Monday, April 22, 2024
Monday, April 22, 2024

ఆన్లైన్ మోసాలపై విద్యార్థులకు అవగాహన

అనుమసముద్రంపేట : ఆన్లైన్ సేవలు అందిస్తామంటూ కల్లబొల్లి మాటలు చెప్పి పాస్వర్డ్, ఓటీపీలు అడుగుతూ మోసాలకు పాల్పడుతున్న సైబర్ క్రైమ్ మోసగాళ్ల ఎత్తులను ఎప్పటికప్పుడు పసిగట్టి మోసపోకుండా ఉండాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఏ ఎస్ పేట మండలం కావలి ఎడవల్లి ఉన్నత పాఠశాలలోనీ విద్యార్థిని విద్యార్థులకు మహిళా పోలీస్ మౌనిక, ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వరరావు సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. వివిధ రకాలుగా జరుగుతున్న సైబర్ నేరాల గురించి అవగాహన చేసుకోవాలని మోసపోకుండా ఉండాలని తెలిపారు. యూట్యూబ్ ,ఫేస్బుక్ ట్విట్టర్ ఓఎల్ఎక్స్ అమ్మకాలు కొనుగోలు ద్వారా కూడా మోసాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. 1930 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img