Friday, April 26, 2024
Friday, April 26, 2024

మోదీ ఓటమికి ప్రతిపక్ష ఐక్యత అవశ్యం

వినయ్‌ విశ్వం

నిర్ణయాత్మకమైన పోరాటం సమీపిస్తోంది. ఈ పోరాటంలో భారతదేశ స్వభావం స్పష్టం కానుంది. 2014 నుండి అధికారం చెలాయిస్తున్న శక్తులు క్షేత్రస్థాయి వాతావరణాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు మొండిగా వ్యవహరిస్తున్నాయి. ఈ పోరాటంలో గెలిచేందుకు ఈ శక్తులు కావలసిన వనరులను సమీకరించుకుంటున్నాయి. ఫాసిస్టు భావజాలం తొలినుండి అనుసరిస్తూ సవాళ్లను ఎదుర్కోవడంలో అత్యంత దారుణంగా వ్యవహరిస్తోంది. హిట్లర్‌, నరేంద్ర మోదీ మౌలిక లక్షణాలు ఒక్కటే. తమ జాతి గొప్పదని దూకుడు ప్రదర్శించడం, బడాపెట్టుబడికి లొంగిపోవడంలోనూ ఇద్దరూ ఒకటిగానే వ్యవహరించారు. అవసరమైతే మత హింసాకాండను ప్రజ్వరిల్లింప చేసేందుకు, సామూహిక హత్యాకాండకు ఎంతమాత్రం వెనుకాడరు. ప్రజలమధ్య చీలికలు సృష్టించేందుకు, మత విశ్వాసాన్ని ప్రజల మధ్య సామరస్యతను దుర్వినియోగం చేశారు. భారతదేశ సమైక్యతకు పునాది అయిన రాజ్యాంగాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాజ్యాంగ మౌలిక స్వరూపాలు ప్రజాస్వామ్య, లౌకికతత్వం ఆర్‌ఎస్‌ఎస్‌ నియంత్రణలో పనిచేస్తున్న బీజేపీ మౌలిక భావజాలానికి పూర్తిగా వ్యతిరేకం. వీరు మళ్లీఅధికారంలోకి రావడానికి అవకాశమిస్తే, దేశం తీవ్రప్రమాదంలో పడుతుంది. కీలకమైన ఈ సమయంలో ప్రతిక్షణం సమైక్య భారతదేశ భావనకు కట్టుబడిఉన్న శక్తులన్నీ అప్రమత్తంగా ఉండాలి. సెక్యులర్‌, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవడం ఈ విషయంలో అత్యంత ముఖ్యమైన అంశం. బీజేపీ ఓటమి ‘‘నేడు అత్యంత ప్రధానమైనది’’.
ఈ నేపధ్యంలో రాయ్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్‌ ప్లీనరీ సమావేశం అప్రమత్తమైంది. భారతదేశంలో 1885లో స్థాపితమైన రాజకీయ పార్టీ సెక్యులర్‌ భావజాలంతో భారీ సభలను నిర్వహించడంపై రాజకీయ పరిశీలకులు విభిన్నవిధాలుగా ఉందని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ చరిత్రలోనే కాంగ్రెస్‌ తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది. దాని గొప్పదనం, తిరుగులేని ప్రజాసమూహాల మద్దతు గత చరిత్రఅయింది. ప్రస్తుతం కాంగ్రెస్‌ చాలా తక్కువ రాష్ట్రాల్లో అధికారంలోఉంది. రాయ్‌పూర్‌ ప్లీనరీలో కాంగ్రెస్‌ ఓటమికి కారణాలేమిటో లోతుగా చర్చించవచ్చునని అంచనా వేసినవారు తప్పనిసరిగా నిరాశచెందుతారు. కాంగ్రెస్‌పార్టీ అంతలోతైన తీవ్రమైన లక్ష్యాన్ని చేపట్టేందుకు సిద్ధంగాలేదు. నయా ఉదారవాద ప్రపంచీకరణు ప్రభావంతో కాంగ్రెస్‌ గాంధీనెహ్రూ వారసత్వమార్గం నుంచి వైదొలగింది. ఫలితంగా సంప్రదాయంగా మద్దతు తెలియజేస్తున్న అణగారిన వర్గాలు, సెక్యులర్‌ ఆలోచనలు గలిగిన వారినుంచి దూరమైది. ఆర్‌ఎస్‌ఎస్‌బీజేపీ వర్గాలనుండి జవహర్‌లాల్‌ నెహ్రూకి వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తులద్వారా వస్తున్న భావజాల పరమైన దాడిని తిప్పికొట్టేందుకు ఎంతో చరిత్రకలిగిన పార్టీ విముఖంగా ఉంది. రాయ్‌పూర్‌ సమావేశంలో ఇలాంటి మౌలిక అంశాలు చర్చకే రాలేదు. అయితే సానుకూలమైన అంశం ఏమంటే బీజేపీపై పోరాడాలన్నది ఒక్కటే. కాంగ్రెస్‌ నాయకత్వంలో ఈ పోరాటం జరగాలని ఆ పార్టీ నాయకులు ప్లీనరీలో పిలుపు ఇచ్చినప్పటికీ రాజకీయ తీర్మానంలో ఇలాంటి అవాస్తవమైన అంశాన్ని పేర్కొనలేదు. తీర్మానంలో ప్రధానంగా పేర్కొన్న అంశం సెక్యులర్‌, సోషలిస్టు శక్తుల ఐక్యత అన్నదే ముఖ్యమైనది. సెక్యులర్‌, ప్రజాస్వామ్య, వామపక్ష శక్తులు సానుకూలంగా చర్చలు జరిపేందుకు అవసరమైన అవకాశాన్ని తీర్మానంలో పొందుపరచారు.
రాజకీయ పార్టీలు తమ సొంత ఆలోచనలు అనుసరించవలసిన మార్గాలను, నాయకత్వ పదవులను నిర్వహిస్తాయి. అధికారం, పరిపాలనకు సంబంధించి ఆయా పార్టీలకు సొంత ఆలోచనలు ఉండవచ్చు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రశ్న ప్రధానమైన శత్రువు ఆర్‌ఎస్‌ఎస్‌ నియంత్రణలో ఉన్న బీజేపీని ఓడిరచడం ఎలా అన్నదే భారతదేశం చిరకాలంగా కట్టుబడిఉన్న విలువలకు వ్యతిరేకంగా ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలు పనిచేస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో మూడవసారి కూడా ఏ విధంగానైనా విజయంసాధించి అధికారాన్ని చేపట్టాలని ఈ శక్తులు తహతహలాడుతున్నాయి. బీజేపీకి వ్యతిరేక పోరాటంలో రాజకీయ విభేదాలు నాయకత్వ పాత్ర లాంటి విషయాలు ఆటంకం కారాదు. సెక్యులర్‌, ప్రజాస్వామ్య, వామపక్ష శక్తులు ఐక్యమై పోరాడేందుకు ప్రతి చిన్న అవకాశాన్ని విడిచిపెట్ట కూడదు. ఎందుకంటే ఫాసిజంపై పోరాడి దాన్ని ఓడిరచేందుకు ఏ మాత్రం మరో అవకాశాన్ని తీసుకోకూడదు. విశాలమైన ఐక్యతద్వారా పోరా డేందుకు వ్యూహాన్ని రచించుకోవాలి. చిన్నదైనా, పెద్దదైనా ఎత్తుగడల్లో పొరపాటు జరిగితే దేశ భవిష్యత్తుకు తిరుగులేని నష్టం జరుగుతుంది. తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె అధ్యక్షుడైన ఎంకె స్టాలిన్‌ ఈ స్పూర్తిని అర్థం చేసుకున్నారు. స్టాలిన్‌ 71వ జన్మదినోత్సవం సందర్భంగా జరిగిన వేడుకల్లో పాల్గొన్న వివిధ పార్టీ నాయకులను ఉద్దేశించి స్టాలిన్‌ మాట్లాడుతూ, రాజకీయ సమైక్యతను గూర్చి మాట్లాడారు. బీజేపీని ఓడిరచేందుకు జరిగే చరిత్రాత్మక పోరాటంలో దక్షిణాదిలోఉన్న రాజకీయశక్తులు సమైక్య భావాలను ద్రవిడ నాయకుడు పిలుపునిచ్చారు. వీలైనంత విశాలమైన ఐక్యతను త్వరగా నిర్మించాలని పిలుపునిచ్చిన మొదటి పార్టీ సీపీఐ. ఈ దిశలో దేశంలోని ఏ పార్టీ చొరవ తీసుకున్నప్పటికీ సీపీఐ ఆహ్వానిస్తున్నది. ప్రథమ శత్రువుపై పోరాడవలసిన ఆవశ్యకతపై పార్టీకి స్పష్టమైన అవకాశం ఉంది. ఇటీవల పుదుచ్చేరిలో జరిగిన సీపీఐ జాతీయ సమితి సమావేశంలో బీజేపీని ఓడిరచి దేశాన్ని రక్షించండనే దృక్పధంతో ఉంది. సీపీఐ సొంతంగా, ఐక్యప్రజా కార్యా చరణ ద్వారా ఈ సందేశాన్ని మన దేశ భవిష్యత్తు నిర్ణేతలైన ప్రజలకు అందించేందుకు పార్టీ ద్విగుణీకృత కృషి చేస్తుంది.
వ్యాస రచయిత సీపీఐ కార్యదర్శి

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img