Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సామాజిక న్యాయంతోనే కార్మికులకు భద్రత

డా. జ్ఞాన్‌ పాఠక్‌

ప్రపంచవ్యాప్తంగా అసమానతలు పెరుగుతున్నందున కార్మికులకు సామాజిక న్యాయంతోనే భద్రత కలుగుతుందని అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్‌ఓ) ప్రకటించింది. ఈ అంశాన్ని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎమ్‌ఎఫ్‌), ప్రపంచబ్యాంకుకు స్పష్టంగా తెలియజేసింది. ఇప్పటికే అనేక విధాలుగా బాధలుపడుతున్న ప్రపంచ కార్మిక మార్కెట్‌లో కార్మికులు స్థితిగతులు మరింతగా దిగజారకుండా సామాజిక న్యాయం కల్పించడంలో అత్యంత కీలకమైనదని ఐఎల్‌ఓ తెలియజేసింది. 2023లోనూ ఆర్థిక రంగం మందగిస్తుందని ఐఎల్‌ఓ అంచనా వేసింది. ఆర్థికమాంద్యం పెరుగుతున్న నేపధ్యంలో ప్రపంచబ్యాంకు, ఐఎమ్‌ఎఫ్‌లు వాషింగ్టన్‌లో ఇటీవల సమావేశ మయ్యాయి. ఆర్థికమాంద్యంలో సామాన్యప్రజల జీవనవ్యయం మరింత పెరుగుతుందని, వారి పరిస్థితులు ఇంకా దిగజారిపోతాయనిఈ సమావేశం అభిప్రాయపడిరది. ఈ స్థితినుంచి ప్రజలను ఎలా బైట పడవేయాలి అనే అంశాన్ని చర్చించినట్టు చెబుతున్నారు. అయితేఈ సంస్థలు సంపన్నవర్గాల వృద్దికే దోహదం చేస్తాయిగానీ, ఇది సహాయం అందించిన చాలా వర్థమాన దేశాలు, పేదదేశాలు మరిన్ని ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్నాయనేది వాస్తవం. ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుదల, నిరుద్యోగం మరింత తీవ్రతరం కావడం, ఉద్యోగ అవకాశాలు దారుణంగా తగ్గిపోవడం లాంటి అంశాలు అత్యంత ఆందోళన కలిగిస్తున్నాయి.
పెరుగుతున్న అసమానతలు ప్రపంచవ్యాప్తంగా సమాజం అభివృద్ధివైపు పయనం, ఆర్థికవృద్ధిరేటు తగ్గుతున్న స్థితిలో కార్మిక మార్కెట్‌ పరిస్థితి మరింత దిగజారుతుంది. యాంత్రీకరణ, కృత్రిమమేధస్సు విస్తరిస్తున్నది. వాస్తవంగా మనిషి శ్రామికశక్తిద్వారా మాత్రమే సమాజం అభివృద్ధి చెందాలి. యాంత్రీ కరణ, కృత్రిమ మేధస్సు విస్తరిస్తున్నకొలదీ పనులులేనివారి సంఖ్య అపారంగా పెరిగిపోతోంది. ప్రజల పాత్రలేని ఆర్థిక అభివృద్ధి సమాజానికి హితకరమైనది కాదు. 2023లో ప్రపంచ ఉద్యోగరంగవృద్ధి కేవలం 1శాతమే ఉంది. 2022లో పెరిగిన ఉద్యోగిత రేటు కంటే 2023లో పెరిగినరేటు సగానికంటే తక్కువగాఉంది. ఐఎల్‌ఓ అంచనాప్రకారం, ప్రపంచ ఉద్యోగాల సృష్టి మూడు మిలియన్లు అధికంగా ఉండవచ్చు. 2022లో ఇది 208 మిలియన్లు ఉన్నది. ఈ సంవత్సరం ఇది మరింత తగ్గిపో నున్నది. కొనుగోలుశక్తి తరిగిపోతుంది. పర్యావరణ సుస్థిరత దిగజారుతున్నది. మానవ సంక్షేమం దెబ్బతింటున్నది. ఇవన్నీ పరస్పరం ఒకదానితో ఒకటి అనుసంధాన మైన సంక్షోభాలే. కోవిడ్‌ మహమ్మారి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆదాయ భద్రత సమస్య చాలా తీవ్రంగా మన ముందు నిలిచింది. ప్రపంచంలో దాదాపు సగం మందికిపైగా ఎటువంటి సామాజిక రక్షణ లేకుండా జీవించవలసివచ్చింది. అసంఘటిత ఆర్థికవ్యవస్థలో 200కోట్ల మందికిపైగా కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవ్యవస్థలు, సమాజాలు ఎదుర్కొనే సవాళ్లను అధిగమించేందుకు సామాజిక న్యాయం తప్పనిసరని ఐఎల్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ గిల్‌బర్ట్‌ ఎఫ్‌ హంగ్‌బో తెలియజేశారు. సుస్థిర అభివృద్ధి, ఆర్థిక వృద్ధికోసం సమన్వయంతో కూడిన బహుళ కార్యా చరణ మాత్రమే సమాజవృద్ధిని పటిష్టం చేస్తుంది అని అన్నారు. సామాజిక న్యాయం, సమాజాలు తమ ఆర్థికవ్యవస్థను సమన్వయంతో పనిచేయగలవని, పేదరికాన్ని, ఆకలిని, అసమానతలను, సామాజిక ఉద్రిక్తతలను తగ్గించ గలవని ఐఎల్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ హంగ్‌ బో వెల్లడిరచారు. సమ్మిళిత, సుస్థిర సామాజిక`ఆర్థిక వృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఉండాలి. ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు బహుళ కార్యాచరణను కొనసాగించడం అత్యంత కీలకమైన అంశమని హంగ్‌బో అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ఆర్థిక కమిటీ, ప్రపంచ బ్యాంకు అభివృద్ధికమిటీల ప్రకటనలను హంగ్‌బో విశ్లేషించారు. ఈ రెండు కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, సామాజిక, వాతావరణ దృక్పధం నిరాశాజనకంగా ఉన్నాయని స్పష్టం చేశాయి. ఫలితంగా జీవనవ్యయం సంక్షోభం ఏర్పడుతుంది. సార్వత్రిక సామాజిక భద్రతకోసం ఆరోగ్యకరంగాఉన్న ఆర్థికవ్యవస్థ మద్దతు ఎంతైనా అవసరమని హంగ్‌బో తెలిపారు.
ప్రపంచ ఆర్థికవ్యవస్థ మాంద్యం కారణంగా కార్మికులు అతి తక్కువ నాణ్యతగల, తక్కువ వేతనాలు చెల్లించే ఉద్యోగాలలో సర్దుకుపోవలసిన అవసరం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కార్మిక మార్కెట్‌లో పురుషుల పాత్ర 72శాతం ఉండగా, మహిళల పాత్ర 48శాతమే ఉంది. ఐదుగురిలో ఒకరికంటే ఎక్కువ పనిలేని, విద్య లేదా శిక్షణలేని వారు ఉన్నారు. అదే సమయంలో వేతనాల వ్యత్యాసం ఎక్కువగా ఉంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం అధిగమించేందుకు నిజవేతనాలను చెల్లించాలి. ఉత్పాదకత వృద్ధితో సమంగా వీరి వేతనాలు కూడా పెరగాలి. తక్కువ వేతనాలు పొందేవారి కొనుగోలు శక్తి కూడా తక్కువగా ఉంటుంది. అప్పుడు అదాయ వ్యత్యాసం, పేదరికం పెరుగు తోంది. వీటిని సర్దుబాటు చేయకపోతే ప్రజాజీవనం మరింత దిగజారుతుంది. కోవిడ్‌మహమ్మారి అనంతర పరిస్థితి మెరుగుపరచడానికి చర్యలు తీసు కోవాలి. ఈ చర్యలు లేకపోవడం వల్ల సమాజంలో అశాంతి పెరుగుతుంది. ప్రజలందరి పురోభివృద్ధి, శాంతి లక్ష్యసాధన తగ్గిపోతుంది. కొనుగోలు శక్తి, జీవనప్రమాణాలు, కార్మికుల వేతనాలు పెరగడానికి వారి కుటుంబాలు మెరుగ్గా జీవించడానికి కావలసిన మెరుగైన విధాన చర్యల ప్రణాళికను రూపొందించాలని హంగ్‌బో కోరారు. సార్వత్రిక సామాజిక భద్రత మానవాళి హక్కు, ప్రభుత్వ బాధ్యత అని ఆయన తెలియజేస్తూ అంతర్జాతీయ సమాజం తోడ్పాటును కోరారు. మనకుఉన్న వనరులను మరింతమెరుగ్గా వినియోగించు కోవడం, అదనపు వనరులను సమీకరించడం ప్రస్తుతంఉన్న ఆర్థిక వ్యూహాలకు మరింత బలం చేకూరుతుందని హంగ్‌బో అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ ఆర్థికవనరులు, బహుళ దేశీయ కార్యాచరణల మధ్య సమన్వయం మరింత పెరగాలని ఆయన సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img