Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

భారత న్యాయ వ్యవస్థలో మార్పులు అవసరమే

విక్రమ్‌ హెగ్డే

నిరంకుశ అధికార యంత్రాంగం మూలాలు భారతదేశ వలస పాలన నాటి సివిల్‌ సర్వీసెస్‌లో ఉన్నాయి. స్వయం పాలన కంటే సామ్రాజ్యవాదుల అధికారానికి ఈ సివిల్‌ సర్వీసులు ఉపయోగపడే విధంగా ఉన్నాయి. వలస పాలన వారసత్వంగా న్యాయ వ్యవస్థ కొనసాగుతున్నది. ఏ ఇతర సంస్థల కంటే న్యాయ వ్యవస్థ దేశ పరిస్థితులకు భిన్నంగా ఉన్నది. అందువల్లే నాటి నుంచి నేటి వరకు ఈ వ్యవస్థ పైన ఫిర్యాదులు, విమర్శలు ఉన్నాయి.

భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా న్యాయవ్యవస్థలో మార్పులు తీసుకు రావలసిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి.రమణ ఇటీవల చెప్పారు. ఆయన అభిప్రాయాన్ని తప్పనిసరిగా ఆహ్వానించవలసిందే. రాజ్యాంగ అసెంబ్లీలో రాజ్యాంగ రూపకల్పనపై చర్చలు 1949 నవంబరు 17 నాటికి దాదాపు పూర్తయ్యాయి. చర్చలలో పాల్గొన్న కె.హనుమంతప్ప, ‘‘మనకు సంగీతంలో వీణ లేదా సితార అవసరం, అయితే మనకు ఇంగ్లీషు బ్యాండ్‌ సంగీతం లభించింది.’’ అని అన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు మన రాజ్యాంగ నిర్మాతల చర్చల సందర్భంగా చేశారు. ఈ వ్యాఖ్య ఎన్నటికీ మరువదగింది కాదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ప్రారంభ కాలంలో ఈ అంశంపై చర్చలు జరిగాయి. దేశంలో రాజకీయ, పరిపాలన, న్యాయ వ్యవస్థలు భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా లేవని ఆనాటి చర్చల సారాంశం.
రాజకీయ, సైద్ధాంతిక రంగాలకు చెందిన అనేక మంది న్యాయ వ్యవస్థపై పైవిధంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలో అనేక కోణాలు ఉన్నాయి. నిరంకుశ అధికార యంత్రాంగం మూలాలు భారతదేశ వలస పాలన నాటి సివిల్‌ సర్వీసెస్‌లో ఉన్నాయి. స్వయం పాలన కంటే సామ్రాజ్యవాదుల అధికారానికి ఈ సివిల్‌ సర్వీసులు ఉపయోగపడే విధంగా ఉన్నాయి. వలస పాలన వారసత్వంగా న్యాయ వ్యవస్థ కొనసాగుతున్నది. ఏ ఇతర సంస్థల కంటే న్యాయ వ్యవస్థ దేశ పరిస్థితులకు భిన్నంగా ఉన్నది. అందువల్లే నాటి నుంచి నేటి వరకు ఈ వ్యవస్థ పైన ఫిర్యాదులు, విమర్శలు ఉన్నాయి. న్యాయ వ్యవస్థలో పనిచేస్తూ సేవలు అందిస్తున్న వారు మాట్లాడే అంశాలు, నిర్వచించే అనేక చట్టాలు వలస పాలనాధీశుల నుండి గ్రహించినవే. ప్రధాన న్యాయమూర్తి రమణ గత వారం రెండు సందర్భాలలో, న్యాయ వ్యవస్థ భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా మార్పు చెందవలసిన అవసరం ఉందని గట్టిగా చెప్పారు. ఈ అంశంపై చాలాకాలంగా జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఆయన చెప్పిన అంశాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవల్సిందే.
న్యాయాన్ని అందించే వ్యవస్థ అవసరమైన మార్పులకు మార్గదర్శిగా ఉండాలి. ఈ విషయంలో ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ గడువును దృష్టిలో ఉంచుకొన్నప్పుడు ఈలోపే మార్పులకు శ్రీకారం చుట్టాలి. పాలనా వ్యవస్థ లేదా న్యాయ వ్యవస్థను భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేయాలని ప్రతిపాదించే వారు సాధారణమైన, సాంప్రదాయబద్దమైన, చారిత్రక నమూనాలను కోరుకుంటున్నారు. వలస పాలన నాటి కంటే ముందున్న ఆలోచనా విధానాలను వీరు కోరుతున్నారు. మరికొందరు బ్రిటీష్‌ కాలం నాటి వ్యవస్థనే సమర్థిస్తున్నారు. మన రాజ్యాంగ నిర్మాతలు వీటిని నిర్ద్వందంగా తిరస్కరించారు. ఆధునిక భారత ప్రజాస్వామ్యం వ్యవస్థలో అసమానతలతో కూడిన ప్రతిపాదనలను గట్టిగా వ్యతిరేకించారు.
ప్రధానంగా ఇంగ్లీషు మాత్రమే మాట్లాడేవారు, ద్వితీయ, తృతీయ ప్రాధాన్య తలుగా మాట్లాడేవాళ్లు దేశంలో 6`10 శాతం ఉంటారు అయితే దేశంలోని హైకోర్టులో, సుప్రీంకోర్టులో వాదోపవాదాలు, రాతలు ఇంగ్లీషులోనే సాగుతున్నాయి. దిగువ కోర్టుల్లో మాత్రం ఆయా ప్రాంతాల భాషలలో కార్య కలాపాలు జరుగుతున్నాయి గాని చట్టాన్ని అన్వయించడానికి ఇంగ్లీషునే వినియోగిస్తున్నారు. నిర్ణయాల వెల్లడి కూడా వలస పాలకుల నాటి కోర్టుల్లో అనుసరించిన ఇంగ్లీషు విధానాన్నే అనుసరిస్తున్నారు. ఇంగ్లీషు భాష దేశంలోని 90 శాతానికి పైగా ప్రజలకు అర్థం కానిది. అవగాహన కూడ చేసుకోలేని పరిస్థితి ఉంది. 2019 నవంబరు నుంచి సుప్రీంకోర్టులో మాత్రం 9 ప్రాంతీయ భాషలలో అధికారికంగా న్యాయ తీర్పులను అందజేస్తున్నారు. ఇది ప్రశంసనీయమైన చర్య. కొవిడ్‌ 19 మహమ్మారి కాలంలో ఈ పరిస్థితి లేదు. మళ్లీ ప్రారంభిస్తున్నారు. తీర్పులను స్థానిక భాషల్లోకి తర్జుమా చేసి అందించటం పూర్తి స్థాయిలో జరగాలి. ముఖ్యమైన తీర్పులను తప్పనిసరిగా అన్ని స్థానిక భాషల్లో అందించాలి.
రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 348 (2) ప్రతి రాష్ట్రంలోని అధికార భాషను అక్కడి హైకోర్టులో అందించడానికి గవర్నర్‌కి అధికారం ఉంటుంది. ఈ విధానాన్ని వివిధ రాష్ట్రాలలో అమలు చేసేందుకు అనేక సార్లు జరిగిన ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం అడ్డుకొన్నది. 1965లో మంత్రివర్గ కమిటీ తీర్మానం ప్రకారం భారత ప్రధాన న్యాయమూర్తి ఆమోదం ముందుగా పొందాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అందువల్ల ప్రధాన న్యాయమూర్తి ఆయా రాష్ట్రాలలోని అధికార భాషల్లో వాదోపవాదాలు, తీర్పులు చెప్పేందుకు తన ఆమోదాన్ని వెల్లడిరచవలసి ఉంటుంది. కేవలం ఇంగ్లీషులోనే మాట్లాడగలిగి అర్థం చేసుకోగలిగిన వారిని ప్రాంతీయ భాషల్లోకి మారవలసిందిగా ఒత్తిడి చేయలేము. న్యాయం పొందే క్రమంలో అనేక అడ్డంకులు, ఆటంకాలు ఉన్నాయని ప్రధాన న్యాయమూర్తి రమణ అన్నారు. నియమ నిబంధనలు, ఇతర అంశాలు సులభంగా అర్థమయ్యేలాగా ఉండాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img