Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

నమ్మకం లేని చోట ఉండను

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
విశాలాంధ్ర బ్యూరో నెల్లూరు : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఫోన్ టాపింగ్ కి సంబంధించి మాజీ మంత్రి రీజనల్ కో-ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన సవాల్ కి సంబంధించి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దీటైన జవాబు ఇచ్చారు.సరైన ఆధారాలతో బుధవారం నెల్లూరులోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించివాటిని సాక్షాధారాలతో సహా వెల్లడించారు. తన మిత్రుడు లంకా శివరామిరెడ్డి తో జరిపిన సంభాషణ తాలూకు ఆడియోను రికార్డు చేసి రాష్ట్ర ఇంటలిజెన్స్ బాస్ సీతారామాంజనేయులు తనకు పంపారని తనను ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కు గురిచేసారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తనదైన శైలిలో ధ్వజమెత్తారు. నా జీవితంలో ఇటువంటి సందర్భంలో మీడియా సమావేశం పెట్టాల్సి వస్తుందని అనుకోలేదువై.సి.పి.పెట్టక ముందు నుంచి పని చేస్తున్నాఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నపుడు చిత్త శుద్దితో పని చేశాఅధికారంలోకి వచ్చిన తరువాత గుర్తింపు కోరుకున్నాగుర్తింపు ఇవ్వకపోయినా ప్రజల కోసం పని చేస్తున్నాజగన్ గురించి వై.సి.పి.పై ఏనాడూ పరుషంగా మాట్లాడలేదుబారా షాహిద్ దర్గా కు జగన్ నిధులు మంజూరు చేసినా ఆర్థిక శాఖ విడుదల చేయలేదుఆర్థిక శాఖకార్యదర్శి రావత్ తీరును విమర్శించా
పార్టీకి వీర విధేయుడైన నన్ను ఇబ్బంది పెట్టారు
జగన్..సజ్జల..విజయ్ సాయి రెడ్డి ఫోన్లను కేంద్రం ట్యాప్ చేసినట్లు మీకు ఆధారాలు వస్తే మీ స్పందన ఎలా ఉంటుందిముఖ్యమంత్రి ఆలోచించాలి.నేను ఐఫోన్ వాడుతున్నా నా మిత్రుడు ఫోన్ చేస్తే మాట్లాడా.నా మిత్రుడిది కూడా ఐఫోనే ఐ ఫోన్ఇద్దరూ రికార్డ్ చేయలేమురాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐ.జి. సీతారామాంజనేయులు నాకు ఫోన్ చేశారు.నాఫోన్ ట్యాప్ అవుతోందని చెప్పారు
ఆడియో పంపారుఆధారాలు ఉన్నాయి కాబట్టే ట్యాపింగ్ జరిగిందని చెప్పా అధికార పార్టీ
ఎం.ఎల్.ఏ మీద ట్యాపింగ్ చేశారంటే ఇది ఇంతటితో ఆగదుమంత్రులు..హై కోర్టు జడ్జీలు…న్యాయవాదులు.. ఐ.ఏ.ఎస్. లు.. ఐ.పి.ఎస్.లు..మీడియా ప్రతినిధులు..ఎం.పి.లు ఫోన్లు కూడా ట్యాప్ చేస్తారు.ట్యాపింగ్ పై కేవలం అధికారులు చేశారంటే నేను నమ్మను ఇది ప్రభుత్వంలోని ప్రధానమైనటువంటి బాధ్యతలో ఉన్నటువంటి ముఖ్యమంత్ర లేక సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి వ్యక్తులు చెప్తే కానీ అధికారులు ఈ ఫోన్లు ట్రాప్ చేయరు ఇది వాస్తవం. నాకు ఇంటలిజెన్స్ రాష్ట్ర అధికారి అయినటువంటి సీతారమంజనేయులు తన ఫోన్98499 66000 నుంచి చేశారు. ఇది ఆయన నెంబర్.
..సజ్జల..విజయ్ సాయి రెడ్డి ఫోన్లను కేంద్రం ట్యాప్ చేసినట్లు మీకు ఆధారాలు వస్తే మీ స్పందన ఎలా ఉంటుందిముఖ్యమంత్రి ఆలోచించాలి. ట్యాపింగ్ పై ఎవరు నాకు సమాధానం చెబుతారు.
రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల ఫోన్లు ట్యాపింగ్ కు గురవుతున్నాయి అని తనకు తెలిసిన ఆధారాలతోనే ఈరోజు మాట్లాడుతున్నాను గతంలో ఏ రోజు నేను స్పందించలేదు కానీ నాతో సంప్రదించకుండానే రూరల్ నియోజకవర్గం ఇన్చార్జిగా కొత్తవారిని నియమించాలనేటువంటి ఆలోచనతో పార్టీ అధిష్టానం వచ్చిందంటే ఇక నాపై నమ్మకం లేని చోట నేను ఎందుకు ఉండాలి గౌరవంగా తప్పుకుంటున్నాను. ఫుల్ ట్యాంపరింగ్ అయినది వార్త మీడియా వచ్చిన తరువాత నాకు రాష్ట్రంలోని అధికార పార్టీకి చెందినటువంటి 35మందిఎంఎల్.ఏ.లు ఇద్దరూ మంత్రులునలుగురు ఎం.పి.లు ఫోన్లు చేసి మా ఫోన్లు కూడా ట్యాంపరింగ్ జరిగి ఉన్నాయని అందుకే మేము డ్రైవర్ల ఫోన్లో, గన్ మాన్ల ఫోన్ల ద్వారా మాట్లాడుతున్నామని వారు ఫోన్లు చేసి చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులతో కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ ప్రణాళిక తెలియజేస్తానన్నారు..తెలుగుదేశం పార్టీ అధినేతచంద్రబాబు టికెట్ ఇస్తే పోటీ చేస్తానని కార్యకర్తలకు చెప్పిన మాట వాస్తవమేనని ఆయన విలేకరులకు తెలిపారు.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంనాకు ఏమి పదవులు ఇవ్వలేదువందలాది మందికి కాభినెట్ హోదా ఉన్న పదవులు ఇచ్చారు
నేను దేనికి పనికి రానని పార్టీ భావించింది.నేను మహా నాయకుడిని అని చెప్పడం లేదు.
ప్రజా సమస్యలను ప్రస్తావిస్తున్న నాపై నిఘా పెట్టారునాకలలో కూడా ట్యాప్ చేస్తారని అనుకోలేదు20 రోజులముందు ట్యాపింగ్ కు సంబంధించి అదారాలు లభించాయి.సి.ఎం.జగన్ లేదా సజ్జల చెప్పి ఉంటేనే ట్యాప్ చేశారు.అధికార పార్టీ ఎం.ఎల్.ఏ.ల ఫోన్లు ట్యాప్ చేయడం అంత సులభం కాదు
నన్నుఅనుమానుంచినచోటఉండకూడదనినిర్ణయించుకున్నాఅందుకే ఈ నిర్ణయంతీసుకున్నా.ట్యాపింగ్ వ్యవహారం బయటపెడితేప్రభుత్వానికి.ఇద్దరుఐ.పి.ఎస్.అధికారులకు ఇబ్బంది అవుతుందని భావించామీడియాలో వచ్చిన వార్తల పై నన్ను వివరణ అడగా లేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img