Friday, May 3, 2024
Friday, May 3, 2024

ఆరోగ్య కార్యకర్తల బీమా పథకం పొడిగింపు

న్యూదిల్లీ: కోవిడ్‌19 విధులు నిర్వహించిన ఆరోగ్య కార్యకర్తలకు సంబంధించిన బీమా పథకాన్ని మరో 180 రోజులు పొడిగించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 1905 క్లెయిమ్‌లను పరిష్కరించినట్లు మంగళవారం తెలిపింది. కోవిడ్‌19 రోగులకు సేవలందించే ఆరోగ్య కార్యకర్తలను, కుటుంబ సభ్యులను భద్రతా వలయంలోకి తీసుకొచ్చేందుకు ఈ పథకాన్ని పొడిగించాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడిరచింది. కరోనాపై పోరాటం చేస్తున్న ఆరోగ్య కార్యకర్తల కోసం 2020 మార్చి 30న బీమా పథకం ప్రారంభించారని, కరోనా విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన 1905 మంది ఆరోగ్య కార్యకర్తలకు లబ్ధి చేకూర్చామని మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ పథకానికి ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ ప్యాకేజీ(పీఎంజీకేపీ)గా నామకరణం చేశారు. కరోనా రోగులకు సేవలందిస్తూ దురదృష్టవశాత్తు మరణించిన కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లు, ప్రైవేట్‌ హెల్త్‌ వర్కర్లు సహా ఆరోగ్య సిబ్బందికి పీఎంజీకేపీ కింద రూ.50 లక్షల నుంచి రూ.22.12 లక్షలు బీమా అందిస్తున్నారు. పీఎంజీకేపీ కింద ప్రైవేట్‌ ఆసుపత్రి సిబ్బంది, పదవీ విరమరణ చేసిన వారు, వలంటీర్లు, స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది, కాంట్రాక్టు, రోజువారీ కూలీలు, తాత్కాలిక, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది కూడా ఈ పథకం కిందకు వస్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img