Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రభుత్వ విద్యను, పేద విద్యార్థులను అంధకారంలోకి నెట్టొద్దు

AISF రాష్ట్ర సహయ కార్యదర్శి మస్తాన్

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో చలో కలెక్టరేట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది.ఈ మేరకు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఏఐఎస్ఎఫ్ నాయకులు విద్యార్థులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ మస్తాన్ షరీఫ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యా వ్యతిరేక విధానాల వలన ఈ రాష్ట్ర పేద, మధ్య తరగతి విద్యార్ధులకు ఉన్నత విద్య అందని ద్రాక్షలాగా మారింది.అదేవిధంగా పేద విద్యార్థులకు ప్రభుత్వ విద్యా దూరం అయిపోతుంది.3,4,5,తరగతులను విలీనం చేస్తూ తీసుకొని వచ్చిన జీవో నెం 117 ద్వారా చిన్న పిల్లలకు ప్రాథమిక విద్యను దూరం చేసే ఆలోచనలు మానుకోవాలని ఆయన తెలిపారు.ఉన్నత విద్య చదవాలని కోటి ఆశలతో ఎదురుచూస్తున్న పీజీ విద్యార్థులకు రీయింబర్స్మెంట్ సౌకర్యాన్ని ఎత్తివేస్తూ ఇచ్చిన జీవో నెంబర్.77 ను రద్దు చేయాలని,విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని తగ్గించి విశ్వవిద్యాలయాలు కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు(CUET)ను రద్దు చేయాలని ఆయన కోరారు.అదేవిధంగా నాడు-నేడు కింద పాఠశాలల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నామని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం అదే పథకం కింద సాంఘిక సంక్షేమ వసతి గృహాలను కూడా అభివృద్ధి పరచాలని ఆయన డిమాండ్ చేశారు.
ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పవన్ కిషోర్ గారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని,అదేవిధంగా మెగా డీఎస్సీని కూడా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.గత ప్రభుత్వం హయాంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసి పీజీ విద్యార్థులను ఆదుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శులు నవాజ్, వరుణ్ ,
జిల్లా ఉపాధ్యక్షులు నాయబ్ భాషా, తోఫిక్ నెల్లూరు నగర అధ్యక్షులు శివమ్ జిల్లా నాయకులు చక్రి,నియాజ్,అబ్రహం శివ,షాహుల్ మరియు జిల్లా లోని అన్ని నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు,విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img