Monday, April 22, 2024
Monday, April 22, 2024

విద్యార్థులలో క్రీడా స్ఫూర్తి నింపాలి

విశాలాంధ్ర-కందుకూరు : క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి పోటీ పడాలని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్రెడ్డి అన్నారు. ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఏపీఎస్జీఎఫ్) కందుకూరు నియోజకవర్గ స్థాయి ఆటల పోటీలు స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి వచ్చిన క్రీడాకారులతో చక్కగా ఆడించాలని వ్యాయామోపాధ్యాయులకు సూచించారు. గెలుపోటములను సమానంగా స్వీకరించాలని క్రీడాకారులకు సూచించారు. సబ్ కలెక్టర్ శోభికా మాట్లాడుతూ ఎంతో ఉత్సాహంగా ఆటలు ఆడేందుకు వచ్చిన విద్యార్థులను చూస్తుంటే నాకు ఆడాలని ఉందన్నారు. కానీ ఈ పరిస్థితుల్లో మేను కేవం వ్యాయామం చేయడం తప్పా ఆటలు ఆడే స్థితి లేదన్నారు. విద్యతోపాటు. ఆటలు కూడా ముఖ్యమని ఆటల ద్వారా శారీరక ధారుఢ్యం పెంపొందుతుందన్నారు. విద్యార్థులకు ఏ అవసరమైన మీ ఉపాధ్యాయులు, హెచ్ఎంలకు సమాచారం ఇవ్వాలన్నారు. సమస్యలను పరిష్కరించేందుకు మేమున్నామన్నారు. ముందుగా జాతీయ జెండాను సబ్ కలెక్టర్ ఆవిష్కరించగా క్రీడా పతాకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. క్రీడావందనాన్నీ స్వీకరించి క్రీడా జ్యోతిని సబ్ కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం క్రీడా ప్రాంగణాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి ట్రాక్లో వాకింగ్ చేసి క్రీడలను ప్రారంభించారు. ఎస్ఎఫ్ చైర్మన్, హెచ్ఎం ద్వారాకారాణి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో డీప్యూటీ డీఈఓ వెంకటేశ్వర్లు, ఎంఈఓ వెంకటేశ్వర నాయక్, హెచ్ఎంలో డి.అనూరాధ, మాల్యాద్రి, వ్యాయామోపాధ్యాయుల సంఘం కార్యదర్శి కె. ఐజాక్, సుబ్రమణ్యం, పీడీలు రాజ్యలక్ష్మి. ఆదిలక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img