Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

టెలిగ్రాఫ్‌ కోడ్‌ కనుగొన్న ఆర్‌.సి.బోస్‌

డాక్టర్‌ దేవరాజు మహారాజు

ఆర్‌.సి.బోస్‌ను ముఖ్యంగా గుర్తు చేసుకోవల్సింది ఎందుకంటే అంతదాకా టెలి కమ్యూనికేషన్‌ రంగంలో వాడుకలో ఉన్న మోర్స్‌ కోడ్‌ను మార్చినందుకు! ‘డాష్‌ అండ్‌ డాట్స్‌’గా ప్రసిద్ధమైన ఆ పద్ధతిలో టకటకమని శబ్దాలు వినిపిస్తూ ఉండేవి. ఆ చప్పుడు వల్ల కొన్ని తప్పులు దొర్లే అవకాశముందని బోస్‌ మరో కోడ్‌ను సృష్టిం చారు. అది తన పరిశోధక విద్యార్థితో కలిసి చేసినందువల్ల ‘బోస్‌రాయ్‌చౌదరీ’ కోడ్‌గా గుర్తింపు పొందింది. పరిశోధనలు జరిగేది తన నేతృత్వంలోనైనా, తన విద్యా ర్థులకు ఎప్పుడూ ఆయన అన్యాయం జరగనిచ్చేవారు కాదు. పరిశోధన ఫలితాన్ని వారి పేరుతోనే ప్రచురించేవారు. పరిశోధక విద్యార్థులతో పని చేయింది, ఫలితాలు సిద్ధం కాగానే తమ పేరుతో అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురించుకునే కొందరు ప్రొఫెసర్లు ఈ రోజు యూనివర్సిటీల్లో కనబడుతున్నారు. మోర్స్‌ కోడ్‌ను మార్చిన తర్వాత అది బిసిహెచ్‌ కోడ్స్‌గా ప్రాచుర్యంలోకి వచ్చింది. బోస్‌`చౌదరీ పేర్లే సంక్షి ప్తంగా బిసిహెచ్‌ అయ్యింది. డిజైన్‌ థియరీ, ఫినైట్‌ జామెట్రీ, స్ట్రాంగ్లీ రెగ్యులర్‌ గ్రాఫ్స్‌, పార్సియల్‌ జియో మాట్రిక్స్‌ వంటి విషయాలలో ఆర్‌.సి.బోస్‌ కృషి ఎంతో ఉంది.

రాజ్‌ చంద్ర బోస్‌ అంటే అందరికీ తెలియక పోవచ్చు గానీ, అది ప్రముఖ గణిత శాస్త్రవేత్త ఆర్‌.సి. బోస్‌ పూర్తి పేరు. ఆయన 1901లో జూన్‌ 19న మధ్యప్రదేశ్‌లోని హోసంగాబాద్‌లో పుట్టారు. రోప్‌ా టెక్‌లో పెరిగి పెద్దవారయ్యారు. అక్కడ ఆయన తండ్రి మెడికల్‌ ప్రాక్టీషనర్‌. ఇంటికి పెద్ద కొడుకు కాబట్టి తల్లిదండ్రుల ఆశలన్నీ బోస్‌ మీదే ఉండేవి. క్లాసులో ఎప్పుడూ మొదటివాడుగా ఉండాలని వారు కోరుకునే వారు. వారు ఆశించినట్టుగానే బోస్‌ ఆ స్థానాన్ని అలాగే నిలబెట్టుకుంటూ ఉండేవాడు. కాని, ఒకసారి మాత్రం పొర పాటున భూగోళ శాస్త్ర పరీక్షలో బోస్‌ రెండవ వాడయ్యాడు. తండ్రి కోపంతో భూగోళ పాఠ్య గ్రంథాన్ని మొత్తానికి మొత్తంగా కంఠస్థం చెయ్యమని ఆజ్ఞా పించాడు. బోస్‌ అధైర్య పడలేదు. 200 పేజీల పాఠ్య పుస్తకాన్ని కంఠస్థం చేసి అప్పజెప్పాడు. ఆనాటి పెద్దల కోపం అలా ఉండేది. పిల్లలు దానికి తగిన విధంగా అలా జవాబు చెప్పేవారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. కాలిక్యులేటర్ల, కంప్యూటర్ల యుగంలో మెదడులో ఏదీ నిలువ ఉంచుకోవాల్సిన పని లేకుండా అయ్యింది. తండ్రి ఏదో చివాట్లేశాడని ఆత్మహత్యలకు పాల్పడే ఈ కాలపు పిల్లలు ఇలాంటి స్ఫూర్తిదాతల జీవిత విశేషాలు తెలుసుకోవాలి. తమ సంస్థలు ఇలాంటి విద్యార్థుల్ని తయారు చేస్తున్నాయా? అని నేటి కార్పోరేట్‌ విద్యా సంస్థలు ఆత్మ విమర్శ చేసుకోవాలి.
ఆర్‌.సి.బోస్‌ బాల్యం అతి భయంకరంగా గడిచింది. అయినా అన్నింటినీ ఎదుర్కొని పైకి రాగలిగాడు. పట్టుదల, కార్యదీక్ష ఉంటే ఎంతటి ఉన్నత శిఖరాలకైనా చేరుకోవచ్చని ఈయన జీవితం చెపుతుంది. బోస్‌ పదిహేడవ యేట తల్లి ఒక అంటువ్యాధితో మరణించింది. ఆ లోటు అలా కనబడుతూ ఉండగానే రెండేళ్ళ వ్యవధిలో తండ్రి చనిపోయాడు. పందొమ్మిదవ యేట బి.ఎ. పరీక్షలకు ముందు కుటుంబ భారమంతా ఆయన మీద పడిరది. వెనకా, ముందూ ఆస్థి పాస్తులున్న కుటుంబం కాదు. పైగా ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెండ్లు ఉన్నారు. వారిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. చదువు పూర్తి కాలేదు. ఉద్యోగం లేదు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆదుకోవడానికి ఎవరూ లేరు. బోస్‌ మనోధైర్యమే సంయమనంతో ముందుకు నడిపించింది. అవి పరీక్షల రోజులు. రాత్రింబవళ్ళు కష్టపడి చదువుతున్నాడు బోస్‌. ఆ పూటకు కూడా ఏమీ లేదని చెల్లెలు చెప్పింది. ఉన్నఫళాన పరిష్కారం కనుక్కోవడం కష్టంగా తోచినా ఆలోచించాడు. తండ్రి అలమారాలో మిగిలిపోయిన మందులు కనిపించాయి. అవి అమ్మి సరుకులు తెచ్చాడు. తండ్రి అర్థాంతరంగా చనిపోవడంతో ఆయన వస్తువులు, మందులు ఇంట్లో అలాగే ఉన్నాయి. తాత్కాలికంగా సమస్యను పరిష్కరించుకుని, తన డిగ్రీ పరీక్షలు సజావుగా రాసుకోగలిగాడు బోస్‌.
బాల్యంలో ఆర్‌.సి.బోస్‌కు గణితం ఇష్టమైన విషయం. ఆ ఇష్టం అలా పెరిగి, పెరిగి గణిత శాస్త్రంలో ఎం.ఎ. పట్టా పుచ్చుకునే దాకా వెళ్ళింది. 1925లో ప్యూర్‌ మేథమేటిక్స్‌తో దేశంలో కోర్సుల్లేవు. దిల్లీలోని హిందూ కాలేజీలో అప్లయిడ్‌ మాథమేటిక్స్‌తో మాస్టర్స్‌ డిగ్రీ తీసుకుని, బోస్‌ కలకత్తా వెళ్ళాడు. అక్కడ ఆనాటి మేటి గణిత శాస్త్రవేత్త శ్యామాదాస్‌ ముఖర్జీ ఉండేవారు. ఆయన బోస్‌ ప్రతిభను గుర్తించి ఉండడానికి వసతి కల్పించాడు. తన వ్యక్తిగత గ్రంథాలయం ఉపయోగించుకోనిచ్చారు. ఫలితంగా బోస్‌ రెండేళ్ళలో ప్యూర్‌ మేథమేటిక్స్‌తో మరో యం.ఎ. సాధించారు. ఆ దశలో శ్యామాదాస్‌ చేసిన సహాయం, ఇచ్చిన స్ఫూర్తి చాలా గొప్పవి. అయితే బోస్‌కు ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ‘డబుల్‌ యం.ఎ. మేమేం చేసుకోమని తిప్పి పంపేవారు. అత్యధిక విద్యార్హత కూడా ఒక్కోసారి నిరుద్యోగానికి దారి తీస్తుంది. ఇలాంటి సమస్యలు ఈ కాలంలోనే కాదు, 1930లలోనే ఉన్నాయన్నమాట!
సరైన ఉద్యోగం లేక ట్యూషన్లు చెబుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్న బోస్‌, జీవితంతో రాజీపడి కుప్పగూలిపోలేదు. తన విజ్ఞాన దాహాన్ని మరిచి పోలేదు. రేఖా గణితంలో పరిశోధనలు ప్రారంభించాడు. ఆ పరిశోధనలు ఆనాటి ప్రఖ్యాత గణాంక శాస్త్రవేత్త పి.సి.మహలనోబిస్‌ దృష్టికి వెళ్ళాయి. దాంతో బోస్‌ దశ తిరిగింది. అది 1932వ సంవత్సరం. ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇనిస్టిట్యూట్‌లో రేఖా గణిత శాస్త్రజ్ఞుడి కోసం మహలనోబిస్‌ అన్వేషిస్తున్న సమయం. ఆర్‌.సి.బోస్‌ గురించి తెలుసుకున్న మహలనోబిస్‌ తన సంస్థకు సరైన వ్యక్తి లభించాడని సంతోషించాడు. కాని బోస్‌ ఆ సంస్థలో చేరడానికి ఇష్టపడలేదు. తనకు గణాంక శాస్త్రంలో ప్రవేశం లేకుండా ఆ సంస్థలో ఉద్యోగం చేయడం సిగ్గుగా ఉంటుందని అన్నాడు. కాని, మహలనోబిస్‌ చొరవ తీసుకుని, బోస్‌కు ఆత్మస్థైర్యాన్నిచ్చి ఆయనకు అన్నీ నేర్పే బాధ్యతను తనే స్వీకరించి, ఇనిస్టిట్యూట్‌లో చేర్చుకున్నాడు. ఆ అవకాశాన్ని ఆసరాగా తీసుకుని బోస్‌, అనతికాలంలోనే స్టాటిస్టిక్స్‌లో మంచి పట్టు సాధించాడు. ఆ తర్వాత సంస్థ పురోభివృద్ధికి శాయశక్తులా కృషి చేశాడు.
1949లో అమెరికాలోని నార్త్‌ కరోలినా యూనివర్సిటీ బోస్‌ను ఆచార్యుడిగా ఆహ్వానించింది. తన పూర్తి కాలాన్ని గణిత శాస్త్ర అధ్యయనానికి, బోధనకు కేటాయించొచ్చునన్న అభిరుచితో బోస్‌ అక్కడికి వెళ్ళారు. డబ్బుకు ఆశపడి స్వదేశం వదిలి వెళ్ళలేదు. ఇప్పుడు వెళుతున్నవారిలో ఎక్కువమంది ఎందుకు వెళుతున్నారో ఆలోచిస్తే తెలుస్తుంది. కొంతకాలం తర్వాత బోస్‌ కొలరాడో విశ్వ విద్యాలయానికి మారారు. అక్కడ మేథమేటిక్స్‌ ప్రొఫెసర్‌గా పని చేశారు. నిరంతర అధ్యయనం, బోధన వల్ల ఆయన వైజ్ఞానిక ప్రపంచానికి కొత్త విషయాలెన్నో అందించారు. పద్దెనిమిదవ శతాబ్దపు స్విస్‌ గణిత శాస్త్రవేత్త లియొనార్డ్‌ య్యూలర్‌ సిద్ధాంతం తప్పు అని నిరూపించి, అంతర్జాతీయ గుర్తింపును పొందారు.
ఆర్‌.సి.బోస్‌ను ముఖ్యంగా గుర్తు చేసుకోవల్సింది ఎందుకంటే అంతదాకా టెలి కమ్యూనికేషన్‌ రంగంలో వాడుకలో ఉన్న మోర్స్‌ కోడ్‌ను మార్చినందుకు! ‘డాష్‌ అండ్‌ డాట్స్‌’గా ప్రసిద్ధమైన ఆ పద్ధతిలో టకటకమని శబ్దాలు వినిపిస్తూ ఉండేవి. ఆ చప్పుడు వల్ల కొన్ని తప్పులు దొర్లే అవకాశముందని బోస్‌ మరో కోడ్‌ను సృష్టించారు. అది తన పరిశోధక విద్యార్థితో కలిసి చేసినందువల్ల ‘బోస్‌ రాయ్‌చౌదరీ’ కోడ్‌గా గుర్తింపు పొందింది. పరిశోధనలు జరిగేది తన నేతృత్వంలో నైనా, తన విద్యార్థులకు ఎప్పుడూ ఆయన అన్యాయం జరగనిచ్చేవారు కాదు. పరిశోధన ఫలితాన్ని వారి పేరుతోనే ప్రచురించేవారు. పరిశోధక విద్యార్థులతో పని చేయింది, ఫలితాలు సిద్ధం కాగానే తమ పేరుతో అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురించుకునే కొందరు ప్రొఫెసర్లు ఈ రోజు యూనివర్సిటీల్లో కనబడుతున్నారు. మోర్స్‌ కోడ్‌ను మార్చిన తర్వాత అది బిసిహెచ్‌ కోడ్స్‌గా ప్రాచుర్యంలోకి వచ్చింది. బోస్‌చౌదరీ పేర్లే సంక్షిప్తంగా బిసిహెచ్‌ అయ్యింది. డిజైన్‌ థియరీ, ఫినైట్‌ జామెట్రీ, స్ట్రాంగ్లీ రెగ్యులర్‌ గ్రాఫ్స్‌, పార్సియల్‌ జియో మాట్రిక్స్‌ వంటి విషయాలలో ఆర్‌.సి.బోస్‌ కృషి ఎంతో ఉంది. వీటన్నిటికీ అంతర్జాతీయ గుర్తింపు లభించింది. కాబట్టే, యు.యస్‌. అకాడెమీ ఆఫ్‌ సైన్సెస్‌కు ‘ఫెలో’గా ఆయన గౌరవం అందుకున్నారు. ఆ రంగంలో ప్రతిష్టాత్మకమైన ఆర్‌.వి.ఫిషర్‌ లెక్చర్‌షిప్‌ లభించింది. ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇనిస్టిట్యూట్‌ వదిలి 1940లో బోస్‌, యూనివర్సిటీ ఆఫ్‌ కలకత్తాలో ప్రొఫెసర్‌గా చేరారు. కొద్ది కాలానికే 1947లో యూనివర్సిటీ ఈయన ప్రతిభకు డి.లిట్‌ ప్రకటించింది. ఇప్పుడు ప్రఖ్యాత శాస్త్రవేత్త అయిన సి.ఆర్‌. రావు అప్పుడు అక్కడ బోస్‌కు విద్యార్థి. ఇక్కడ ఉన్నప్పుడు గానీ, అమెరికా విశ్వవిద్యాలయాల్లో బోధిస్తున్నప్పుడు గానీ బోస్‌ విద్యార్థులెందరో వైజ్ఞానిక రంగంలో స్థిరపడ్డారు. బోస్‌ విద్యార్థులుగా గర్వపడ్డారు. చివరి దశలో కొలరాడో విశ్వవిద్యాలయంలో పనిచేసి, అక్కడే విశ్రాంత జీవనం గడిపిన ఈ భారతీయ` అమెరికన్‌ శాస్త్రవేత్త, తన 86వ యేట 1987లో అక్టోబరు 31న కన్నుమూశారు. నిత్య జీవితంలో మనం టెలిగ్రాఫిక్‌ కోడ్‌లు వాడుతున్నాం. వాటితో లబ్ది పొందుతున్నాం. కానీ, అది మనకందించిన మహనీయుడెవరన్నది ఆలోచించామా? శాస్త్రవేత్తల జీవితాలు వ్యక్తిత్వ వికాసానికి పునాదులు!
వ్యాస రచయిత సుప్రసిద్ధ సాహితీవేత్త, బయాలజీ ప్రొఫెసర్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img