకెళతామని ఎయిర్‌ లైన్స్‌ చెప్పగా.. అది కూడా సఫలం కాలేదు. అయితే, సదరు విమానానికి డీజీసీఏ అనుమతి ఇచ్చిందని, బుధవారం వీరిని తీసుకురావచ్చని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img