Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

కటిక పేదరికంలో కోట్ల కుటుంబాలు

జ్ఞాన్‌ పాఠక్‌

వ్యవసాయ దారులలో 40.3 శాతం మంది, వ్యవసాయం లేనివారిలో 28.2 శాతం మంది అప్పుల్లో చిక్కుకొని ఉన్నారు. పట్టణ ప్రాంతాలలో అప్పులో ఉన్న కుటుంబాలు 22 శాతం ఉన్నాయి. కుటుంబానికి రూ.1,20,336 రుణం ఉంది. స్వయం ఉపాధి పొందుతున్న కుటుంబాలలో 27.5 శాతం, ఇతరులు కేటగిరీలో 20.6 శాతం కుటుంబాలు అప్పుల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్‌, ఒడిశా, పంజాబ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, పుదుచ్చేరి, తెలంగాణ రాష్ట్రాలలో 35 శాతం గ్రామీణులు అప్పుల్లో ఉన్నారు.

భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 74 ఏళ్లు గడిచిన తర్వాత కూడా కోట్ల కుటుంబాలు కటిక దారిద్య్రంలో మగ్గుతున్నాయి. వీరికి పాదార్థిక, ఆర్థిక ఆస్తులేమీ లేవు. రెక్కల కష్టం మీదే ఏదో విధంగా జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇళ్లుగాని, భూములుగాని లేవు. వీరికి సామాజిక భద్రత కార్యక్రమాలు కూడా అందుబాటులో లేవు. ఎవరైనా దాతలు దయతలచి ఇచ్చే దానితో సంతృప్తి చెందుతారు. ఇలాంటి కుటుంబాలు పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాలలోనే ఇలాంటి కుటుంబాలు ఎక్కువ. గ్రామీణ ప్రాంతాలలో 0.6 శాతం దారిద్య్రంలో ఉన్న కుటుంబాలు ఉండగా పట్టణ ప్రాంతాలలో 2 శాతం కుటుంబాలు ఉన్నాయి. గ్రామాలలో ఆర్థిక ఆస్తులు లేని కుటుంబాలు 3.4 శాతం ఉండగా పట్టణ ప్రాంతాలలో 5.3 శాతం ఉన్నారు. గ్రామాలలో 2.5 శాతం కుటుంబాలకు ఇళ్లుగానీ, భూములుగానీ లేవు. జాతీయ స్థాయి రుణ, పెట్టుబడుల సర్వే2019 (77వ ఎన్‌ఎస్‌ఎస్‌) సర్వే ఈ విషయాలను వెల్లడిరచింది. కొవిడ్‌19 మహమ్మారి కాలంలో ఈ పరిస్థితి మరింత పెరిగింది.
ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి, దేశాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నారు. అయినప్పటికీ కోట్ల కుటుంబాలు దారిద్య్రంలో ఉన్నాయంటే ప్రభుత్వాలు చేసింది ఏమీ లేదని భావించాలి. మోదీ ప్రభుత్వం దేశ ప్రజలకు తాను గొప్ప సేవలు అందించానని చెబుతోంది. అయితే దారిద్య్రంలో ఉన్న ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు దక్కడం లేదు. గ్రామాలలో ఒక ఇంటికి సగటున రూ.15,92,000 ఆస్తులున్నాయని అంచనా వేస్తే వీటిలో రూ.15,20,000 ఆస్తులు ఇళ్లు, పొలాల రూపాలలో ఉన్నాయి. తక్కిన మొత్తం ఆర్థిక ఆస్తులు. 62 శాతం పొలాల రూపంలో, 22 శాతం ఇళ్ల రూపంలో, 5 శాతం డిపాజిట్లు, 4 శాతం ఇతర రూపాలలో ఉన్నాయి. పట్టణ ప్రాంతాలలో సగటు కుటుంబ ఆస్తుల విలువ రూ. 27,17,000 ఉండగా ఇందులో పాదార్థిక ఆస్తులు రూ. 24,65,000, ఆర్థికపరమైన ఆస్తులు రూ. 5,18,000 ఉన్నాయి. పొలాల విలువ 49 శాతం, భవనాలు 33 శాతం, డిపాజిట్లు 9 శాతం, ఇతర రూపాలలో 4 శాతం ఉన్నాయి.
ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి, ఇతరులునాలుగు కేటగిరీలుగా విభజించి చూడాలి. గ్రామాలలో 1.2 శాతం ఎస్టీలకు, పట్టణాలలో 6.3 శాతం మందికి ఎలాంటి ఆస్తులు లేవు. ఎస్‌సీలకు పట్టణాలలో 3.4 శాతం కుటుంబాలకు, గ్రామాలలో 0.7 శాతం కుటుంబాలకు ఎలాంటి ఆస్తులు లేవు. ఎస్సీల కంటే ఎస్టీలు తక్కువ ఆస్తులు కలిగి ఉన్నారు. ఒబీసీ కుటుంబాలు ఇతర కేటగిరీల కంటే మెరుగైన స్థానంలో ఉన్నారు. వీరికి గ్రామాలలో 0.4 శాతం, పట్టణా లలో 1.2 శాతం ఆస్తులు లేవు. ఇతరులు కేటగిరీలో గ్రామాలలో 0.6 శాతం, పట్టణ ప్రాంతాలలో 2 శాతం కుటుంబాలకు ఎలాంటి ఆస్తులు లేవు. అయితే ఆస్తులున్న వారికి గ్రామాలలో రూ.26,03,000, పట్టణ ప్రాంతాలలో రూ, 41,51,000 ఆస్తులు ఉన్నాయి. సర్వే సమాచారం ప్రకారం గ్రామీణ ప్రజలు 35 శాతం మంది రుణ ఊబిలో చిక్కుకొని ఉండగా, కనీస రుణం రూ.59,748 ఉన్నది. వ్యవసాయ దారులలో 40.3 శాతం మంది, వ్యవసాయం లేనివారిలో 28.2 శాతం మంది అప్పుల్లో చిక్కుకొని ఉన్నారు. పట్టణ ప్రాంతాలలో అప్పులో ఉన్న కుటుంబాలు 22 శాతం ఉన్నాయి. కుటుంబానికి రూ.1,20,336 రుణం ఉంది. స్వయం ఉపాధి పొందుతున్న కుటుంబాలలో 27.5 శాతం, ఇతరులు కేటగిరీలో 20.6 శాతం కుటుంబాలు అప్పుల్లో ఉన్నాయి. అప్పులకు సంబంధించి ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రానికి మధ్య ఎక్కువ తేడాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్‌, ఒడిశా, పంజాబ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, పుదుచ్చేరి, తెలంగాణ రాష్ట్రాలలో 35 శాతం గ్రామీణులు అప్పుల్లో ఉన్నారు. దిల్లీ, మేఘాలయ, నాగాలాండ్‌, లక్షద్వీప్‌, దాద్రానగర్‌హవేలీలో 10 శాతం లోపు అప్పుల్లో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్‌, కేరళ రాష్ట్రాల్లో పట్టణ ప్రాంతాల్లో 35 శాతానికి పైగా అప్పుల్లో ఉన్నారు. సర్వే ప్రకారం అటు గ్రామీణ ఇటు పట్టణ ప్రాంతాలలో పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉందని స్పష్టమవుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img