Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

స్వరం మారుతోంది

బుడ్డిగ జమిందార్‌

అమెరికా`జపాన్‌లలో ఆస్ట్రేలియాకు స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి. ఈ తరహా స్వేచ్ఛా వాణిజ్యాన్ని భారతదేశంతో చేసుకోవాలనుకొంటున్నామని ఆస్ట్రేలియా వాణిజ్యమంత్రి డాన్‌ టెహాన్‌ అన్నాడు. ఇదేగాని అమలు జరిగితే ఇకపై మనదేశ వ్యవసాయోత్పత్తులకు రక్షణ సన్నగిల్లుతుంది. రైతుల నెత్తిపై గుదిబండ పడినట్లే. బొగ్గు దిగుమతులతో మన జాతీయ బొగ్గు గనులు కూడా ఆస్ట్రేలియాకు అమ్మేసే ప్రమాదముంది.

క్వాడ్‌ఉద్దేశం చైనా ఎదుగుదలను నిర్థాక్షిణ్యంగా అణగదొక్కటానికేనని ప్రగల్బాలు పలికిన కూటమి దేశాల వైఖరిలో సెప్టెంబరు 24న శ్వేతసౌధంలో వారి కలయిక తర్వాత స్పష్టమైన మార్పు కనబడుతోంది. ఆస్ట్రేలియా ప్రధాని స్కోట్‌ మోరీసన్‌ ఆన్‌లైన్‌మీడియా మీటింగులో మాట్లాడుతూ యు.ఎస్‌, జపాన్‌, భారత్‌, ఆస్ట్రేలియాలు భాగస్వాములుగా ఉన్న క్వాడ్‌ లక్ష్యం చైనా వృద్ధిని నిరోధించటం కాదనీ, చైనాను క్వాడ్‌లోకి తీసుకురావటానికి తమ దేశం సిద్ధంగా ఉందనీ, ఆస్ట్రేలియా ఒక నియంత్రణ క్లబ్‌లో మాత్రం లేదని అంటూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఆస్ట్రేలియా, యూఎస్‌, యూకేలు కలిసి ఏర్పరచుకున్న యుద్ధ కూటమి ఔకస్‌ ఏర్పాటుతో ప్రపంచంలో ఎదురు గాలి వీచింది, చాలా దేశాల నుండి సానుకూల స్పందన రాని కారణంగా ప్రధాని ఈ విధంగా ప్లేటు ఫిరాయించాడని విశ్లేషణలు చేస్తున్నారు. చైనాకు సమతుల్యంగా ఆస్ట్రేలియా, భారత్‌లు ఉండాలని కోరు కోవటం లేదని, ఆసియాపసిఫిక్‌లో స్వేచ్ఛగా, బహిరంగంగా చైనాతో కల్సి పని చేయటానికి రెండు దేశాలు సిద్ధంగా ఉన్నాయని అంటూ చైనాలో ఒకింత ఉద్రిక్తతలనుతగ్గించటానికి ఆస్ట్రేలియాప్రధాని ప్రయత్నించినట్లుగా మాట్లాడాడు. రెండు పక్షాల మధ్య నిబంధనల కోసం కాదని, క్వాడ్‌ ఈ ప్రాంతంలో అన్ని దేశాలతో సమానంగా పని చేయటానికి ప్రయత్నించాలనుకొంటుందని, ఇది వరకు చైనాపై గల కోపతాపాలను పక్కకు నెట్టినట్లు మాట్లాడారు. నియమాల ఆధారిత క్రమాన్ని ఆస్ట్రేలియాభారత్‌ కోరుకుంటున్నాయని, చైనా సహకారం ఇందుకోసం ఉంటుందని చైనాను మచ్చిక చేసుకోవటానికన్నట్లు మోరీసన్‌ మాట్లాడాడు. ఆసియా పసిఫిక్‌లో స్వేచ్ఛా వాణిజ్యం వలన చైనా సహకారంతో ఆస్ట్రేలియా చాలా లాభపడిరదని అనటం వెనుక ఇప్పుడు క్వాడ్‌ ఏర్పడిన తర్వాత, దీనికి అదనపు భారంగా పరిణమించిన ‘ఔకస్‌’ కూటమితో ఆస్ట్రేలియా ‘రిమోట్‌’గా ఇండోపసిఫిక్‌లో మిగలనుందనే భయం ఆస్ట్రేలియా ప్రధానికి కల్గిందని అనిపిస్తోంది. కనుకనే చైనాను దువ్వటం ఆరంభించారు. గత సంవత్సరంలో 3శాతం వాణిజ్యం ఆస్ట్రేలియాచైనాల మధ్య తగ్గి నప్పటికీ ఎగుమతులు, దిగుమతులు కలిపితే చైనాతో ఆస్ట్రేలియా 24,500 కోట్ల డాలర్ల వాణిజ్యాన్ని చేసింది. ఇదే సంవత్సరంలో ప్రపంచంలో ఆస్ట్రేలియా వాణిజ్యం 13 శాతం తగ్గటం గమనించింది. రెండు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం నడుమ ప్రస్తుతం ఆస్ట్రేలియా బొగ్గు, వ్యవసాయ ఉత్పత్తులను చైనా ఆపింది. దీనితో ఆస్ట్రేలియాలో వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు సంక్షోభం వ్యాపించింది. ఆ లోటును మనదేశం చైనాతో పూడ్చుకోవటం మాని, క్వాడ్‌ కూటమి పేరిట ఆస్ట్రేలియాతో చైనాకు వ్యతిరేకంగా కూటమిని కట్టటం భారతదేశం చేసిన వ్యూహాత్మక తప్పిదంగా భావించవచ్చు. అణు ఇంధన పరిజ్ఞానంతో అమెరికాయూకేల సహకారంతో జలాంతర్గాములను నిర్మించా లనుకొంటున్న ఆస్ట్రేలియాకు చెంపపెట్టుగా రష్యా అక్టోబరు 3న సమాధాన మిస్తూ హైపర్‌సోనిక్‌ క్షిపణిని జలాంతర్గాముల నుండి ప్రయోగాత్మకంగా పరీక్షించి విజయం సాధించింది. క్రితం సంవత్సరం ఆఫ్గానిస్థాన్‌పై చర్చలు దోహాలో తాలిబాన్లకుఅమెరికాకు మధ్య జరిగినప్పుడు భారతదేశాన్ని పరిగణలోకి తీసుకోకుండా అమెరికా ఒప్పందం చేసుకొందని మన విదేశాంగ మంత్రి జై శంకర్‌ అన్నారు. అఫ్గాని స్థాన్‌లో ఏర్పడబోయే ప్రభుత్వంలో అన్ని పక్షాల భాగస్వామ్యం ఉంటుందో లేదో, లేక ఉగ్రవాదానికి ఆఫ్గాన్‌ భూమి స్థావరం కానుందా లేదా అనే విషయం కూడా మాకు చెప్పలేదని అమెరికాపై భారత్‌కు ఇంతవరకూ గల లోపలి అక్కసును విదేశాంగమంత్రి బయటపెట్టారు. ఈ తరహాలోనే చాలా అతి రహ స్యంగా ఔకస్‌ చర్చలు కూడా భారత్‌ ప్రమేయం లేకుండానే జరగటంవిశేషం. మనల్ని అసలు ఏమాత్రం లెక్కచేయని అమెరికాను పట్టుకుని ఎందుకు వేలాడాలో అర్థం కాని ప్రశ్న! పైకి మాత్రం గంభీర ప్రకటనలు, ఆలింగనాలు. జిఎస్‌పి ఒప్పందాన్ని 2019లో ట్రంప్‌ రద్దు చేసాడు. దీనిద్వారా 2 వేల రకాల ఉత్పత్తుల ఎగుమతులకు అమెరికా సుంకాలు విధిస్తూ, అప్పటివరకూ గల సుంకాలరహిత వాణిజ్యాన్ని రద్దు చేస్తే ఇప్పటివరకూ జిఎస్‌పీ విధానం తిరిగి కావాలని మన ప్రభుత్వం గట్టిగా అడగలేకపోతోంది. నూతనంగా ఒప్పందాల్ని కూడా అమెరికాతో చేసుకోలేకపోయింది. 2019తో పోలిస్తే 2020 ఎగు మతులు అమెరికాకు 11.3 శాతం పడిపోయాయి. రానున్నకాలంలో ఇంకా తగ్గే అవకాశాలున్నాయి తప్ప పెరిగే మార్గాలు లేవు.
అమెరికా`జపాన్‌లలో ఆస్ట్రేలియాకు స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి. ఈ తరహా స్వేచ్ఛా వాణిజ్యాన్ని భారతదేశంతో చేసుకోవాలనుకొంటు న్నామని ఆస్ట్రేలియా వాణిజ్యమంత్రి డాన్‌ టెహాన్‌ అన్నాడు. ఇదేగాని అమలు జరిగితే ఇకపై మనదేశ వ్యవసాయోత్పత్తులకు రక్షణ సన్నగిల్లుతుంది. రైతుల నెత్తిపై గుదిబండ పడినట్లే. బొగ్గు దిగుమతులతో మన జాతీయ బొగ్గు గనులు కూడా ఆస్ట్రేలియాకు అమ్మేసే ప్రమాదముంది.
కొవిడ్‌ మహమ్మారి విజృంభించిన తర్వాత యిప్పుడిప్పుడే ప్రపంచ ప్రజలు కోలుకొంటున్నారు. కానీ ఈ మహమ్మారిని ఆసరా చేసుకొని కార్పొరేట్‌ సంస్థలు, వారికి అండగా నిల్చే ప్రభుత్వాలు ఎప్పుడో మేల్కొని ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకొని లాభాల బాటలో ముందున్నాయి. ప్రభుత్వం ప్రజల ఆస్తుల్ని కార్పోరేట్లకు కట్టే ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ, ఉద్దీపన చర్యల పేరిట పెద్దమొత్తాల్లో బ్యాంకుల రుణాల్ని రద్దు చేయటమేగాక మహమ్మారిని వైద్యరంగం వ్యాపారానికి వాడుకొంది. ఇప్పుడిప్పుడు అకస్మాత్తుగా వస్తూత్పత్తి మందగించటం వలన ఉత్పత్తి రంగంలో లాభాలు మందగించటంతో కార్పొరేట్ల గాలి ఊహాజనిత ద్రవ్య పెట్టుబడులపైనా, యుద్ధరంగ కూటముల పైన పడి లాభార్జనలో కార్పొరేట్లు పడ్డారు. అధికశాతం లాభాలను ఆర్జించే ఆయుధ పరిశ్రమల ఉత్పత్తులను ప్రజల నెత్తిపై రుద్దుతూ సరికొత్త భారాన్ని మోపు తున్నారు. మరోవైపు చెల్లాచెదురైన వాణిజ్య లావాదేవీలు కూడా నూతన కూటముల పేరిట దేశాలకు పరిచయమౌతున్నాయి. అంతిమంగా ఈ బాధ, భారం మోసేది సామాన్య మనిషి గనుక ఆర్థిక వ్యత్యాసాలు అసమానతలు పెరిగి ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ సంక్షోభ దిశగా పెరిగి ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుంది. సంక్షోభాలు తీవ్రతరంగాకుండా మొసలి కన్నీరు కారుస్తూ యుద్ధాలను, నూతన వాణిజ్య కూటములను ప్రోత్సహిస్తూ గంటకో స్వరం మారుస్తున్న ప్రభుత్వాల తీరును పసిగట్టి ఉద్యమించకపోతే సామాన్య మానవుని పరిస్థితి మరీ దిగజారే అవకాశముంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img