Monday, May 20, 2024
Monday, May 20, 2024

వీపీఆర్ వెంటే వైసీపీ కీలకనేత నిర్ణయం

విశాలాంధ్ర బ్యూరో నెల్లూరు: నెల్లూరు నగర నియోజకవర్గ సీటు విషయంలో ఏర్పడినచిచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ,లోప్రకంపనాలుసృష్టిస్తోంది.తనను కనీసం సంప్రదించకుండా అభ్యర్థిని నిర్ణయించడం పై పార్టీ అధిష్టానం పై ఆగ్రహంతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీని వీడనున్నారన్న సంకేతాలు స్పష్టంగా కనపడుతున్నాయి. వైసీపీ పెద్దలు వీపిఆర్ కు ఎంత నచ్చజెప్పిన ఆయనతో చర్చలు జరిపిన అవి సఫలీకృతం కాలేదు. ఎంపీ ఆదాల కూడా తన వంతు ప్రయత్నాలు చేసిన అవి సఫలీకృతం కాలేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తో పాటు పలువురు పెద్దలు విపిఆర్ తో భేటి అయ్యేందుకు ప్రయత్నాలుచేశారు.మరోవైపుటీడీపీలోకి లో కీలకంగా వ్యవహరిస్తున్న నేతలు విపిఆర్ తో టచ్ లోకి వెళ్లారు
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్న ఆయన వెంట వెళ్లేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న నేత నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ మేరకు తన వర్గంగా ఉన్న కార్పొరేటర్లు, అనుచర నేతలు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. అందరు కూడా ముక్తకంఠంతో విపిఆర్ తోనే నడవాలని నిర్ణయించారు. ఒకటి రెండు రోజుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నెల్లూరు నగర నియోజకవర్గంలో విపిఆర్ తో పాటు కీలకంగా ఉన్న నేత ఆయన అనుచర వర్గం పార్టీని వీడితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి నగరంలో కోలుకోలేని విధంగా పెద్ద దెబ్బ తగిలినట్టే అని చెప్పవచ్చు, ఇటీవల సంభవించిన రాజకీయ వివాదాల తరువాత నేడు నెల్లూరునగరంలోకివిచ్చేస్తున్న విపిఆర్.తన రాజకీయ భవిష్యత్తు ఏ పార్టీతో అనే నిర్ణయాన్ని ప్రకటన చేయబోతున్నారోచూద్దాం…………

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img