Friday, April 26, 2024
Friday, April 26, 2024

కశ్మీర్‌ ఉద్యోగులపై యమపాశాలు

డా. రాధా కుమార్‌

డిస్మిస్‌ చేసిన ఉద్యోగులపై పెట్టిన కేసులు అత్యంత తీవ్రమైనవి. టెర్రరిస్టులకు సహకరించినట్టుగా ఎలాంటి సాక్ష్యాధారాలను ఇంతవరకు బయట పెట్టలేదు. మీడియా వార్తలను ఆధారం చేసుకుని చర్యలు తీసుకొంటున్నారు. 2002`14 మధ్య శాంతిని నెలకొల్పేందుకు తీసుకున్న చర్యలన్నింటిని 2020 నుండి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ పాలకులు వమ్ము చేశారు. సైన్యం ఇప్పటికీ గాలింపు కార్యకలాపాలను సాగిస్తూనే ఉన్నది. 1990లలో లొంగిపోయిన మిలిటెంట్‌లకు పునరావాసం కల్పించాలన్న ప్రయత్నాలను ఇప్పటికీ అమలు చేస్తున్నారు. ఈ విధానాన్ని 2000 సంవత్సరం వరకు ముందుగా పొడిగించారు. శాంతిని నెలకొల్పే చర్యలు కొనసాగుతున్నప్పటికీ భద్రతా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అరెస్టులు, ఉద్యోగాల తొలగింపు కొనసాగిస్తామని చెప్తున్నారు.

కశ్మీర్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు వర్తింపచేసేందుకు వీలుగా అత్యంత తీవ్రమైన నియమ నిబంధనలతో కూడిన జీఓను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా 2021 సెప్టెంబరు 16న జారీ చేశారు. ‘‘ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తన, గత చరిత్ర పరిశీలన’’ పేరుతో (జీఓ నెం: 957జెకె (జీఎడీ) 2021) ప్రభుత్వ ఉత్త ర్వులను విడుదల చేశారు. విధ్వంసం, గూఢచర్యం, టెర్ర రిజం, విచ్ఛిన్నం, దేశ ద్రోహం, వేర్పాటు వాదం, విదేశీ జోక్యానికి అవకాశం కల్పించటం, హింసను ప్రేరేపించటం లేదా రాజ్యాంగ విరుద్ధ చర్యకు పాల్పడినా లేదా అలాంటి వారికి సహకరించినా కొత్త జీఓ కింద ఉద్యోగులను తమ ఉద్యోగాల నుండి తొలగిస్తారు. అంతేకాదు ఉద్యోగి కుటుంబ సభ్యులు ఎవరైనా లేదా పైన పేర్కొన్న కార్యకలాపాలలో పాల్గొంటూ ఉద్యోగి ఇంట్లో ఉన్నప్పటికీ ఆ ఉద్యోగిని తొలగిస్తారు. ఈ నియమ నిబంధనలు ఉద్యోగుల పాలిట యమపాశాలే అవుతాయి. భారతదేశం నుంచి కశ్మీర్‌ విడిపోయి స్వతంత్రంగా ఉండాలని కోరిన వారితో మంచి పరిచయం ఉన్నవారిని కూడా ఉద్యోగం నుంచి తప్పిస్తారు. వాస్తవంగా అలాంటి వారి భావాలతో ఏకీభవించక పోయినా ఉద్యోగం కోల్పోవలసిందే. తప్పు చేసిన వారిని వదిలేసి అలాంటి వారికి తెలిసిన ఉద్యోగులను శిక్షించడానికి ఈ జీఓ ఉపయోగపడుతుంది. ఇలాంటి కేసులకు గురైనవారు కావాలంటే తొలగింపును సవాల్‌ చేసే హక్కులు అతి స్వల్పమే. గతంలో 2020 జులై 30న ప్రధాన కార్యదర్శి బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం ఉద్యోగుల తొలగింపు కేసులను పరిశీలించి సిఫారసు చేసేందుకు పరిశీలక కమిటీని ఏర్పాటు చేస్తూ ఒక జీఓను జారీ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 311లోని జమ్ము కశ్మీర్‌ ప్రభుత్వ జనరల్‌ సర్వీసు రూల్స్‌ను సవరిస్తూ జీవో జారీ చేశారు. దేశ ప్రయోజనాల రీత్యా ఉద్యోగిని విచారించకుండానే తొలగించటానికి ఈ జీఓ ఉపకరిస్తుంది. ఆర్టికల్‌ 311(2) (సి) ప్రకారం తొలగించిన ప్రభుత్వ ఉద్యోగుల మీద వచ్చిన ఆరోపణలపై అధికారులు పరిశీలించి సంతృప్తి చెందితే ఉద్యోగులను విచారణ చేయవలసిన అవసరం లేదు. దేశ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్నారంటూ ఇప్పటికే దాదాపు వేయి మంది ఉద్యోగులను సుబ్రహ్మణ్యం కమిటీ గుర్తించింది. రాష్ట్ర పోలీసు అదనపు మాజీ డైరెక్టర్‌ జనరల్‌ (సీఐడి) నాయకత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేశారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలలో భాగస్వాములైన ప్రభుత్వ ఉద్యోగులను ఈ కమిటీ గుర్తిస్తుంది. ఈ కమిటీయే ఉద్యోగిని డిస్మిస్‌ చేసేందుకు సిఫారసు చేస్తుంది. ఆ సిఫారసును సంబంధిత అధికారులు పరిశీలించి చర్య తీసుకుంటారు. భద్రతా ప్రయోజనాల రీత్యా ముందుగా విచారణ లేకుండానే ఏప్రిల్‌ 30న ప్రభుత్వ పాఠశాల టీచర్‌ ఇడ్రస్‌ జాన్‌, కాలేజీ ప్రొఫెసర్‌ డా. అబ్దుల్‌ బరి నాయక్‌, పుల్వామా నాయిబ్‌ తహశీల్దార్‌ నజీర్‌ అహ్మద్‌ వనీలను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సిన్హా ఉత్తర్వు మేరకు డిస్మిస్‌ చేశారు. 2021 మే జులై మధ్య కాలంలో కనీసం పన్నెండు మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేశారు. అలాగే మే నెలలో డీఎస్పీ దేవేందర్‌ సింగ్‌, ఇద్దరు టీచర్లు బషీర్‌ షేక్‌, గులామ్‌ గనీలను డిస్మిస్‌ చేశారు. హిజ్బుల్‌ముజాహిదీన్‌ టెర్రరిస్టులకుసహకరించారని అరెస్టుచేశారు. అలాగే లష్కర్‌ తయ్యాబా టెర్రరిస్టులకు సహకరించినట్టుగా ఆరోపిస్తూ 11మంది ప్రభుత్వ ఉద్యోగులను జులై 11న తొలగించారు. అలాగే అనంతనాగ్‌కు చెందిన ఇద్దరు టీచర్లను కూడా డిస్మిస్‌ చేశారు. ఒక్క జులైలోనే 18 మందిని డిస్మిస్‌ చేశారు. సెప్టెంబరు 16న జారీ చేసిన ఉత్తర్వు కింద ఒక పోలీసు, ఇద్దరు టీచర్లతో సహా ఆరుగురిని డిస్మిస్‌ చేశారు. దాదాపు వీరందరూ టెర్రరిస్టులకు సహకరించారన్న ఆరోపణలపైనే డిస్మిస్‌ చేశారు. డిస్మిస్‌ చేసిన ఉద్యోగులపై పెట్టిన కేసులు అత్యంత తీవ్రమైనవి. సహకరించినట్టుగా ఎలాంటి సాక్ష్యా ధారాలను ఇంతవరకు బయట పెట్టలేదు. మీడియా వార్తలను ఆధారం చేసుకుని చర్యలు తీసుకొంటున్నారు.
2002`14 మధ్య శాంతిని నెలకొల్పేందుకు తీసుకున్న చర్యలన్నింటిని 2020 నుండి ప్రస్తుత కేంద్రప్రభుత్వ పాలకులు వమ్ము చేశారు. సైన్యం ఇప్పటికీ గాలింపు కార్యకలాపాలను సాగిస్తూనే ఉన్నది. 1990లలో లొంగిపోయిన మిలిటెంట్‌లకు పునరావాసం కల్పించాలన్న ప్రయత్నాలను ఇప్పటికీ అమలు చేస్తున్నారు. ఈ విధానాన్ని 2000 సంవత్సరం వరకు ముందుగా పొడిగించారు. శాంతిని నెలకొల్పే చర్యలు కొనసాగుతున్నప్పటికీ భద్రతా ప్రయోజ నాలను దృష్టిలో పెట్టుకొని అరెస్టులు, ఉద్యోగాల తొలగింపు కొనసాగిస్తామని చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img