Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

బీజేపీని ఓడించడం అసాధ్యం : ప్రశాంత్ కిశోర్

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఐక్యత వల్ల ప్రయోజనం ఉండదని ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్అన్నారు. ప్రతిపక్షాల ఐక్యత అస్థిరమైనదని, సైద్ధాంతికపరంగా భిన్నమైనదని చెప్పారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్ర వల్ల ప్రయోజనాలను కూడా ఆయన ప్రశ్నించారు. ఓ టీవీ చానల్‌కు సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ, 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఐక్యత వల్ల ప్రయోజనం ఉండదని, ప్రతిపక్షాల ఐక్యత అస్థిరమైనదని, సైద్ధాంతికపరంగా భిన్నమైనదని చెప్పారు. రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్ర వల్ల ప్రయోజనమేమిటని ప్రశ్నించారు. బీజేపీని సవాల్ చేయాలనుకుంటే, దాని బలాలేమిటో ముందుగా అర్థం చేసుకోవాలన్నారు. హిందుత్వం, జాతీయవాదం, సంక్షేమం బీజేపీ బలాలని వివరించారు. అది మూడు అంచెల స్తంభమని చెప్పారు. ఈ మూడింటిలో కనీసం రెండిటిని అధిగమించలేకపోతే, మీరు బీజేపీని సవాల్ చేయలేరని చెప్పారు. హిందుత్వ సిద్ధాంతంతో పోరాడటానికి సిద్ధాంతాల కూటమి అవసరమని చెప్పారు. గాంధేయవాదులు, అంబేద్కర్‌వాదులు, సామ్యవాదులు, కమ్యూనిస్టులు… మొదలైనవారిని ప్రస్తావించారు. సిద్ధాంతం చాలా ముఖ్యమైనదని, అయితే సిద్ధాంతం ప్రాతిపదికపై గుడ్డి నమ్మకంతో ఉండకూడదన్నారు.పార్టీలు, నేతలు కలిసికట్టుగా ఓ చోటుకు వస్తున్నారని, ప్రతిపక్షాల కూటమి గురించి మీడియా చూస్తోందని చెప్పారు. ఎవరు ఎవరితో మధ్యాహ్న భోజనం చేస్తున్నారు? ఎవరు ఎవరిని తేనీటి విందుకు పిలిచారు? ఇలాంటి విషయాలను తాను భావజాలం రూపకల్పనగా చూస్తున్నట్లు తెలిపారు. అలాంటి సమయం వచ్చే వరకు సైద్ధాంతిక కూర్పు జరగదని, బీజేపీని ఓడించే మార్గం కచ్చితంగా ఉండదని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img