Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

బ్యాడ్‌ బ్యాంకుతో నిరర్థక ఆస్తుల సమస్య తీరదు!

రుద్రరాజు శ్రీనివాసరాజు

సామాన్య ప్రజల డబ్బుతోనే వ్యాపారం చేసే వాణిజ్య బ్యాంకులు సామాన్యు లకు రుణం కావాలంటే అడిగే నిబంధనలు అన్నీ ఇన్నీ కాదు. లక్ష రూపాయలు రుణం కావాలంటే సవాలక్ష నిబంధనలు విధిస్తాయి. పలు పర్యాయాలు తిప్పించు కుని ఆస్తి పత్రాలు, హామీ పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించి శల్య పరీక్షలు చేసిన పిదపే రుణాలను మంజూరు చేస్తాయి. ఒక వేళ నిర్ణీత సమయం లోగా రుణం చెల్లించక పోతే వారు హామీగా పెట్టిన బంగారు ఆభరణాలు కానీ ఆస్తులు కానీ బహిరంగ వేలం వేసి ఆ రుణాలను వడ్డీతో సహా తిరిగి వసూలు చేసుకుంటు న్నాయి. ఇన్ని జాగ్రత్తలు పాటించే బ్యాంకులకు మొండి బాకీల సమస్య ఎందుకు ఉత్పన్నమవుతోంది? ఈ మొండి బకాయిలు అనేవి సామాన్య ప్రజానీకానివి మాత్రం కావు. రాజకీయ ప్రాబల్యం మెండుగా ఉన్న కార్పొరేట్‌ పెట్టుబడుదారులు ఎగవేసిన రుణాలు ఇవి. వీరు తీసుకున్న పెద్ద మొత్తాల రుణాలను తిరిగి వసూలు చేయలేని స్థితిలో అవి మొండి బకాయిలుగా బాంకులకు గుది బండలుగా తయారై ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడానికి కారణం అవుతున్నాయి. సామాన్యుల దగ్గర ముక్కు పిండి వసూలు చేసే బ్యాంకులు ఈ పెట్టుబడిదారులను ఏమీ చేయక పోవడమే ఇక్కడ అసలు విషయం. ఒకటి కాదు రెండు కాదు లక్షల కోట్లు ఇలా మొండి బకాయిల రూపంలో బ్యాంకులకు బడా కార్పొరేట్‌ సంస్థలు ఎగనామం పెడుతున్నాయి. ఈ మొండి బకాయిలనే బ్యాంకింగ్‌ భాషలో ఎన్‌పీఏ.. నాన్‌ పెర్ఫార్మింగ్‌ అసెట్స్‌ (నిరర్థక ఆస్తులు) అంటారు.
రిజర్వు బ్యాంకు చెబుతున్న దాని ప్రకారం బ్యాంకులకు తామిచ్చిన రుణాలకు నిర్ణీత వ్యవధిలో వాయిదాలు తిరిగి రాకపోతే ఎన్‌పీఏ అంటారు. ఇవి కార్పొరేట్‌ పెద్దమనుషుల వల్లనే జరిగాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు జాతీయీకరణ లక్ష్యా నికి తిలోదకాలు ఇచ్చి పెద్ద వాళ్లకు గంపగుత్తగా రుణాలు అందించడం వల్లనే ఈ పరిస్థితి దాపురించింది. కాకుల్ని కొట్టి గద్దలకు వేసినట్లు బ్యాంకులలో పొదుపు చేస్తున్న పేదవర్గాల సొమ్మును మూట కట్టి బడా కార్పొరేట్‌ వర్గాలకు ఇస్తున్నారు. వారినుంచి తిరిగి వసూలు చేయలేక బ్యాంక్‌ ఆస్తుల పట్టీలో ఈ సమాచారాన్ని తొలగిస్తున్నాయి. ఒక్క కలం పోటుతో మూడవ కంటికి తెలియకుండా రద్దు కూడా చేసేస్తున్నాయి. సామాన్యుల నుంచి మాత్రం ఆ సాకు ఈ సాకు చెప్పి పెనాల్టీల రూపంలో వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాయి.
బ్యాంకులు ప్రభుత్వాలు కూడా గోప్యంగా ఉంచిన ఈ పారు బాకీల సమా చారం 2015లో రఘురామరాజన్‌ గవర్నర్‌గా ఉన్నప్పుడు అసెట్స్‌ క్వాలిటీ రివ్యూ పేరిట జరిపిన సమీక్షలో బయటకు వచ్చింది. వాటిని ఆస్తి అప్పుల పట్టీలో చూపా లని ఆర్‌.బీ.ఐ. నిర్ణయించింది. ఈ కారణంగా మొండి బకాయిల నిజాలు బయట పడ్డాయి. నిరర్థక ఆస్తులు పెరుగుతూ వచ్చాయి గానీ ఏ మాత్రం తరగలేదు. నోట్ల రద్దు తరువాత ఈ సమస్య మరింత జటిలమైంది. దీన్నుండి బయటపడటానికి 2002లో ప్రత్యేక చట్టం ద్వారా అసెట్‌ రీ కనస్ట్రక్షన్‌ కంపెనీలను ఏర్పాటు చేశారు. బ్యాంకుల మొండి బకాయిలను వీటికి అమ్మితే వాటి నుంచి లభించే కొద్ది మొత్తంతో కొంతలో కొంత అయినా పారు బాకీల భారాన్ని పూడ్చుకోవచ్చుననుకున్నారు. దానితో ప్రైవేట్‌ ఏఆర్‌సీలను బాంకులు ఆశ్రయించడం ఆరభించాయి. ఉదాహర ణకు 10 కోట్లు మొండి బకాయి ఈ కంపెనీలకు అప్పగిస్తే 3 లేదా 4 కోట్లు బ్యాంకులకు అప్పగించి మిగిలిన మొత్తాలను పొందే ఉద్దేశంతో రిస్క్‌ చేసి ఇవి ప్రయత్నం చేసేవి. ఇది నిరర్థక ఆస్తులకు ఉపశమనం తప్ప నివారణ కాలేదు. ఇటువంటి ప్రైవేట్‌ కంపెనీలు మనదేశంలో దాదాపు 26 వరకూ ఉన్నాయి. ఇవి కూడా మొండి బకాయిల వసూలు విషయంలో సఫలం కాలేదు. 2016-17 ఆర్థిక సర్వేలో ఈ విషయాన్ని ప్రస్తావించడం గమనార్హం. ఈ కారణంగా అవి మొండి బకాయిల స్వీకరణకు ముందుకు రావడం తగ్గింది. ఇదే సమయంలో ప్రభుత్వం డెట్‌ ట్రిబ్యునల్‌ రికవరీ ఏర్పాటు చేసి 6 నెలల్లో ఈ మొండి బకాయిలకు పరిష్కారం చూపాలని ప్రయత్నించింది గానీ ఈ తరహా కేసులు వేల కొద్దీ ఉండటం వలన ఇదీ నెరవేరలేదు. ఈ స్థితిలో మొండి బకాయిల పరిష్కారానికి ప్రభుత్వమే ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయనే భావన వచ్చింది.
ఇదే క్రమంలో ఈ సమస్య పరిష్కారానికి బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన 2017 ఆర్థిక సర్వేలో వచ్చింది. 2020 మే నెలలో ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ కూడా ప్రభుత్వాన్ని బాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేయమని కోరింది. రిజర్వ్‌ బ్యాంకు కూడా ఈ తరహా ప్రతిపాదన వస్తే ఆమోదించడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ పచ్చ జెండా ఊపింది. ఆర్బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు కూడా మొండి బాకీల పరిష్కారం కోసం సాధారణ బ్యాంకుల కంటే బ్యాడ్‌ బ్యాంకు మరింత సమర్థవంతంగా వ్యవహరించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ మరొక మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ మాత్రం ప్రభుత్వ రంగంలో బ్యాడ్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేయడాన్ని ఆయన రాసిన ‘ఐ డూ వాట్‌ డూ’ పుస్తకంలో వ్యతి రేకించారు. ప్రభుత్వానికి చెందిన ఓ ఖజానా నుంచి రుణాలను మరో ఖజానాకు మార్చడంతప్ప దీనివలన పెద్దగా ఒరిగేదేమీఉండదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో విస్తృతచర్చలమధ్య ప్రభుత్వం బ్యాడ్‌బాంక్‌ ఏర్పాటుపై ముందడుగు వేసింది.
ఇందుకోసం ఏర్పాటు చేయబోతున్న జాతీయ ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ (చీARజూ) లేదా బ్యాడ్‌ బ్యాంక్‌ జారీ చేసే సెక్యూరిటీ రసీదులకు ప్రభుత్వం హామీ ఇవ్వాలన్న ప్రతిపాదనకు తాజాగా కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. మొత్తం రూ.30,600 కోట్ల విలువైన రసీదులకు ప్రభుత్వ హామీ ఇచ్చింది. ఈ విధానంలో ప్రతిపాదిత బ్యాడ్‌ బ్యాంక్‌ 15 శాతం రుణాలకు నగదు రూపంలో చెల్లించ నుండగా.. మిగిలిన 85 శాతం ప్రభుత్వ హామీ కలిగిన సెక్యూరిటీ రసీదులను జారీ చేయడానికి ప్రభుత్వం సిద్ధం అయ్యింది. ఇక వాస్తవంలో ఏం జరుగుతుంది అనేది కాలమే సమాధానం చెప్పాలి. ఏది ఏమైనా ఇదీ తాత్కాలిక ఉపశమనమే తప్ప పూర్తి పరిష్కారం మాత్రం కాదని అర్థమవుతోంది. బ్యాడ్‌ బ్యాంకు వలన బ్యాంకుల బాలన్స్‌ షీట్‌ ప్రక్షాళన అవుతుంది తప్ప సమస్య పునరావృతం కాదని చెప్పలేము. మరలా ఎన్‌పీఏలు పుట్టుకొస్తూనే ఉంటాయి. వాటిని బాడ్‌ బ్యాంక్‌కు బదిలీ జరుపు తూనే ఉంటారు. బ్యాంకుల రుణ మంజూరు విధానాలు మరింత పటిష్టం చేయ గలిగితే ఇవి చాలా వరకూ తగ్గిపోతాయన్నది వాస్తవం. అంత పెద్ద మొత్తాలను మంజూరు చేసే విషయంలో అజాగ్రత్తగా వ్యవహరించే అధికారులపై, తప్పుడు ధ్రువపత్రాలు చూపించే వ్యాపారస్తులపై క్రిమినల్‌ చర్యలు తీసుకునే విధంగా చట్టాలను మార్పు చేయడానికి ప్రభుత్వం చిత్త శుద్దితో ముందుకు వస్తే ఖచ్చితంగా ఈ మొండి బకాయిల భారం తగ్గిపోతుంది. సమస్య వచ్చాక ప్రత్యామ్నాయం కోసం చూడటం కన్నా సమస్య మూలాన్ని గుర్తించి పరిష్కారం కోసం ప్రయత్నం చేయ నంత కాలం ఈ మొండి బకాయిల ప్రవాహం కొనసాగుతూనే వుంటుంది.
ఆశ్రిత పెట్టుబడిదారీ వ్యవస్థను సమర్థిస్తున్నవారే ఈ బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు ప్రతిపాదనను సమర్థిస్తున్నారనే విమర్శలు కూడా లేకపోలేదు. ఎగవేతదార్లకు అండగా నిలవడమే దీని లక్ష్యమని మరి కొందరు ఆరోపిస్తున్నారు. ప్రత్యేక బ్యాంక్‌ ఏర్పాటు చేయడం కంటే ఎగవేతదార్లపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవడం ప్రధానం. ఒకవేళ ప్రభుత్వం చేతిలో బ్యాడ్‌ బ్యాంక్‌ కీలుబొమ్మగా మారితే.. ఇప్పటికే రుణాలు ఎగ్గొట్టిన కార్పొరేట్లకు మరింత మేలు జరిగే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు కంటే బ్యాంకింగ్‌ నిబంధనల్లోనే మార్పులు చేసి కఠిన నిబంధనలను రూపకల్పన చేయడం అత్యంత ఆవశ్యకం. బ్యాడ్‌ బాంక్‌ విజయ వంతం అనే దాని కన్నా బ్యాంకుల నుండి భవిష్యత్‌లో కొత్త ఎన్‌పీఏలు రాకుండా చూడటం అనేది ప్రభుత్వ లక్ష్యం కావాలి.
వ్యాస రచయిత సెల్‌ 9441239578

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img