Friday, April 26, 2024
Friday, April 26, 2024

అచ్ఛేదిన్‌ ఎక్కడా?

సయ్యద్‌ నిసార్‌ అహ్మద్‌

2016 మే నెలలో 94 కోట్లమంది పని చేయగల యువశక్తిలో కేవలం 46 కోట్ల మందికి మాత్రమే ఉపాధి ఉంది. మిగిలిన 48 కోట్ల మంది ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు లేదా పని చేయకుండా ఖాళీగా ఉన్నారు. 105 కోట్ల మందిలో 42 కోట్ల మందికి మాత్రమే ఉపాధి లభించింది. మిగతా 63 కోట్లమంది ఉద్యోగ వేటలో ఉన్నారు. సిఎంఐఈ లెక్కల ప్రకారం ప్రతి నలుగురిలో ఒకరు నిరుద్యోగిగా ఉన్నారు. ఇదేదో కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితి కాదు. కరోనా అన్ని దేశాలతో పాటు భారతదేశంలోనూ ఉపాధి అవకాశాలను బాగా దెబ్బ తీసిందన్నది వాస్తవమే కానీ పైన చెప్పిన నిరుద్యోగితకు కరోనా వల్ల మూతపడ్డ పరిశ్రమలకు ఏ మాత్రం సంబంధం లేదని గ్రహించాలి.

ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో కష్టించే స్వభావమున్న కార్మికశక్తి 61 శాతం ఉంది. ఆ శక్తి మన భారతదేశానికి 64 శాతం ఉంది. ఇదే మన దేశం ఎదిగేందుకు మార్గం సుగమం చేస్తుందన్నది ఆర్థిక నిపుణుల అభిప్రాయం. మరి వీరందరికీ కాదు…కనీసం సగం మందికైనా ప్రభుత్వం పని కల్పిస్తోందా? తద్వారా ఈ దేశం ఎదిగేందుకు అవకాశం కల్పిస్తోందా? ఇక్కడ పెరుగుతున్నది ఉపాధి అవకాశాలు కాదు నిరుద్యోగం. మనదేశంలో 15 సంవత్సరాలు పైబడినవారు 105 కోట్ల మంది ఉన్నారు. దేశంలోని 100 శాతం పట్టభద్రుల్లో 60 శాతం పని చేయటానికి సిద్ధంగానున్నారు. వీరిలో 26 శాతం మందికి పనిలేదు. మన పట్టభద్రుల్లో 20-24 ఏళ్లు మధ్యనున్న వారిలో 46 శాతం మంది, 25-29 వయసు యువతలో 15 శాతం, 30-34 మధ్య వయస్సున్న వారిలో 6 శాతం, 45-64 వయస్సున్న వారిలో 2 శాతం మంది నిరుద్యోగులే.
2014 సార్వత్రిక ఎన్నికల్లో అచ్ఛేదిన్‌ నినాదం ఎత్తుకొన్న మోదీ తాము అధికారంలోకి వస్తే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇది అణు మాత్రం కూడా అమలు కాలేదు. జనాభా విస్ఫోటనంతో మన దేశంలో 2018 నుంచి పని చేయగల యువశక్తి పెరి గింది. వీరికి పాలకులు పని కల్పించలేకపోయారు. ప్రస్తుతం ప్రపంచంలోనే పనిచేయగలయువశక్తి భారతదేశంలో మెండుగావుంది. వీరిని తగినస్థాయిలో ఉపయోగించుకోవడం లేదు. జపాన్‌, చైనా, దక్షిణ కొరియా, సింగపూర్‌ దేశాలు తమదేశంలో పనిచేయడానికి సిద్ధంగానున్న యువశక్తికి వారిసంఖ్యకు అనుగుణంగా ఉన్నత ఉద్యోగఅవకాశాలు కల్పించాయి. నవతరానికి మంచి పౌష్ఠిక ఆహారం, నైపుణ్యాలతో కూడిన విద్యతో పాటు సమాన అవకాశాలు కల్పించాయి. వారికి ఉపాధి కల్పన కోసం పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం ఏర్పాటుచేసాయి, మౌలిక సదుపాయాలు కల్పించాయి. అందుకే ఈ రోజు ఆ దేశాలు ప్రపంచమార్కెట్‌లను శాసిస్తున్నాయన్నది కాదనలేని వాస్తవం. మనదేశంలో ఇలాంటి చర్యలేవీలేవు. ఆ దిశగా అడుగులూ లేవు.
బీజేపీ సుస్థిర పాలనతోనే దేశాభివృద్ది సాధ్యమని, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఢంకా కొట్టి మరీ ఎన్నికల ప్రచారం చేశారు. కానీ ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక కనిపిస్తున్నదేమిటీ? గత ప్రభుత్వాలలో ఉపాధి అవ కాశాలు అమాంతంగా పెరగకపోయినా గుడ్డిలో మెల్ల అన్నట్లుగా పురోగతి ఉండేది. బీజేపీ ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు మరింత దిగజారాయి. అచ్ఛే దిన్‌, సబ్‌ క సాథ్‌ సబ్‌ కా వికాస్‌, స్టార్టప్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా లాంటి నినాదాలు నినాదాలకే పరిమితమయ్యాయి. అనేక కార్యక్రమాలకు కొత్త పేర్లు తీసుకొచ్చి వాటి స్వరూపాన్ని మార్చిన బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఒరగ బెట్టిందేమీ లేదు. మోదీ పాలనలో విద్యా, ఉపాధి, దేశ పురోగతి ఎక్కడా కాన రావడం లేదు. పైపెచ్చు మతంపై చర్చ పెట్టి మతోన్మాదాన్ని ఎగదోస్తోంది.
ప్రణాళికా సంఘాన్ని నీతి ఆయోగ్‌గా మార్చి, జీఎస్టీ చట్టాలను తీసుకొచ్చిన మోదీ ప్రభుత్వం భారతదేశాన్ని 5 ట్రిలియన్‌ ఎకానమీగా తీర్చిదిద్దుతామని పేర్కొంది. వాస్తవ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. దేశంలో నిరుద్యోగం, దాని ప్రభావం ఎలా ఉందో భారత ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణా కేంద్రం గత 5 సంవత్సరాల అధ్యయనం వెల్లడిస్తోంది. 2016 మే నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు డేటాను పరిశీలిస్తే ఆశ్చర్యానికి గురిచేసే అంశాలు ఎన్నో కనిపిస్తాయి. 2016 మే నెలలో 94 కోట్ల మంది పని చేయగల యువశక్తి దేశంలో ఉంటే తరవాత ఐదేళ్ళల్లో అంటే ఈ ఫిబ్రవరి నాటికి అది 105 కోట్లకు చేరింది. అంటే 11 కోట్లు పెరిగింది. ఇక ఉపాధి వాస్తవ పరిస్థితిని చూస్తే 2016 మే నెలలో 94 కోట్లమంది పని చేయగల యువశక్తిలో కేవలం 46 కోట్ల మందికి మాత్రమే ఉపాధి ఉంది. మిగిలిన 48 కోట్ల మంది ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు లేదా పని చేయకుండా ఖాళీగా ఉన్నారు. 105 కోట్ల మందిలో 42 కోట్ల మందికి మాత్రమే ఉపాధి లభించింది. మిగతా 63 కోట్లమంది ఉద్యోగ వేటలో ఉన్నారు. సిఎంఐఈ లెక్కల ప్రకారం ప్రతి నలుగురిలో ఒకరు నిరుద్యోగిగా ఉన్నారు. ఇదేదో కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితి కాదు. కరోనా అన్ని దేశాలతో పాటు భారతదేశంలోనూ ఉపాధి అవకాశాలను బాగా దెబ్బ తీసిందన్నది వాస్తవమే కానీ పైన చెప్పిన నిరుద్యోగితకు కరోనా వల్ల మూతపడ్డ పరిశ్రమలకు ఏ మాత్రం సంబంధం లేదని గ్రహించాలి.
2030కి మరిన్ని ఉద్యోగాలకు ఎసరు?
వేగంగా పెరుగుతున్న సాంకేతికత, యాంత్రీకరణ కారణంగా 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 800 మిలియన్‌ ఉద్యోగాలకు ఎసురు వస్తుంద న్నది ఆర్థిక నిపుణుల అంచనా. కృత్రిమ మేథస్సు, డేటా సైంటిస్‌, బ్లాక్‌ చైన్‌, క్లౌడ్‌ కంప్యూటరింగ్‌, త్రీడి ప్రింటింగ్‌ టెక్నాలజీతో కొత్త తరహా ఉద్యోగాలు కల్పించినా అప్పటి జనాభాకు కొత్తగా పుట్టుకొచ్చిన ఉపాధి అవకాశాలూ సరిపోవు. విద్యా వ్యవస్థ, నైపుణ్యాల కొరత మనదేశంలో నిరుద్యోగానికి ప్రధాన కారణాలు. ప్రస్తుతం మన దేశంలో వృత్తి విద్యా కోర్సులో నైపుణ్యత ఎంత అన్నది అందరికీ తెలిసిందే. విద్యా వ్యవస్థలో మార్పులు చేసి నైపుణ్య విద్యకు బాటలు వేయాల్సిన తరుణంలో విద్యా కాషాయీకరణకు పూను కోవడం అంత్యంత ప్రమాదకరమైన విషయం. ఉద్యోగ అవకాశాలు మెండుగా కల్పించే ఇంజనీరింగ్‌ విద్యా వ్యవస్థలో నైపుణ్య విద్య లేక ఉపాధి అవకాశాలు లేకుండా పోతున్నాయన్నది కాదన లేని వాస్తవం. 2003 జాతీయ ఉపాధి కల్పన నివేదికతో పాటు యూవీ రావు నివేదిక ప్రకారం వృత్తి విద్యను అభ్యసించిన వారిలో 90 శాతం విద్యార్థులకు సరైన నైపుణ్యాలు లేవు. దీనికి కారణం పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఇంజీనీరింగ్‌ కళాశాలలే. నైపుణ్యమైన విద్య కచ్చితంగా అమలయ్యేలా చట్ట సవరణలు తీసుకురావాలి. తెలుగు రాష్ట్రాల్లో ఫీజు రియింబర్స్‌మెంట్‌ వల్ల లక్షల్లో ఇంజీనీర్లు తయారయ్యారు. ఇక మెడికల్‌ కాలేజీ మాఫియా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఒకొక్క ఎన్‌ఆర్‌ఐ సీటుకు రూ.2 కోట్లు డిమాండ్‌ చేస్తున్నారు. మెడికల్‌ కాలేజీలన్నీ మనీ కాలేజీలుగా మారిపోయాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 57 శాతం వైద్యుల దగ్గర సరైన వైద్య అనుభవం లేదు. ప్రతి 1700 మందికి ఒక డాక్టర్‌ మాత్రం ఉన్నాడు. మెడికల్‌ కౌన్సిల్‌ అఫ్‌ ఇండియా లెక్కల ప్రకారం 10 లక్షల డాక్టర్లు నమోదు చేసుకుంటే వారిలో కేవలం లక్ష మంది మాత్రమే మెడికల్‌ ప్రాక్టీస్‌ చేయటానికి అర్హత సాధిస్తున్నారు. ఇక దేశంలోని ఐదు వేల మానేజ్మెంట్‌ కాలేజీల నుంచి 2 లక్షల ఎంబిఏ విద్యార్థులు ఉద్యోగ వేటలో ఉన్నారు. అసోచామ్‌ నివేదిక ప్రకారం 7 శాతం మాత్రమే ఉద్యోగా లకు అర్హత కలిగి వున్నారు. ప్రపంచంలో నిరుద్యోగం పెరగటానికి యాంత్రీ కరణ కూడా కారణమే. కానీ, టెక్నాలజీ మార్పులను అంగీకరించక తప్పని పరిస్థితి. కాకపోతే ప్రభుత్వం చేతిలో ఉండాల్సిన పరిశ్రమలు, ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేటుపరం చేయడం తీవ్ర ఆందోళనకరం. దీనివల్ల భవిష్యత్‌ ఆగమ్య గోచరమే. ప్రభుత్వం చేతిలో ఉంటే ఏ పరిశ్రమ అయినా ప్రజా ప్రయో జనంతో ముందుకు సాగుతుంది. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళితే లాభార్జనే ధ్యేయమవుతుంది. దీని పర్యవసానం ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మరి మోదీజీ అచ్ఛేదిన్‌ ఏ విషయంలో తీసుకొచ్చారు? కాస్త సెలవిస్తారా!
వ్యాస రచయిత సీనియర్‌ జర్నలిస్ట్‌, 7801019343

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img