Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

ఫలితమివ్వనున్న న్యాయయాత్ర

టి.వి.సుబ్బయ్య
దేశంలో ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల్లో మొదటి దశలో ఈనెల 19న జరగనున్న పోలింగ్‌లో బీజేపీతో కాంగ్రెస్‌ దాదాపు సమానంగా సీట్లు గెలవనున్నదన్న సంకేతాలున్నాయి. ఈ ప్రాంతంలో మొత్తం 25 లోక్‌సభ సీట్లుండగా మొదటి దశలో 14 నియోజకవర్గాల్లో పోలిగ్‌ జరుగుతుంది. బీజేపీ 6 సీట్లలో, దాని మిత్రపక్షాలు రెండు స్థానాల్లో, కాంగ్రెస్‌ 5 సీట్లలో, దాని మిత్రపక్షాలు 2 సీట్లలో పైచేయిగా ఉన్నాయని అంచనాలు వచ్చాయి. అరుణాచల ప్రదేశ్‌ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు పోటీపడుతున్నాయి. బీజేపీ అభ్యర్థిగా కిరణ్‌ రిజిజు రాష్ట్రంలో పశ్చిమ నియోజక వర్గంలో పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి నబంటుకి కంటే కిరణ్‌రిజిజు పైచేయిగా ఉన్నారు. మరో ముఖ్యమైన అభ్యర్థి గణ సురక్ష పార్టీకి చెందిన టొకో శీతల్‌ కూడా ఇక్కడ పోటీ చేస్తున్నారు. తపీర్‌గవో (బీజేపీ) అరుణాచలప్రదేశ్‌ తూర్పు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి బొసిరాం సిరం, తపీర్‌ గవోల మధ్య నువ్వానేనా అన్నట్లు పోటీ ఉంది. అరుణాచల్‌ డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కూడా పోటీలో ఉన్నారు. 2019లో ఈ రెండు సీట్లను బీజేపీ గెలుచుకుంది. మొదటిదశలో అసోంలో కజిరంగ, సొనిట్‌పూర్‌,లఖింపూర్‌,దిభ్రూఘర్‌, జోర్హట్‌ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతుంది. ఇండియా కూటమిలో అసోం జాతీయ పార్టీ, కాంగ్రెస్‌లు కలిసి పోటీ చేస్తున్నాయి. అలాగే బీజేపీ, అసోం గణ పరిషత్‌, యునైటెడ్‌ పీపుల్స్‌ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. కజిరంగలో బీజేపీ నుంచి కామాఖ్య ప్రసాద్‌ తస, కాంగ్రెస్‌ అభ్యర్థిగా రోజ్‌లిన టిర్కి పోటీచేస్తుండగా కాంగ్రెస్‌ పైచేయిగా ఉంది.
సొనిత్‌పూర్‌లో బహుపక్షాల మధ్య పోటీ ఉంది. రంజిత్‌ దత్తా (బీజేపీ), ప్రేమ్‌లాల్‌గంజ్‌ (కాంగ్రెస్‌), ప్రధాన అభ్యర్థులు, అయితే ఆప్‌ అభ్యర్థి అజిరాజ్‌శర్మ, బీపీఎఫ్‌ అభ్యర్థిరాజు దియురి రంగంలో ఉన్నారు. వీరు లేకపోతే కాంగ్రెస్‌కు విజయావకాశాలున్నాయి. అలాగే లఖింపూర్‌లో బీజేపీ అభ్యర్థి ప్రధాన భారువ, కాంగ్రెస్‌ తరఫునన ఉదయ్‌ శంకర్‌ హజారిక, ఏటీసీ అభ్యర్థి ఘణకాంత్‌ ఛుటియ, సీపీఐ అభ్యర్థి ధిరేన్‌ కచారిలు పోటీ చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌, మధ్య గట్టిపోటీ నెలకొంది. దిభ్రూఘర్‌, జోర్‌హట్‌లో ముగ్గురి మధ్య పోటీ నెలకొంది. దిబ్రూ ఘరల్‌ బీజేపీ, ఆప్‌, ఏజీపీ మధ్య ప్రధానపోటీ ఉంది. జోర్‌హట్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ప్రధాన పోటీ. 2023లో మణిపూర్‌లో కల్లోలం ఏర్పడి ప్రజల జీవనం దుర్భరమైంది. ఇన్నర్‌ మణిపూర్‌, ఔటర్‌ మణిపూర్‌ సగంలో మొదటి దశలో పోలింగ్‌ జరుగుతుంది. మరో సగం ఔటర్‌ మణిపూర్‌లో రెండవ దశలో ఏప్రిల్‌ 26న జరుగుతుంది. మణిపూర్‌ ప్రజలు ప్రధాని మోదీపై ఆగ్రహంతో ఉన్నారు. మణిపూర్‌లో రాహుల్‌ పర్యటనకు మంచి ఆదరణ లభించింది. ఇక్కడ బీజేపీ, నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ కలిసి పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేస్తోంది. ఇప్పటికీ తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనిఉన్న మణిపూర్‌లో గట్టిపోటీ ఉంది. మెజారిటీ వర్గం మెయితీలు బీజేపీని రెచ్చగొట్టడం వల్లనే అనేక నెలలుగా ఘర్షణలు, హింసాకాండ జరిగింది. ఇన్నర్‌ మణిపూర్‌లో బీజేపీ అభ్యర్థి టి.ఒ సంపత్‌కుమార్‌ సింగ్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి అంగోమ్‌ చబిమోల్‌ అకోయి జమ్‌ల మధ్య గెలుపు నువ్వానేనా అన్నట్లు పరిస్థితి ఉంది. ఔటర్‌ మణిపూర్‌లో కాంగ్రెస్‌ అబ్యర్థి ఆల్‌ఫ్రెడ్‌ కన్‌నగమ్‌ ఆర్థిర్‌, ఎన్‌పీఎఫ్‌ అభ్యర్థి కచూరి తిమోతీజిమిక్‌ మధ్య గట్టిపోటీ ఉంది. రాష్ట్రంలో ఇప్పటికీ జాతుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈసారి బీజేపీకంటే కాంగ్రెస్‌ మెరుగైన పరిస్థితిలోఉంది.
ఇక మేఘాలయ రెండు సీట్లలోనూ బీజేపీ పోటీ చేయడంలేదు. ఎన్‌డీఏలో భాగస్వామి అయిన నేషనల్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ రెండు సీట్లలోనూ పోటీ చేస్తోంది. రెండు సీట్లలోనూ కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేస్తోంది. ఇంకా ఇతర చిన్న పార్టీలు పోటీరంగంలో ఉన్నాయి. షిల్లాంగ్‌లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి విన్సెంట్‌ పాల్‌తోపాటు మరికొన్ని చిన్నపార్టీలు కూడా పోటీ చేస్తున్నాయి. అలాగే తురలో కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రముఖ నాయకుడు ఎ సంగ్మా గాకుండా మరికొన్ని చిన్న పార్టీలు పోటీ చేస్తున్నాయి. షిల్లాంగ్‌లో కాంగ్రెస్‌ పైచేయిగా ఉంది. తురలో ఏఐటీసీ ఉన్నందున కాంగ్రెస్‌ కాస్త బలహీనంగా ఉంది. ఈ సీటుపైన తృణమూల్‌ కాంగ్రెస్‌ శ్రద్ధ వహించి పోటీ చేస్తోంది. ఇక నాగాలాండ్‌లోనూ మొదటిదశలోనూ పోలింగ్‌ జరుగుతుంది. మిజోరంలోని ఏకైక సీటులో ప్రధానంగా ఎంఎఫ్‌, జెడ్‌పీఎమ్‌, కాంగ్రెస్‌, బీజేపీ, ఎంపీసీలు పోటీపడుతున్నాయి. జడ్‌పిఎం పార్టీ అన్ని పార్టీలకంటే పైచేయిగాఉందని అంచనా. నాగాలాండ్‌లోని ఏకైక సీటులో బీజేపీ పోటీ చేయడంలేదు. ఇక్కడ ఎన్‌డీపీపీ, కాంగ్రెస్‌ల మధ్య పోటీ ఉంది. సిక్కింలో ఉన్నఒకే ఒక సీటులో ఎస్‌కెఎమ్‌, ఎస్‌డీఎఫ్‌, కాంగ్రెస్‌ పోటీలోఉన్నప్పటికీ, ఎస్‌కేఎంది పైచేయిగా ఉంది. త్రిపురలో రెండు సీట్లున్నాయి. వీటిలో ఒకటి మొదటి దశలోనే పోలింగ్‌ జరుగుతుంది. తిప్ర మొధ పార్టీతో కలిసి బీజేపీ త్రిపుర పశ్చిమప్రాంతంలో పోటీ చేస్తోంది. మరో సీటులో కాంగ్రెస్‌, సీపీఎంలు ఇండియాకూటమిలో భాగంగా పోటీ చేస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి బిబ్‌లాబ్‌ కుమార్‌ కాంగ్రెస్‌అభ్యర్థి ఆశిశ్‌కుమార్‌ల మధ్య నువ్వా నేనా గెలుపు అన్నట్లుగా ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img