Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

వాక్సిన్‌ సర్టిఫికెట్‌పై ప్రధాని ఫోటో…

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు

కొచ్చి : కోవిడ్‌-19 వాక్సినేషన్‌ అనంతరం జారీ అవుతోన్న సర్టిఫికెట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కేరళ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి తెలపాలని ఇరు ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. కేరళకు చెందిన పీటర్‌ మయలి పరంపిల్‌ అనే సీనియర్‌ సిటిజన్‌ తాను రెండు డోసుల కోవిడ్‌`19 వాక్సిన్‌ను డబ్బులు చెల్లించి తీసుకున్నానని, తన టీకా సర్టిఫికెట్‌లో ప్రధాని మోదీ ఫోటో ఉండడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని, తక్షణమే మోదీ ఫోటోను తొలగించేలా ఆదేశాలివ్వాలని పిటిషన్‌ దాఖలు చేశారు. సర్టిఫికెట్‌ అనేది తన వ్యక్తిగతమైన వివరాలతో ఉంటుందని, అందులో ప్రధాని ఫోటో ఉండడంపట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌ నగరేష్‌ ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని అఫిడవిట్‌ రూపంలో దాఖలు చేయాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img