Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

పాలకుల నిర్లక్ష్యం.. కూలీలకు శాపం

కరువు పని చేసిన కూలి లేదు
10 వారాలుగా అందని బిల్లులు
డబ్బులు ఎప్పుడు పడతాయోనని ఎదురు చూపులు

మర్రిపాడు మండలం అంతా ఇదే పరిస్థితి

మర్రిపాడు మండలానికి చెందిన పలు గ్రామాలలో ఉపాధి హామీ కూలీలకు ఉపాధి హామీ పనులు 10 వారాలుగా చేస్తున్నా.. వారికి సంబంధించిన కూలి డబ్బులు మాత్రం ఖాతాలో పడటం లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలిపైనే ఆధారపడి జీవిస్తున్న వారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కొన్ని గ్రామాలలో బయట అప్పులు చేసి ఇల్లు గడుపుకోవాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. దీంతో బిల్లులు ఎప్పుడు పడతాయోనని కూలీలు ఎదురు చూస్తున్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో కూలీలకు డబ్బులు అందాల్సి ఉంది. మండుటెండలో కష్టపడి పనిచేస్తున్నా కూలీలకు సకాలంలో డబ్బులు రావడం లేదు. జిల్లా లోని వెనకబడిన మండలంగా పేరొందిన మర్రిపాడు మెట్ట ప్రాంతం గ్రామీణ వాసులు కూలీకెళితే గానీ పూట గడవక వారి అవస్థలు వర్ణణాతీతంగా మారాయి. ఇంట్లో జరక్క బయట అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రచార్భాటాల కోసం నిత్యం తహతహలాడే ప్రజాప్రతినిధులు ఉపాధి కూలీల సమస్యలపై దృష్టి సారించడం లేదు. కొండగుట్టలో చేతులు బొబ్బలు పోయేలా శ్రమటోడ్చి చేసినా వేతనాలు సకాలంలో ఇవ్వడం లేదని ఒకింత ఆవేశానికి లోనవుతున్నారు మండలంలో ఈ తరహా పరిస్థితి ఉన్నా ప్రజాప్రతినిధుల్లో మాత్రం చలనం లేదు.నిధుల సమస్యల లేదని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో కూలీలకు బకాయి వేతనాలు, బిల్లులు ఎందుకు చెల్లించడం లేదనే అంశాలపై దృష్టి సారిస్తున్న దాఖలాలు లేవు. ఫలితంగా రైతులు, రైతు కూలీలు ఉన్న ఊళ్లో ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఉపాధి లేక కుటుంబాలే వలస పోయే పరిస్థితి ఏర్పడుతుంది అధికారులు మాత్రం పని కల్పిస్తున్నామన్న ధోరణిలోనే మాట్లాడుతున్నారు.నిజానికి కరోన కాలం వచ్చి పోయిన నాటినుంచి కరువు కాటకాలతోనే కాలం వెళ్లబుచ్చుతున్న కష్టజీవుల పై కనికరం చూపే ప్రజా నాయకులు కరువయ్యారు అని మండల వాసులు నిస్సహాయతను వ్యక్తపరుస్తున్నారు ఇప్పటికైనా ప్రజల కష్టాలను గుర్తించి ఉపాధి హామీ పని చేసిన కూలీలకు కూలి డబ్బులు వచ్చే విదంగా తమవంతు కృషి చేయాలని సంబంధిత అధికారులను మర్రిపాడు మండల గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img