Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

గ్రామ స్థాయిలో రైతు ఉద్యమించాలి

రావుల వెంకయ్య

ఈ ఉద్యమ ఫలితంగా 7 రాష్ట్రాలు రైతు వ్యతిరేక నల్లచట్టాలను అమలు జరపబోమని అసెంబ్లీల్లో తీర్మానం చేశాయి. ఇటీవల అధికారంలోకి వచ్చిన తమిళనాడు కూడా ఆ బాటలోనే ప్రయాణం చేసింది. రైతులకు మద్దతు ధరలను చట్టబద్ధ హక్కుగా కల్పించాలనే డిమాండుకు మద్దతుగా కేరళ, బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వాలు స్వామినాథన్‌ సిఫార్సుల అమలులో భాగంగా సి2G50 అమలు చేస్తామని శాసనసభల్లో తీర్మానం చేయడం విశేషం. మిగిలిన రాష్ట్రాలు కూడా ఆ బాటలో ప్రయాణం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

భారతదేశంలో జరుగుతున్న రైతు ఉద్యమం సంవత్సరకాలం పూర్తి చేసుకో బోతున్నది. గ్రామ గ్రామాన ఉద్యమాన్ని ఉధృతం చేసి విజయం సాధించాలి. 2020 నవంబరు26న ప్రారంభమైనరైతు ఉద్యమం 2021 నవంబరు 26కు సంవత్సరం నిండు తుంది. ఈఉద్యమంలో రైతుపంటలకు మార్కె టింగ్‌కు చట్టం, వ్యవసాయఉత్పత్తుల పంపిణీల ఒప్పందచట్టం, నిత్యావసరాల సరుకులసరఫరాచట్టం, విద్యుత్‌ సంస్కరణల చట్టం, రద్దు చేయాలని రైతుకు మద్దతు ధర చట్టబద్ధ హక్కుగా కావా లన్నది డిమాండ్లు `నాలుగుచట్టాలు కూడా రైతులపాలిటి ఉరితాళ్ళుగా మారాయి. అందుకోసం రైతులు మొదట పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌ రాష్ట్రాల్లోని సింఘూ సరిహద్దు టిక్రీ, షహజాన్‌పూర్‌లలో మూడు శిబిరాలు ఏర్పాటు చేశారు. రైతులు అక్కడే తాత్కాలిక నివాసాలు ఏర్పాటుచేసుకొని ఉద్యమాన్ని కొనసాగించారు. వేలాది మంది రైతులు దానిలో క్రియాశీలంగా పాల్గొన్నారు. తరువాత దేశవ్యాప్తంగా 500కు పైగా రైతుసంఘాలు అఖిల భారత రైతుసంఘాల పోరాట సమన్వయ సమితిగా ఏర్పడి మద్దతు తెలిపారు. పంజాబ్‌, హర్యానాలో 40కి పైగా రైతుసంఘాలు సంయుక్త కిసాన్‌ మోర్చాగా ఏర్పడి క్రియాశీలంగా ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు.
జనవరి 26న ఢల్లీిలో జరిగిన ప్రదర్శనలో కొన్ని అపశ్రుతులు దొర్లాయి. ఒక వ్యక్తి ఎర్రకోటపై ఖలిస్థాన్‌ జెండాను ఎగరవేశాడు. దానినిరైతు ఉద్యమ కారులకు అంటగట్టి పోరాటాన్ని అణచివేయటానికి టెర్రరిస్టు ముద్ర వేశారు. అనంతరం విచారణ జరపగా ఆ జెండాను పాతిన వ్యక్తి బిజెపికి అనుకూల వ్యక్తి అని నరేంద్ర మోదీతో కలిసి సన్నిహితంగా తిరిగినవాడని తేలింది. ఆ సందర్భంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కిసాన్‌ యూనియన్‌ నాయకులు రాకేష్‌ తికైయిత్‌ ఈ ఘటనతో మనసు కలతచెంది నన్ను కాల్చండని కంటనీరు పెట్టడంతో ఉత్తరప్రదేశ్‌ ప్రజలు, రైతులు వేలాదిగా కదలి వచ్చి అండగా నిలిచారు. అణిగిపోతుందనుకున్న ఉద్యమం తిరిగి తారాస్థాయికి లేచింది. లక్షలాది మంది రైతులు తరలివచ్చారు. అంతకుముందు నామమాత్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో ఆ రాష్ట్ర సరిహద్దు ఘాజీపూర్‌లో మరో ఉద్యమ శిబిరం వెలిసింది. నాలుగు రాష్ట్రాలకు పరిమితమైన ఉద్యమం తదుపరి దశలో 23 రాష్ట్రాలకు విస్తరించి ఒకటికి మూడుసార్లు భారత్‌బంద్‌ను జయప్రదంగా నిర్వహించడం జరిగింది. చివరకు ఆంధ్రప్రదేశ్‌ లాంటి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బంద్‌కు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిరది.
కేంద్ర ప్రభుత్వం 11 సార్లు రైతుసంఘాలతో చర్చలు జరిపినప్పటికి అవి ఏమాత్రం ఫలపద్రం కాలేదు. సుప్రీంకోర్టు సైతం 2 సంవత్సరాలు ఈ చట్టాల అమలును నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీచేసి నలుగురు నిపుణులతో అధ్యయన కమిటీని వేశారు. అందులో ఇద్దరు కమిటీలో ఉండటానికి నిరాకరించి వైదొలిగారు. మిగిలిన ఇద్దరు కూడా ఈ చట్టాలకు అనుకూలం. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో లఖీంపూర్‌లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతు ఉద్యమకారులపై సాక్షాత్తు కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి కుమారుడు ఆశీష్‌ మిశ్రా కారుతో తొక్కించి, నలుగురు ఉద్యమ కారులను, ఒక జర్నలిస్టు మృతికి కారణమైనాడు. ఈ ఘటనకు బాధ్యత వహించి హోంశాఖా సహాయ మంత్రి అజయ్‌మిశ్రా రాజీనామా చేయటం కానీ, ప్రధానమంత్రి ఆయనను బర్తరఫ్‌ చేయడంగానీ ఇప్పటివరకు జరగలేదు. ఘటనకు బాధ్యుడైన ఆశీష్‌ మిశ్రాను తూతూ మంత్రంగా ఆరెస్టు చేసి డెంగ్యూ జ్వరం పేరుతో హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వచ్చాయి. అమరులైన నలుగురి చితాభస్మాన్ని దేశంలోని ప్రధాన నదులలో నిమజ్జనం చేయడం జరిగింది. మన రాష్ట్రంలో కూడా 7 పవిత్ర నదులలో నిమజ్జనం చేసి శ్రద్ధాంజలి ఘటించారు. నరేంద్ర మోదీకి ఆయువుపట్టులాంటి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంపై ఈ ఘటన తీవ్రమైన ప్రభావం కలిగించింది. రాబోయే ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించక తప్పదని అభిజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఉద్యమంలో ఈ సంవత్సర కాలంలో 650 మందికిపైగా రైతులు అశువులు అర్పించారు. ఈ శిబిరాల్లో చనిపోయినవ్యక్తి శవం ఇంటికివెళ్ళింది కానీ ఆ శవానికి సంబంధించిన వారెవరూ ఉద్యమం నుంచి వెనుతిరిగి గ్రామాలకు వెళ్ళలేదు. ఇలాంటి ఉద్యమం సంవత్సరకాలమే కాదు రెండు సంవత్సరాలైనా కొనసాగిస్తా మని దృఢదీక్షను వ్యక్తం చేస్తున్నారు. ఇంతమంది చనిపోయినప్పటికీ ప్రధానమంత్రి స్థాయిలో నరేంద్ర మోదీ కనీసం సంతాపమైనా వ్యక్తం చేయలేదు.
ఈ ఉద్యమ ఫలితంగా 7 రాష్ట్రాలు రైతు వ్యతిరేక నల్లచట్టాలను అమలు జరపబోమని అసెంబ్లీల్లో తీర్మానం చేశాయి. ఇటీవల అధికారంలోకి వచ్చిన తమిళనాడు కూడా ఆ బాటలోనే ప్రయాణం చేసింది. రైతులకు మద్దతు ధరలను చట్టబద్ధ హక్కుగా కల్పించాలనే డిమాండుకు మద్దతుగా కేరళ, బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వాలు స్వామినాథన్‌ సిఫార్సుల అమలులో భాగంగా సి2G50 అమలు చేస్తామని శాసనసభల్లో తీర్మానం చేయడం విశేషం. మిగిలిన రాష్ట్రాలు కూడా ఆ బాటలో ప్రయాణం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
ఈ ఉద్యమం ఊపందుకున్న ఫలితంగా దేశవ్యాప్తంగా బిజెపి ప్రభుత్వంలో ప్రకంపనలు తలెత్తాయి. ఇప్పటికే అకాలీదళ్‌ మంత్రి వర్గం నుండి ఉపసంహరించుకొని ఈ రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించింది. అలాగే లఖీంపూర్‌ విషాద ఘటన బిజెపి పార్లమెంటు సభ్యులు వరణ్‌ గాంధీ, మేనకా గాంధీలు తీవ్రంగా ఖండిరచి రైతులకు అండగా నిలబడ్డారు. మేఘాలయ గవర్నర్‌ కూడా రైతులతో చర్చలు జరపటానికి ఈ చట్టాలను ఉపసంహరించు కోవాలని బహిరంగంగా ప్రకటించారు. అలాగే వివిధ పార్టీలు బిజెపీతో భవిష్యత్‌లో ఎన్నికల ఒప్పందాలు చేసుకోవడానికి రైతు వ్యతిరేక చట్టాల రద్దును ఒక షరతుగా విధిస్తున్నాయి. ఆఖరికి బిజెపికి గుండెకాయలాంటి రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు (ఆర్‌.ఎస్‌.ఎస్‌) అనుబంధంగా ఉన్న భారతీయ కిసాన్‌సభ కూడా ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు ఉద్యమానికి మద్దతు తెలపడం విశేషం. ఒక్కమాటలో చెప్పాలంటే బిజెపి ప్రభుత్వంలో అంతర్మథనం మొదలైంది. కనుక ఈ చారిత్రాత్మక రైతు ఉద్యమం కొనసాగించి రైతు వ్యతిరేక నల్లచట్టాలను రద్దు చేయించుకోవడం, లేదంటే నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు రైతు పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. దీనికోసం రైతులందరూ గ్రామ, గ్రామాన రైతు ఉద్యమాన్ని విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
వ్యాసరచయిత ఎఐకెఎస్‌ ఉపాధ్యక్షుడు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img