Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

ఆపరేషన్‌ స్టోన్‌

చింతపట్ల సుదర్శన్‌

తప్పులనేవి అవి తప్పులనే సంగతి తెలీకుండానే జరిగి పోతుంటాయి. తప్పు జరిగాక, జరిగింది తప్పని తెలిశాక, ఎవరైతే మాత్రం ఏం చేయగల్రు తప్పు జరిగిపోయిందే అనుకోవం తప్ప.
కడుపునిండాక కూడా ఇంకో ముక్క అనుకోవడం కుక్క బుద్ధికాక మరోటికాదు కదా. ఇక చాలు వెళ్లిపోదామనుకుంటూనే తప్పు చేసింది డాగీ. ఒరేయ్‌ ఇక చాలురా, నిండిపోయేనురోయి అని ఏ కడుపూ అరచి చెప్పలేదు కదా! మరొక్కటే అనుకుంటూ షాపు ముందు నుంచున్న డాగీ మూతి ముందు ఎగిరొచ్చి ఏ ఎముకా పడలేదు కానీ నడివీపు చురుక్కుమంది. అది ఎండ చమక్కు చురుక్కూ కాదు. ఎవడో వెధవ అరచేతిలో పట్టినంత గులకరాయిని క్రికెట్టు ఆటలో ఫాస్ట్‌ బాల్‌ లాగ విసిరేశాడు. గురి తప్పని గులకరాయి ఫట్టుమని తాకింది వీపుని, అంతే అనవసరంగా తిన్నది చాలక ఆశగా కూచోవడం తప్పయిందని అప్పుడర్థమైంది డాగీకి. తన మీదకు ఆ గులకరాయి విసిరేసిన వాడెవడా అని వెనక్కి తిరిగి చూసింది వీలైతే వాడిపిక్క అంతుచూద్దామని నోరు తెరిచింది. రాయి విసిరినవాడు, వెనక్కి తిరిగి చూడకుండా పరుగెత్తడం కనిపించింది. ‘వీడికిదేం పోయే కాలం’ నామానాన నాపని చేసుకుంటుంటే రాయి విసిరాడు. కొందరు ఆకతాయిలకు, తుంటరోళ్లకు అదేం బుద్ధో మరి కుక్క కండ్లపడితే చాలు, మీద పడి కరుస్తుందన్న భయంతో ఇలా రాళ్లు విసుర్తారు అని కనపడకుండా పోయిన వాడ్ని ప్రభుత్వాన్ని ప్రతిపక్షంవాడు తిట్టినట్టు తిట్టిపోస్తూ, కుయ్యోవ్‌ మొర్రోవ్‌ మంటూ ఇంటిదారి పట్టింది డాగీ. కళ్లముందు తన వీపు వాయగొట్టిన రాయే కనిపిస్తున్నది. రాయీ ఎంత పని చేశావే, నేన్నీకేం అపకారం చేశానే రాయీ, ఓ రాయీ, నా రాయీ, రాయీ అనుకుంటూ అరుగు ఎఅంతకుముందే అరుగుమీద ఉన్న డాంకీ ఏమిటి బ్రో భవ్వు భవ్వు మనాల్సిన వాడివి కుయ్యోవ్‌ మొర్రోవ్‌ అంటూ మూలుగుతున్నావు అనడిగింది. అంతా, నా గ్రహచారం ఈ ఇయర్‌ నా హారోస్కోప్‌ ‘హారిబుల్‌’గా ఉన్నట్టుంది అంది డాగీ. హారోస్కోపులూ, టారట్‌ రీడిరగులూ, న్యూమరాలజీలు, మనుషులకే కాని డాగీస్‌కు డాంకీలకు కూడానా! మనలీడర్లు పార్టీలు మార్చినట్టు కొంపలు మార్చుకుంటూ తిరిగే గ్రహాలు మనని పట్టించుకోవులే. పొరపాటున పట్టించుకున్నా యేమో. లేకపోతే నా మానాన నేను మరొక బోన్‌పీస్‌ కోసం పీస్‌ఫుల్‌గా వెయిట్‌ చేస్తుంటే ఓ టెర్రరిస్టు నా మీదకు కోడిగుడ్డంత గులకరాయి విసిరేశాడు. అర్జునుడు మత్స్య యంత్రాన్ని కొట్టినట్లు అది నా వీపుమీద ఫటేల్‌ మంది. నొప్పి ఇంకా సలుపుతూనే ఉంది అంది డాగీ.
అంత దెబ్బ కొడితే గౌతమ బుద్ధుడిలా చూస్తూ ఊరుకున్నావా? ఎందుకూరుకుంటాను నా పళ్ల మధ్య వాడి పిక్కను పట్టుకుందును కానీ వాడు చిక్కడు దొరకడులా పారిపోయేడు. వాడికీ నీకూ పాత గొడవేమన్నా ఉందేమో. ఇంతకుముందే వాడి మీద వాడు జడుసు కునేట్టు అరిచావేమో ఆ కసి తీరడానికి రాయి తీసుకుకొట్టాడేమో గుర్తు చేసుకో అంది డాంకీ. మొన్న ఓ పార్టీ వాళ్లు ఊరేగింపుగా వెళ్తుంటే రోడ్డు వార పడుకున్న నా తోకను తొక్కేస్తాడేమోనని ఒకడి మీద భవ్వుమన్నా వాడేనేమో అంది డాగీ గుర్తు చేసుకుంటూ. సరిపోయింది నువ్వు మరో పార్టీకి సపోర్టు చేస్తున్నావనుకుని ‘ఛాన్సు దొరికెరా  య్యా’ అంటూ నువ్వు ఫుడ్డుకోసం దేబిరిస్తున్నప్పుడు వేశాడు వేటు అదే, రాయితో పోటు అంది డాంకీ. అదిరాయే కానీ మామూలు రాయి కాదు. కన్నుకు తగిలితే కన్నే పోయేది. నుదుటికి తగిలితే చిట్లిపోయేది. రాయా అది మాయదారి రాయి పలుగురాయి, గులకరాయోయి రాయి అని మళ్లీ కుయ్యో మొర్రో మన్నది డాగీ. మళ్లీమళ్లీ గుర్తు చేసుకుని ఏడవకు. ఎవడూ యూ ట్యూబులో పెట్టి నీ నొప్పిని ప్రచారం చేయడు. కట్టూ కట్టడు అని డాంకీ అంటుంటే అరుగు ఎక్కాడుఅబ్బాయి. కట్టు అంటున్నావు ఏమైందేమిటి? అన్నాడు. ఏముందీ వడ్ల గింజలో బియ్యపు గింజ. పేరూ, ఊరూ తెలీని వాడెవడో రాయి విసిరాట్ట. అది డాగీ వీపు నిమిరిందంట. తనేమైనా వీఐపీనా కట్టుకట్టడానికి, టీవీలో ప్రసారం చెయ్యడానికి అంది డాంకీ. యూ ఆర్‌ రైట్‌ డాంకీ. వీవీఐపీలకు, జెడ్‌ సెక్యూరిటీలు, వందల్లో పోలీసులు కాపలా కాస్తారు కాని మీకూ మనిషి నయినా మీలాగే అడ్రసులేని నాకూ ఎవరున్నారు చెప్పు అన్నాడ బ్బాయి. మనకు లేకపోతే పోయిందేమీ లేదుకాని అన్నీ ఉన్నా మనుషుల మీద రాళ్లు పడుతున్నాయికదా? అంది డాంకీ. ఆ రాయి విసిరిన వాడు చీకట్లో ఎవరిమీదకు విసిరాడో, కావాలని తానే విసిరాడో, ఎవరైనా విసరమంటే విసిరాడో, తన గురి కర్టెక్టవునో లేదో నని విసిరాడో ఎవరికి తెలుసు, లోగుట్టు పెరుమాళ్లకెరుక అన్నారు కాదూ అంది డాగీ. వెనకటికి రాజులు ఎదురూ బదురూ నిలబడి కత్తులతో పొడ్చుకునే వాళ్లు, ఇప్పుడదేంలేదు. వీరు లేనప్పుడు వారు, వారు లేనప్పుడు వీరు బూతు పంచాంగ శ్రవణం చెయ్యడమే. ఇక రాళ్లూ రప్పలూ, కోడికత్తులూ, ప్రాణాల్తీయలేవుగాని సానుభూతి సంపాదించి పెడ్తవి. అవినిజంవి అయినా, డామ్రాలయినా కొద్దో గొప్పో ఓట్లు కొల్లగొట్టకపోవు అన్నాడబ్బాయి. అప్పుడు అన్ని పార్టీల వాళ్లు రాళ్లు విసిరించుకుంటేసరి అంది డాంకీ. నా మీద రాయి విసిరినోడు పారిపోయేడుకానీ, పెద్దోళ్లమీద రాయి విసిరితే అది గచ్చకాయంత రాjైునా సరే ఆ విసిరినోణ్ణి ఉరితీయరూ అంది డాగీ. నీమీద రాయి విసిరినోడిది హత్యాప్రయత్నమేనంటావా? అంది డాంకీ పళ్లికిలిస్తూ.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img