Tuesday, May 28, 2024
Tuesday, May 28, 2024

సమాఖ్య విధానంపై మోదీ సమ్మెట

డా. జ్ఞాన్‌ పాఠక్‌
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సమాఖ్య విధానంపై సమ్మెట దెబ్బ వేస్తోంది. రాజ్యాంగంలో పొందుపరిచిన సమాఖ్య విధానాన్ని మోదీ ప్రభుత్వం రోజు రోజుకు బలహీనపరుస్తోంది. ప్రతిపక్షం నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ స్వయం నిర్ణయాధికారాన్ని చట్టబద్దంగా మోదీ ఏమీ చేయ లేరు. అయితే రాజ్యాంగంలోని ‘‘ప్రభుత్వం’’ నిర్వచనాన్ని మోదీ మార్చి వేస్తు న్నారు. బలబైన కేంద్రం ఉండాలని అంతేకాదు ఏకీకృత ప్రభుత్వమైతే మరీ మంచిదని మోదీ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ముఖ్యమంత్రి దిల్లీలో రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని త్వరలో నిర్వహించనున్నట్లు చేసిన ప్రకటన ప్రాముఖ్యత సంతరించుకుంది. రాష్ట్రాల అధికారాలను మోదీప్రభుత్వం ఆక్రమించుకుంటూ సమాఖ్య విధానంపై నిరంతరం దాడి చేస్తూనే ఉంది. రాజ్యాంగంలో పొందుపరిచిన రాష్ట్రాల జాబితాలోని అంశాలను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయలేని స్థితికి కేంద్రం నెడుతోంది. ఉమ్మడి జాబితాలోని చాలా అంశాలను కూడా కేంద్రం క్రమంగా హక్కుభుక్తం చేస్తోంది. బహిరంగంగానే రాష్ట్రాలహక్కులను కేంద్రం హరిస్తున్నది. అధికారాలను దుర్వినియోగం చేస్తున్నది. అంతేకాదు రాష్ట్ర, పంచాయితీరాజ్‌ సంస్థల స్థాయిలోను జరిగే పాలనా విధానాలలో జోక్యం చేసుకుంటున్నది.
భారత రాజ్యాంగం ప్రకారం కేంద్ర జాబితాలో లేని అనేక పథకాలు రాష్ట్ర జాబితాలో ఉన్నప్పటికీ తానే అమలు జరుపుతూ జోక్యం చేసుకోవటం పెరిగింది. ప్రజాస్వామ్య మౌలిక సూత్రాన్ని మోదీ ప్రభుత్వం ఉల్లంఘిస్తూ, ఎన్నికైన సంస్థలు లేదా వ్యక్తులపైన మోదీ ప్రభుత్వం సంస్థలను నామినేట్‌ చేస్తోంది. బహుశా భయం, భారత సమాఖ్య విధానాన్ని తప్పుగా అర్థం చేసు కోవటం ఈ చర్యలకు కారణంగా భావించవచ్చు. బలమైన సమాఖ్య వ్యవస్థ అంటే కేంద్ర ప్రభుత్వాన్ని బలహీనపరచటం కాదు. ఈ విషయాలను అర్థం చేసుకునేందుకు రాజ్యాంగంపై చర్చ జరగాలి. మోదీ భావనలు హేతుబద్దం గా లేవు. రాజ్యాంగం ముందు నిలవవు. ఎక్కువ అంశాలు హేతుబద్దత లేని, రాజ్యాంగ విరుద్ధమైనవి. ఈ అంశాలు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు చేసే ఆరోపణలు ఏమీ కాదు. అన్నీ వాస్తవాలే. ఉదాహరణకు ఎన్నికైన దిల్లీ ప్రభు త్వం ప్రతిపక్షానికి చెందినది. మోదీ ప్రభుత్వం కావాలని లెఫ్టినెంట్‌ గవ ర్నరును నియమించి ప్రభుత్వ వ్యవహారాలలో జోక్యం చేసుకుంటుండగా 2018లో సుప్రీంకోర్టులో పిటీషన్‌ వేశారు. అప్పుడు స్వతంత్రంగా నిర్ణయం చేసే అధికారాలు లెఫ్టినెంట్‌ గవర్నరుకు లేవని, ఎన్నికైన ప్రభుత్వానికే ఉన్నాయని కోర్టుతీర్పు చెప్పింది.
సమతౌల్యమైన సమాఖ్య విధానంలో కేంద్రం అన్ని అధికారాలను ఆక్ర మించుకోవడానికి వీలులేదని కారణం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయటం లేదా అరాచకాన్ని సృష్టించటం లాంటివి చెల్లవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మోదీ ప్రభుత్వం గత సంవత్సరం దిల్లీలో ప్రభుత్వ నిర్వచనా న్ని మార్చివేస్తూ చట్టాన్ని చేసింది. దీని ప్రకారం లెఫ్టినెంట్‌ గవర్నరు ఎన్నికైన సంస్థపై అజమాయిషీకి ఎవరినైనా నియమించవచ్చు. ఇది ప్రజాస్వామ్య మౌలిక సూత్రాన్ని తుంగలో తొక్కే చర్య. మోదీ ప్రభుత్వం అధికారానికి వచ్చి న తరవాత ప్రజాస్వామ్య విరుద్ధమైన చర్యలు అనేకం తీసుకుని అమలు చేసింది. తాను నియమించిన సంస్థలకు రాష్ట్రాలకు, పంచాయితీ రాజ్‌ సంస్థ లకు ఉద్దేశించిన పథకాలను కేంద్రమే అమలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రుల మధ్య తీవ్ర విభేదాలు ఏర్పడినం దున ప్రతిపక్ష ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించనున్నారు. పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, గోవా, దిల్లీ ప్రభుత్వాలకు, గవర్నర్లకు మధ్య పదేపదే ఘర్షణ వాతావరణం నెలకొంటున్నది. గవర్నర్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం తన రహస్య ఎజెండాను నెరవేర్చుకుంటుంది. ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలపై గవ ర్నర్లు పెత్తనం చేసేందుకు పూనుకుంటున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమ తా బెనర్జీ, గవర్నర్ల అధికార దుర్వినియోగం, రాజ్యాంగ ఉల్లంఘన చర్యల పైన చర్చించారు. అనంతరమేప్రతిపక్ష ముఖ్యమంత్రుల సమావేశాన్ని మమత ప్రతిపాదించారు. స్టాలిన్‌ మాత్రం రాష్ట్ర స్వయం నిర్ణయాధికారాన్ని పరిరక్షిం చేందుకు తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. మమతాబెనర్జీ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధన్కర్‌ మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాక అసెంబ్లీని గవ ర్నర్‌ ప్రోరోగ్‌ (కొంతకాలం నిలిపివేయటం) చేశారు. మంత్రివర్గ సిఫారసు ను అనుసరించి తాను అసెంబ్లీని ప్రోరోగ్‌ చేసినట్టు గవర్నర్‌ తన చర్యను సమర్థించుకున్నారు. గవర్నర్‌ రాజ్యాంగ పరిమితులను ఉల్లంఘిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం విమర్శించింది. పైగా రాష్ట్రం ప్రజాస్వామ్య గ్యాస్‌ చాంబర్‌గా మారిందని ధన్కర్‌ తీవ్ర వ్యాఖ్య చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం ప్రకటించింది. రాష్ట్రంలో నీట్‌ వ్యతిరేక బిల్లును అసెంబ్లీ ఆమోదించకుండా గవర్నర్‌ ఆర్యన్‌రవి పనిచేశారని రాష్ట్ర ప్రభుత్వం విశ్వసిస్తున్నది. ముఖ్య మంత్రి స్టాలిన్‌ గవర్నరుకు బిల్లును మరోసారి పంపిస్తూ రాష్ట్రపతి ఆమోదా నికి పంపాలని డిమాండ్‌ చేశారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవంఠాక్రేను ముంబయిలో, మమతా బెనర్జీని హైదరాబాద్‌లో త్వరలో కలిసి మాట్లాడనున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చెప్పారు. అనేక ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్య మంత్రు లను కూడా సంప్రదించి సమాఖ్య వ్యవస్థను మోదీ దాడుల నుండి పరిరక్షిం చేందుకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్‌ పాలనలోని రాజ స్థాన్‌, ఛత్తీస్‌ఘర్‌ రాష్ట్రాలు కూడా కేంద్ర జోక్యంతో ఇబ్బందులకు గురవుతు న్నాయి. రాష్ట్రాల స్వయం నిర్ణయాధికారాన్ని పరిరక్షించేందుకు దిల్లీ ముఖ్య మంత్రి కేజ్రీవాల్‌ చాలా సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నారు. ఈ ప్రయత్నం విజయం కావాలని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img