Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

పదిలో పార్వతీపురం ప్రథమ స్థానం పట్ల జిల్లా కలెక్టర్ హర్షం

విశాలాంధ్ర,పార్వతీపురం : పదవతరగతి ఫలితాల్లో పార్వతీపురం మన్యంజిల్లా వరుసగా రెండోఏడాది కూడా మొదటి స్థానంలో నిలిచి విజయ కేతనం ఎగురవేయడం పట్ల జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ హర్షం వ్యక్తంచేశారు.రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన ఫలితాల్లో 96.37 శాతంతో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. గత ఏడాది 87.47శాతంతో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.
ఈఏడాది 10వేల64మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా,ఇందులో 4861 మంది బాలురు, 5203 మంది బాలికలుఉన్నారని చెప్పారు.8955 మంది విద్యార్థులు ప్రథమస్థానంలోను, 854 మంది ద్వితీయస్థానంలోనూ, 255 మంది తృతీయ స్థానంలో ఉత్తీర్ణత సాధించారు.
జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలలో భాగంగా అనేక పాఠశాలలు శతశాతం ఫలితాలు సాధించగా , జిల్లా కేంద్రంలోని టిఆర్ ఎం ప్రభుత్వ పాఠశాల విద్యార్థి కె వి గౌతమి 591 మార్కులతో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ జిల్లాలో అమలు చేసిన “నా బడి నాకు గర్వకారణం” కార్యక్రమంతో మంచి ఫలితాలు సాధనకు దోహదం చేశాయి.
ఈకార్యక్రమంలో భాగంగా జిల్లా అధికారులను ఉన్నత పాఠశాలలకు దత్తత అధికారులుగా నియమించడం జరిగింది. దత్తత అధికారులు వారంలో కనీసం రెండు సార్లు పాఠశాలను సందర్శించి విద్యార్థులలో విద్యా ప్రమాణాలు, భవిష్యత్తులో విద్యావకాశాలు, ఉన్నత అధికారులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోసం స్ఫూర్తిని కలిగించడం జరిగింది. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, సీతంపేట ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కల్పనా కుమారి, పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి. విష్ణు చరణ్ తో సహా అందరూ జిల్లా అధికారులు దత్తత అధికారులుగా ఉంటూ తమ పాఠశాలలను సందర్శిస్తూ ఉపాధ్యాయ బాధ్యతలతో పాటు వ్యక్తిత్వ వికాస నిపుణులుగా వ్యవహరించారు.
వరుసగా రెండోఏడాది కూడా పార్వతీపురం మన్యంజిల్లారాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవడం పట్ల జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు.నాకు మొదటి ర్యాంక్ వచ్చినంత ఆనందంగా ఉంది. గొప్ప సంతృప్తినిచ్చింది” అంటూ ఆయన తెలిపారు.అందరి సమష్టికృషని, ఇందులో భాగస్వామ్యమయిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, దత్తత అధికారులు అందరికీ ఈ విజయం అంకితమన్నారు. ఇదే స్ఫూర్తి భవిష్యత్తులోనూ కొనసాగి జిల్లా ఆదర్శంగా నిలవాలని ఆకాక్షించారు. జిల్లా ప్రథమ స్థానంలో నిలిచినందుకు జిల్లా విద్యాశాఖాధికారి గార పగడాలమ్మ, జిల్లాఅధికారులు జిల్లా కలెక్టర్ ను కలిసి అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img