Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

వత్సవాయిపోలీస్ స్టేషన్లో అంబరాన్ని అంటిన మహిళ దినోత్సవ సంబరాలు

చిన్నారుల ఆట పాటలతో కొలహల వాతావరణం

కుర్చీని మడత పెట్టి.. పాట తో చిన్నారుల జోరు

( విశాలాంధ్ర) వత్సవాయి ; మండల కేంద్రమైన వత్సవాయి లోని స్థానిక పోలీస్ స్టేషన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ సి పి క్రాంతి రాణా ఉత్తర్వుల మేరకు నందిగామ ఏసీపి రవి కిరణ్ సూచనలతో జగ్గయ్యపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ జానకిరామ్ సూచనలతో స్థానిక ఎస్సై అభిమన్యు ఆధ్వర్యంలో ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు అంబరాన్ని అంటాయి….. ఠాణా ప్రాంగణంలో చిన్నారుల నృత్య గానాలతో ప్రాంగణం అంత ఉర్రుతలు ఉగాయి… విద్య, వైద్య, పారిశుధ్య పోలీసు, రాజకీయ, విలేకర్ మొదలగు విభాగాలలో సేవలు అందిస్తున్న మహిళా మణులకు శాలువాతో ఘనంగా సత్కరించారు.. గురువారం నాడు మండలంలోని అన్ని గ్రామాలలో ఉన్న ప్రైవేటు మరియు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థినిలకు చట్టాలపై అవగాహన కల్పించే విధంగా వారికి మేమున్నామంటూ భరోసా కల్పించే విధంగా వినూత్నమైన కార్యక్రమాన్ని తలపెట్టారు 25 గ్రామపంచాయతీలో ఉండేటువంటి విద్యార్థినిలకు మరియు పెద్దలకు చిత్రలేఖనం భావవ్యక్తీకరణ పాటలు పాడడం నృత్యం చేయడం కథనాలు రాయడం వంటి విభాగాలలో పోటీలు పెట్టి ప్రధమ ద్వితీయ తృతీయ బహుమతులు ఇవ్వడమే కాకుండా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా బహుమతులను అందజేశారు ముందస్తు మహిళా దినోత్సవం పురస్కరించుకొని 80 మంది మహిళా మణులకు బహుమతులను అందజేసి విశిష్టకరమైన కార్యక్రమాన్ని నిర్వహించారు వత్సవాయి పోలీసులు…….ఈ సందర్బంగా స్థానిక ఎస్ఐ మహిళా దినోత్సవం నాడు మాత్రమే మహిళలను గౌరవించడం కాకుండా ప్రతి రోజు మహిళలను గౌరవించాలని మహిళలు అనేక రంగాలలో రాణిస్తున్నారని అక్క గా చెల్లి గా తల్లి గా బహుపాత్రలు పోషిస్తూ సృష్టి కి మూలం అయ్యారని కొని ఆడారు ఇప్పటివరకు మండలంలో ఇటువంటి బృహత్కర కార్యక్రమం నిర్వహించిన ఘనత వత్సవాయి స్థానిక ఎస్సై కు దక్కిందని పలువురు ప్రశంసించారు… ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి భూక్య సీతమ్మ.. గోపినేనిపాలెం ఎంపీటీసీ సభ్యురాలు హుసేని… వెంకటేశ్వర, అన్నపూర్ణ, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు,సచివాలయ సిబ్బంది మహిళా పోలీసులు విద్యా, వైద్య ఆరోగ్య, పారిశుద్ధ్య, ప్రభుత్వ, ప్రైవేటు విభాగాలకు సంబంధించిన మహిళలు భారీ స్థాయిలో పాల్గొన్నారు…

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img