Wednesday, August 17, 2022
Wednesday, August 17, 2022

ఆగిన లారీని ఢీకొన్న ఆవు దూడల ఆటో……

రెండు ఆవు దూడ లతోపాటు రైతు మృతి
6 ఆవు దూడలకు,మరొకరికి గాయాలు
ఆటోలోనే మృతి చెందిన ఆవు దూడలు…

విశాలాంధ్ర బల్లికురవ : అద్దంకి నార్కట్ పల్లి రహదారిపై మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక రైతుతో పాటు,2 ఆవు దూడలు మృతి చెందాయి.వివరాల్లోకి వెళితే పల్నాడుజిల్లా దాచేపల్లి నుండి తమిళనాడుకు సిమెంటు లోడుతో వెళ్తున్న లారీ మండలంలోని వైదన గ్రామ సమీపంలో డ్రైవర్ బహిర్భూమికి వెళ్లేందుకు రహదారి పక్కన నిలిపివేశాడు.ఇదే సమయంలో పల్నాడు జిల్లా ఆవులవారిపాలెం గ్రామం నుండి కడప జిల్లాకు ఆవు దూడలతో వెళుతున్న ఆటో ఆగి ఉన్న లారీని వెనుక వైపు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఆటో ముందుభాగంలో కూర్చున్న రైతు తిరుమల.కోటయ్య (55)చిత్రమైన క్యాబిన్ భాగాలలో ఇరుక్కుపోయాడు. రెండు కాళ్లు మోకాలి భాగం వరకు తెగిపోయి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. డ్రైవర్ రామకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి.2 ఆవు దూడలు సంఘటనా స్థలంలోనే మృతిచెందగా,6 ఆవుదూడలకు నోటి భాగంలో తీవ్రంగా దెబ్బలు తగిలాయి.క్యాబిన్ లో ఇరుక్కుపోయిన కోటయ్య మృతదేహాన్ని బయటకు తీసేందుకు పోలీసు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.సమాచారం అందుకున్న ఎస్ ఐ వేమన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ రామకృష్ణ ను అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గాయపడ్డ ఆవులకు సమీపంలోని గోపాలమిత్రల ను,పశు వైద్యశాల సిబ్బందిని రప్పించి ప్రథమ చికిత్స చేయించారు.ఎస్ఐ వేమన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img