Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

ఎన్నికల విధుల్లో వైఫల్యాలకు కఠిన చర్యలు

జిల్లా ఎన్నికల అధికారి
విశాలాంధ్ర,పార్వతీపురం: ఎన్నికల విధుల్లో వైఫల్యాలకు కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ హెచ్చరించారు. రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, మండల పరిషత్ అభివృద్ది అధికారులతో జిల్లా కలెక్టరు కార్యాలయంలో ఎన్నికలపై జిల్లా ఎన్నికల అధికారి సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయి సంసిద్ధత ఉండాలన్నారు. వచ్చే పది రోజులు కీలకమని, ప్రతి అంశంపై శ్రద్ద వహించాలని ఆయన ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై వచ్చే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రిటర్నింగ్ అధికారి స్థాయిలో చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలకు నియమించిన ప్రతి బృందం సూక్ష్మ పరిశీలన చేయాలని, నియమావళి ఉల్లంఘనకు పాల్పడుతున్న ఉద్యోగులను కూడా గుర్తించాలని సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు నలుగురు ఉద్యోగులను విధుల నుండి తొలగించడం జరిగిందని ఆయన తెలిపారు. ఎన్నికలలో భాగంగా నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, హింస, ప్రలోభాలు వంటి అంశాలపై దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. వీటిపై గట్టి నిఘా ఉండాలని, ఎటువంటి ఉల్లంఘనలు ఉన్నా కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సైతం ఆదేశాలు జారీ చేశారని ఆయన అన్నారు. ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలను విధిగా పాటించాలని ఆయన ఆదేశించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు ముమ్మరం చేయాలని, సీజర్ లు ఎక్కువ ఉండాలని ఆయన ఆదేశించారు. పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు. అన్ని బృందాలకు గుర్తింపు కార్డులు జారీ చేయాలని, వాహనాలకు ఎన్నికల కమీషన్ విధుల స్టిక్కర్లు అతికించాలని ఆయన చెప్పారు. ఇ వి ఎం ల రెండమైజేశన్ లో భాగంగా ఏజెంట్లు పెన్ను, పెన్సిల్, సెల్ ఫోన్లు తదితర సామగ్రి లోనికి తీసుకురాకూడదని ఆయన స్పష్టం చేశారు. పోస్టల్ బ్యాలెట్ వేసే కేంద్రం చుట్టు ప్రక్కల రాజకీయ కార్యకలాపాలు ఉండరాదని, వాటిపై దృష్టి సారించాలని సూచించారు.
12,13,15 తేదీల్లో శిక్షణ:
ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు ఈ నెల 12, 13, 15 తేదీల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
సీతంపేట ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి మరియు పాలకొండ శాసన సభ నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి కల్పనా కుమారి, పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి మరియు సాలూరు శాసన సభ నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి సి. విష్ణు చరణ్, పార్వతీపురం రెవిన్యూ డివిజనల్ అధికారి మరియు పార్వతీపురం శాసన సభ నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి కె.హేమలత, పాలకొండ రెవిన్యూ డివిజనల్ అధికారి మరియు కురుపాం శాసన సభ నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి వి వెంకట రమణ తమ నియోజక వర్గాలలో చేపట్టిన పనులను వివరించారు. ఈ సమావేశంలో  జాయింట్ కలెక్టర్ ఎస్ ఎస్ శోబిక, ఇన్ ఛార్జ్ జిల్లా రెవిన్యూ అధికారి జి కేశవ నాయుడు,  ఎస్డిసి ఆర్ వి సూర్యనారాయణ, పార్లమెంటు నియోజకవర్గం సహాయ రిటర్నింగ్ అధికారి కె రామచంద్ర రావు, నోడల్ అధికారులు –  జిల్లా పరిశ్రమల అధికారి ఎం.వి.కరుణాకర్, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి లోచర్ల రమేష్, జిల్లా రవాణా అధికారి సి మల్లిఖార్జున రెడ్డి, జిల్లా ప్రజా రవాణా అధికారి టి వి ఎస్ సుధాకర్,తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, మండల పరిషత్ అభివృద్ది అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img