Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రాహుల్‌ అంటే బీజేపీకి దడ…!

నీలోఫర్‌ సుహ్రావర్ది

తనపై నమోదైన పరువు నష్టం ఆరోపణలు తనను తేలికగా వదిలి పెట్టే అవకాశం లేదన్న విషయం కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ, ఆయన సన్నిహితులకు బాగా తెలుసు. మార్చి 23న సూరత్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు రాహుల్‌పై నేరపూరిత పరువునష్టానికి సంబంధించి ‘‘దోషి’’గా పేర్కొనడంపై స్టే విధించాలంటూ చేసిన విజ్ఞప్తిని (ఏప్రిల్‌ 20) సూరత్‌ కోర్టు తిరస్కరించింది. రాహుల్‌ నేరారోపణపై స్టే విధించాలని కోరుతూ ఆయన చేసిన పిటిషన్‌పై విచారణ జరిగేంత వరకు జిల్లా, సెషన్స్‌ కోర్టు ఏప్రిల్‌ 3న ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. 2024 పార్లమెంటరీ ఎన్నికలు ముగిసే వరకు రాహుల్‌కు చట్టపరమైన ఉపశమనం కలిగించే అవకాశాలు చాలా తక్కువగా ఉండవచ్చు. ‘‘మోదీ ఇంటిపేరు’’పై పరువు నష్టం కేసులో దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై మే 15 వరకు స్టే విధించాలని పాట్నా హైకోర్టు పేర్కొంది. బీజేపీ నాయకుడు సుశీల్‌ కుమార్‌ మోదీపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులో దిగువ కోర్టు జారీ చేసిన సమన్లను రద్దు చేయాలని ఏప్రిల్‌ 22 న పాట్నా హైకోర్టులో రాహుల్‌ దాఖలు చేసిన పిటిషన్‌కు ప్రతిస్పందనగా ఇది జరిగింది. ఈ నేపధ్యంలో పాట్నా హైకోర్టు ఇచ్చిన స్టే తాత్కాలిక ఉపశమనం.
పార్లమెంటు సభ్యులు రాహుల్‌ను క్షమాపణ చెప్పాలని కోరుతూ చేసిన ఒత్తిడి, రచ్చ ప్రస్తుత రాజకీయ పోరాటంలో మరో ఉదాహరణ. ప్రస్తుతం రాహుల్‌ను ఇంతకు ముందులాగా ‘‘పప్పు’’ అని పిలవడంలేదు. ఈ పదాన్ని ఉపయోగించిన వారు ఇప్పుడు దాని ప్రభావం అంతగాలేదన్న భయంతో ఉన్నారు. రాహుల్‌ భారత్‌ జోడో యాత్రలో వివిధ స్థాయిలలోని వ్యక్తులతో అతను ప్రవర్తించిన తీరు, ప్రసంగాలు, మీడియా కవరేజీ రాహుల్‌పై భారతీయులు భారత్‌జోడో యాత్రలో స్వంత అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడానికి తోడ్పడిరది. రానున్న ఎన్నికలలో బీజేపీికి రాహుల్‌ ‘‘ప్రజాదరణ’’ ప్రధాన రాజకీయ ముప్పుగా పరిణమించే అవకాశా లున్నాయి. బీజేపీ సొంత గూటిలోనే పొంచి ఉన్న ప్రమాదాలపై మరింత శ్రద్ధ వహించవలసిన అవసరం ఉంది. బీజేపీ నాయకులు ప్రధానమంత్రి పీఠం కోసం ప్రయత్నిస్తున్నారనే ఊహాగానాల నేపధ్యÛంలో, పార్టీలో అంతర్గత విభేదాలు పార్టీ క్షీణతకు కారణమయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో బీజేపీకి చెందిన ప్రాంతీయ మిత్రపక్షాలు చివరి నిమిషంలో నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌(ఎన్‌డిఎ) నుండి వెనక్కి తగ్గే అవకాశాలను కొట్టిపారేయలేం. ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని ఆయా రాష్ట్రాల్లో పట్టు సాధించడం, ఆ తర్వాత ఆయా ప్రాంతాల్లో ఆ పార్టీల రాజకీయ ప్రాధాన్యతను తగ్గించేందుకు వ్యూహాలు పన్నడం బీజేపీ విధానం. జనతాదళ్‌(యునైటెడ్‌) అధినేత, బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ఎన్‌డిఎతో తెగతెంపులు చేసుకుని, రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జెడి)తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇప్పుడు అన్ని ప్రతిపక్ష పార్టీ ఐక్య సంఘటన ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తున్నారు.
కొన్ని కీలక ప్రాంతీయ పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాయి. కాంగ్రెస్‌తో కలిసి 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొన్ని పార్టీలు సుముఖంగా లేవు. పార్లమెంటరీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ వ్యత్యాసం సమసిపోయే అవకాశం ఉంది. రాహుల్‌ గాంధీ 2024 ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా మిగిలిపోతే, ప్రతిపక్ష పార్టీలు బీజేపీ వ్యతిరేక కూటమి (కాంగ్రెస్‌తో కూడా భాగస్వామి)తో ఒక ఒప్పందానికి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. బీజేపీపై అవినీతి ఆరోపణలు, ఆర్థిక సమస్యలు, రైతుల అశాంతి, ప్రజాస్వామ్య సంక్షోభం ఉన్నాయి. బీజేపీ ప్రభావం చూపుతుంది. పాక్‌ వ్యతిరేక ఉగ్రవాద ఆరోపణలు, మతపరమైన సంఘటనలతో పాటు మోడీ-హైప్‌ ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రగిలిస్తోంది.
2014, 2019లో బీజేపీ చేపట్టిన అంతర్గత-జాతీయ ఎన్నికల వ్యూహాల్లో భాగంగా మొదట కాంగ్రెస్‌ను అధికారం నుండి బయటకునెట్టి తిరిగి అధికారంలోకి రాకుండా కుయుక్తులు పన్నింది. వచ్చే ఎన్నికలలో ఈ వ్యూహం పరిమిత ప్రభావం చూపుతుంది. బీజేపీ ప్రముఖులు చేపట్టిన కాంగ్రెస్‌ వ్యతిరేకత, రాహుల్‌ వ్యతిరేక వ్యూహాలు ఇప్పుడు నిరుపయోగం అయ్యాయి. భారత్‌ జోడోయాత్ర వల్ల రాహుల్‌కు మీడియా కొంత ప్రాధాన్యత నిస్తోంది. పార్టీలో అంతర్గత పోటీవల్ల బీజేపీిలో చీలికను సృష్టించే అవకాశాలు కూడా ముమ్మరంగా ఉన్నాయి. మోదీ దాదాపు 10ఏళ్లుగా అధికారంలో ఉన్నారు. మోదీ ‘విజయాల’ గురించి ఆర్భాటంగా సాగుతున్న ప్రచారం వల్ల ప్రయోజనం తగ్గుతోంది. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రతిపక్షాలు మంద్రస్థాయిలో ప్రచారం చేయనున్నారని సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈసారి ప్రతిపక్షాలు గట్టిగా మాట్లాడతారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల పొత్తు ఎలా ఉన్నా, రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ల నుంచే కాకుండా మోదీకి, బీజేపీకి కూడా వివిధ రాజకీయ సవాళ్లు ఎదురవనున్నాయనేది సత్యం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img