Friday, April 26, 2024
Friday, April 26, 2024

అకాలవర్షాలతో నష్టపోయిన ప్రత్తి రైతులను ఆదుకోవాలి

ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవండ్ల శ్రీనివాస్‌

విశాలాంధ్ర`పుల్లలచెరువు : ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన పత్తి రైతులకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవండ్ల శ్రీనివాస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ మండలంలో దాదాపుగా తొమ్మిది వేల ఎనిమిది వందల ఎకరాల్లో ప్రత్తి సాగు చేశారన్నారు. శనివారం ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం బృందం మండలంలోని పిటికిటివానిపల్లెలోని పొలాలను పరిశీలించారు. దాదాపు 900 ఎకరాల విస్తీర్ణంలో పత్తి పంటను రైతులు సాగుచేశారని, ఆరుగాలం రైతులు కష్టపడి పత్తి పంటను సాగు చేసి పత్తి వచ్చే సమయానికి అకాల వర్షాలకు చేతికి వచ్చిన ప్రత్తి కాయతో సహా నీట మునిగిందని, దాదాపు 30,500 రూపాయలు ఎకరాకు రైతులు పెట్టుబడి పెట్టి నష్టపోయారని ఈ ప్రాంత రైతులు పెట్టిన పెట్టుబడి రాక అప్పుల పాలవుతున్నారని, పలువురు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. వ్యవసాయ శాఖ అధికారులు పంట పొలాలను పరిశీలించి రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని ఆ విధంగా వ్యవసాయ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపి రైతులను ఆదుకునే విధంగా చర్యలు చేపట్టేలా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఎర్రగొండపాలెం ఏపీ రైతు సంఘం గౌరవఅధ్యక్షులు టి.సి.హెచ్‌ చెన్నయ్య మాట్లాడుతూ ఎకరాకి పత్తి విత్తనాలు దాదాపు 2000 రూపాయలు ఖర్చు చేశారని, ఎరువులు మందులు ఎకరాకు 8000 రూపాయలు పురుగుమందులు 5000 రూపాయలు అంతర్గత సేద్యం కోసం పదివేల రూపాయలు కూలీలు ఖర్చవుతున్నాయని నాట్లుకి కూలీలు ఖర్చు కూడా విపరీతంగా ఖర్చవుతుంది ఈ నేపథ్యంలో ప్రతి సాగు చేసారు. దాదాపు ఎకరాకు రూ.30,000 నుంచి రూ.35 వేల వరకు రైతులు వెచ్చిస్తున్నారని అన్నారు. వ్యవసాయాన్ని నమ్ముకుని పంటలు పండిస్తున్న రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం వెంటనే చెల్లించి ఆదుకోవాలని ఆయన ప్రభుత్వానికి తెలియజేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు భరోసా పేరుతో ఇచ్చే సంక్షేమ పథకాలు రైతుకు ఇస్తున్నారే కానీ సేద్యానికి ఇటువంటి ప్రయోజనం లేదని రైతులు ఆరోపిస్తున్నారు పురుగుమందులు ఎరువులు ధరలు విపరీతంగా పెరిగాయని పెట్టుబడికి చకరాలకు వేల రూపాయల ఖర్చు అవుతుందని రైతులు బ ృందానికి తెలిపారు ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు రైతులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ క్రైస్తవ సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తుంది. చర్యలు చేపట్టకపోతే రైతును సమీకరించి ధర్నాకు దిగుతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల సిపిఐ నాయకులు జీవి గురునాథం ,గుంటూరు శ్రీనివాసరాచారి, పిడికిటివాని పల్లి రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img